pizza

“A story like Ghaati has never been seen on Indian screens before” – Krish Jagarlamudi
'ఘాటీ' లాంటి కథ భారతీయ సినిమా తెరపై ఇంతవరకూ రాలేదు - క్రిష్ జాగర్లమూడి

You are at idlebrain.com > news today >

3 September 2025
Hyderabad

Krish Jagarlamudi is a distinctive filmmaker known for his unique storytelling style. He often weaves social themes into his narratives, trying to question and reflect on society through cinema. Right from Gamyam to Ghaati, the stories he has chosen stand as proof of this approach. As part of promotions for Ghaati, Krish gave an interview to Idlebrain’s Jeevi. With Anushka Shetty making a return to the screen after a long time, the film has created additional buzz. Ghaati is set for a grand multilingual release on September 5, in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada.

Krish shared that for him, the journey matters more than the destination. In his 17-year-long film career, he feels fortunate to have been able to tell diverse stories and finds great satisfaction in doing so. He said he is just as excited about narrating Ghaati to audiences today as he was when telling the story of Gamyam years ago. Though he hasn’t been able to spend much time with family due to his profession, he considers himself lucky to have such an understanding support system at home.

When asked why he often casts non-Telugu heroes in female-led stories, Krish responded that he usually visualizes actors while writing his scripts. The only exception was Allu Arjun in Vedam—he wasn’t initially considered, but after hearing the story, Allu Arjun chose the role of Cable Raju himself. Krish credited a major share of Vedam’s success to Allu Arjun. Regarding Ghaati, Krish said he had Vikram Prabhu in mind right from the time he began writing the character “Deshiraju.” The moment he thought of a strong yet gentle soul with mountainous presence, he felt Vikram was the perfect fit and approached him accordingly.

Krish revealed that Anushka accepted Ghaati film not because hi is a friend or the Vedam director. The Ghaati came into being because of Anushka, for Anushka, and with Anushka. He said every character in Ghaati will appear fresh and different, and that a story like Ghaati has never been seen on Telugu screens before. Anushka, having learned action and fight sequences thoroughly through Baahubali, has delivered a stellar performance in this film, which opens the audience to an entirely new world.

Krish promised that viewers will walk out of the theatre with their hearts full after watching Ghaati. Even when compared to Arundhati, he believes the character of Sheelavathi in Ghaati stands a notch above. He stated that this film is very important to his career and that he gave his word to Anushka that it would be a definite hit. Krish also expressed how deeply he felt the loss of legendary lyricist Sirivennela Sitarama Sastry, who was a great support for him.

Speaking about NTR, Krish said, “That film was made with great love and care. To this day, I consider it one of my best works. Balakrishna garu gave an outstanding performance. Unfortunately, the timing of the release didn’t work in its favor. I was truly hurt that the film didn’t receive the recognition it deserved.” He mentioned that his father always says that had the film released closer to the 2024 elections, it would have done hundreds of crores in business. If another film with Balakrishna happens in the future, Krish said, “Only Balakrishna garu should announce it.”

'ఘాటీ' లాంటి కథ భారతీయ సినిమా తెరపై ఇంతవరకూ రాలేదు - క్రిష్ జాగర్లమూడి

క్రిష్, ఓ విలక్షణ దర్శకుడు. తనదంటూ ఓ విభిన్న శైలితో కథలను రాస్తూ ఉంటారు క్రిష్. వీలైనంత వరకూ తన కథల్లో సామాజిక అంశాలను స్పృశిస్తూ సమాజాన్ని ప్రశ్నించడానికే ప్రయత్నిస్తుంటారు దర్శకుడు. నాటి 'గమ్యం' నుండి నేటి 'ఘాటీ' వరకూ ఆయన ఎంచుకున్న కథలే దానికి నిదర్శనం. 'ఘాటీ' ప్రమోషన్లో భాగంగా 'ఐడిల్ బ్రెయిన్' జీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు క్రిష్. చాలా కాలం తరువాత హీరోయిన్ అనుష్క కనిపిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో అదనపు క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ఈ నెల అయిదో తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

తన జీవితంలో డెస్టినేషన్ కంటే జర్నీయే ప్రధానమన్న క్రిష్, తన పదిహేడేళ్ల సినీ ప్రస్థానంలో ప్రేక్షకులకు విభిన్న కథలను చెప్పే అవకాశం తనకు దొరికిందని, ఆ క్రమంలో చాలా సంతోషంగానే ఉన్నానన్నారు. ప్రేక్షకులకు 'గమ్యం' సమయంలో కథ చెప్పడానికి ఎంత ఆసక్తిగా ఉండేవాడినో, ఇప్పటి 'ఘాటీ' విషయంలో కూడా అంతే ఆసక్తితో ఉన్నానన్నారు. వృత్తి రీత్యా కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయినా, అర్ధం చేసుకునే కుటుంబం ఉండటం తన అదృష్టమన్నారు.

ఫీమేల్ లీడ్ కథల్లో జంటగా ఇతర భాషా హీరోలను తీసుకోవడానికి అంటూ ప్రత్యేక కారణం అంటూ ఏమైనా ఉంటుందా అన్న జీవీ ప్రశ్నకు సమాధానంగా.. కథ రాసుకున్నప్పుడే తన మైండ్లో యాక్టర్లను అనుకొని రాస్తానన్నారు. అల్లు అర్జున్ విషయంలో మాత్రమే అలా జరగలేదన్నారు. కథ విని, నచ్చడంతో అల్లు అర్జునే 'వేదం' లో కేబుల్ రాజు పాత్ర చేయడానికి వచ్చారన్నారు. ఆ సినిమా విజయంలో సింహ భాగం అల్లు అర్జున్ కే దక్కుతుందన్నారు. 'ఘాటీ' లో దేశిరాజు పాత్ర రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభుయే తనకు గుర్తుకు వచ్చాడన్నారు. కొండంత బలం, అందమైన మనసు కలిగిన ఆ 'దేశిరాజు' పాత్రకు అతనే ఖచ్చితంగా సరితూగగలడని అనిపించడంతోనే విక్రమ్ ప్రభుని సంప్రదించడం జరిగిందన్నారు.

'వేదం' సినిమా దర్శకుడిననో, లేదంటే తనకు స్నేహితుడిననో అనుష్క 'ఘాటీ' కథను ఒప్పుకోలేదన్నారు క్రిష్. అనుష్క కోసం, అనుష్క వలన, అనుష్క చేత జరిగిన సినిమా 'ఘాటీ' అన్నారు. 'ఘాటీ' లో అందరి పాత్రలూ చాలా కొత్తగా కనిపిస్తాయన్నారు. 'ఘాటీ' లాంటి కథ ఇంతవరకూ తెలుగు తెరపై రాలేదన్నారు. 'బాహుబలి' సినిమాతో అనుష్క యాక్షన్ సీన్స్, ఫైట్స్ బాగా నేర్చుకుందన్నారు. 'ఘాటీ' సినిమాలో ఓ సరికొత్త ప్రపంచాన్ని, అనుష్క అద్భుతమైన నటనను ప్రేక్షకులు చూస్తారన్నారు. సినిమా పూర్తయిన తరువాత ప్రేక్షకులు తమ గుండెల నిండా మంచి అనుభూతిని నింపుకొనే బయటకు వస్తారన్నారు. 'అరుంధతి' తో పోల్చుకున్నా 'ఘాటీ' లో శిలావతి పాత్ర ఓ మెట్టు ఎక్కువే ఉంటుందన్నారు. అందరితో పాటూ 'ఘాటీ' తన కెరీర్ కు చాలా ముఖ్యమైన సినిమా అని, ఈ సినిమాతో తప్పకుండా హిట్టు ఇస్తానని అనుష్కకు మాట కూడా ఇచ్చానన్నారు. సీతారామశాస్త్రి మరణంతో ఎంతో అండను కోల్పోయానన్నారు.

బాలకృష్ణ 'NTR' సినిమా గురించి చెప్తూ.. 'NTR' సినిమా చాలా గొప్పగా తీశాను. ఇప్పటికీ నా బెస్ట్ వర్క్ అంటే ఆ సినిమానే. బాలకృష్ణ చాలా అద్భుతంగా చేశారు. ఆ సినిమాకు రిలీజ్ సమయం సరిగ్గా కుదరలేదు. ఆ సినిమాకు ప్రేక్షకుల నీరాజనం అందకపోవడం నన్ను చాలా బాధకలిగించింది" అన్నారు. 'NTR' సినిమా 2024 ఎన్నికల సమయంలో వస్తే వందల కోట్ల కలెక్షన్లు వచ్చేవని తన తండ్రి ఎప్పుడూ తనతో అంటూ ఉంటారన్నారు. బాలకృష్ణతో సినిమా ఒకవేళ జరిగితే ఆ సినిమా గురించి బాలకృష్ణ మాత్రమే ప్రకటన చేయాలన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved