pizza

Women are getting emotional after watching 'The Girlfriend'; it’s truly satisfying to have produced such a beautiful film: Ace Producer Allu Aravind
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా చూసి మహిళలంతా భావోద్వేగానికి గురవుతున్నారు, ఇలాంటి మంచి సినిమా నిర్మించడం ఎంతో సంతృప్తిస్తోంది - నిర్మాత అల్లు అరవింద్

You are at idlebrain.com > news today >

7 November 2025
Hyderabad

The movie beautifully depicts how couples - whether lovers or spouses - should and shouldn’t behave with one another. Director Rahul did a wonderful job of bringing out the pain and emotions women often suppress. He is the primary reason for the film’s success. Both the hero and heroine have delivered outstanding performances. I hope our media friends continue to spread the word and take this film to even more people.”

Actor Dheekshith Shetty said, “I’m grateful to all the media friends for supporting our movie. People are recognizing me and sending so many messages saying how much they liked the film. Our goal was to ensure that even one person connects emotionally with Vikram’s character - but seeing how many have related to it has been overwhelming. Many viewers said they’ve faced similar situations in their own lives. The response has been heartwarming. If you haven’t watched The Girlfriend yet, please do!”

Music Director Hesham Abdul Wahab said, “Thank you to the audience for making The Girlfriend a success, and to my entire team for their constant support throughout this journey.”

Editor Chota K. Prasad said, “Our movie’s collections are growing show by show, and the positive talk is spreading fast. Both audiences and media members have appreciated it. After the premiere show, the media’s response made us all very happy.”

Costume Designer Shravya Varma said, “The response to The Girlfriend has brought great joy to our entire team. I’m thankful to director Rahul and producers Dheeraj and Vidya for giving me the opportunity to be part of such a beautiful film.”

Producer Dheeraj Mogilineni said, “We kept saying this was a film that deserved media support and the media has responded wonderfully. Now, the movie belongs to the audience, and they are carrying it forward. After the premiere show, I saw tears in many people’s eyes; they were emotionally connecting with the characters and relating them to their own lives. Many journalists have personally called and texted me with heartfelt reactions. I don’t think I can make another film like this again in my life. Even my family members were moved to tears. As a producer, this success gives me immense satisfaction. It’s truly the director’s film - Rahul poured his heart into it, and I’m deeply grateful to him for bringing his vision to life so beautifully.”

Director Rahul Ravindran said, “During the making of The Girlfriend, Rashmika used to say that this film is like a big hug from her to all women. I would tell her that it’s my hug to all men - to encourage them to become better boyfriends and better husbands. After the release, I called Rashmika and told her that our words had come true; she got very emotional. After the premiere, one woman journalist even cried while interviewing me. A woman from Gujarat messaged me on Instagram saying that the movie gave her courage. Seeing such responses, I feel so fulfilled that I wouldn’t mind even if I never make another film.

The emotions I wanted to convey were perfectly understood by the media - their reviews reflected exactly what I intended. I’m grateful to every media friend and to my passionate team who worked so hard. This success is largely due to Aravind garu, who believed in my vision and gave me complete creative freedom. I thank Aravind garu, Vidya, and Dheeraj for their trust and support.”

Producer Vidya Koppineedi said, “The response from audiences has been heartwarming. Our PR team did a great job in taking the film to the public, and the media gave us wonderful support. I want to thank everyone for that.”

Actress Rashmika Mandanna said, “I’m overwhelmed by the response to The Girlfriend. I feel bad that I couldn’t attend the celebrations because I’m busy shooting for another film. I was amazed by how deeply Rahul understood women’s emotions - I even asked him about it during the shoot. I’m thankful to Rahul for giving me the opportunity to play the role of Bhooma. Dheekshith is an exceptional actor - he performed brilliantly as Vikram, and I wish him great success. Hesham’s music took our film to another level.”

Cast: Rashmika Mandanna, Dheekshith Shetty, Rao Ramesh, Rahul Ravindran, and others.

Technical Crew:
Cinematography – Krishnan Vasant
Music – Hesham Abdul Wahab
Costumes – Shravya Varma
Production Design – S. Ramakrishna, Mounika Nigoti
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – First Show
Presented by – Allu Aravind
Banners – Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers – Dheeraj Mogilineni, Vidya Koppineedi
Writer & Director – Rahul Ravindran

"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా చూసి మహిళలంతా భావోద్వేగానికి గురవుతున్నారు, ఇలాంటి మంచి సినిమా నిర్మించడం ఎంతో సంతృప్తిస్తోంది - నిర్మాత అల్లు అరవింద్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఈ రోజు గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించిన "ది గర్ల్ ఫ్రెండ్" సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి మంచి సినిమాను మీడియా మిత్రులు తమ బాధ్యతగా ప్రేక్షకుల్లో తీసుకెళ్లి, సపోర్ట్ చేస్తారనే నమ్మకాన్ని నేను సినిమా రిలీజ్ ముందు వ్యక్తం చేశాను. మేము ఆశించినట్లే మీడియా మిత్రులంతా మంచి రేటింగ్స్ తో "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు అండగా నిలబడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా సినిమాకు మార్నింగ్, మ్యాట్నీ నుంచి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మహిళలు ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. మనం చేసినదానికి ఇది చాలు కదా అనిపించింది. ప్రేమికులైనా, భార్యా భర్తలైనా వాళ్లు ఒకరిపట్ల మరొకరి రిలేషన్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండూ ఈ చిత్రంలో చెప్పారు. అమ్మాయిల్లో ఉండే బాధను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని దర్శకుడు రాహుల్ చేశారు. ఈ సినిమా విజయానికి మొదటి కారణం దర్శకుడే. హీరో హీరోయిన్స్ ఇద్దరూ ఏ వంకా పెట్టలేనంత అద్భుతంగా నటించారు. ఈ సినిమాను మన మీడియా మిత్రులు ఇంకా బాగా ప్రేక్షకుల దగ్గరకు చేరుస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ - మా మూవీకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్లు నా వైపు చూస్తున్నారు. చాలా మెసేజ్ లు వస్తున్నాయి. సినిమా బాగుందంటూ రివ్యూస్ పంపుతున్నారు. మా మూవీ చూసి థియేటర్ లో ఒక్క విక్రమ్ బెటర్ అయితే చాలు అనుకున్నాం. ఎంతోమంది తమ జీవితాల్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నామని, ఇలా ప్రవర్తించామని అంటున్నారు. ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చూడని వారు ఉంటే "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను వెంటనే చూడండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ - మా మూవీకి షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ప్రేక్షకులతో పాటు మీడియా మిత్రులకు కూడా మా మూవీ బాగా నచ్చింది. ప్రీమియర్ షో తర్వాత మీడియా నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలయ్యాం. అన్నారు.

కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" మూవీకి వస్తున్న రెస్పాన్స్ మా టీమ్ అందరికీ సంతోషాన్ని ఇస్తోంది. ఈ చిత్రంలో నేను భాగమయ్యే అవకాశం కల్పించిన డైరెక్టర్ రాహుల్, ప్రొడ్యూసర్ ధీరజ్, విద్య గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మీడియా మిత్రులు సపోర్ట్ చేయాల్సిన సినిమా ఇది అని చెబుతూ వస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసినట్లే మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మా మూవీ ప్రేక్షకుల్లో ఉంది. వాళ్లే మా సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ప్రీమియర్ షో చూసి బయటకు వస్తుంటే చాలా మంది కళ్లల్లో నీరు చూశాను. సినిమాలోని పాత్రలకు కనెక్ట్ కావడంతో పాటు తమ లైఫ్ తో రిలేట్ అయ్యి ఎమోషనల్ అవుతున్నారు. మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి, మెసేజ్ లు పంపుతున్నారు. నా లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్లీ చేయలేను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నారు. ఈ విజయం నిర్మాతగా చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. ఇలాంటి మంచి మూవీని మాకు చేసినందుకు రాహుల్ కు రుణపడి ఉంటాను. ఆయన అనుకున్నది తన వెర్షన్ లో హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా చేసేప్పుడు ఇది అమ్మాయిలందరికీ నేను ఇస్తున్న పెద్ద హగ్ అని రశ్మిక చెప్పేది. ఈ సినిమా అబ్బాయిలు బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హజ్బెండ్స్ కావాలని నేను ఇస్తున్న హగ్ అనేవాడిని. ఈ సినిమా చూసి రాత్రి రశ్మికకు కాల్ చేశాను. మనిద్దరి మాటలు నిజమయ్యాయి అని చెప్పాను. తను చాలా ఎమోషనల్ అయ్యింది. ప్రీమియర్ షో అయ్యాక ఒక మహిళా జర్నలిస్టు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఏడ్చేసింది. గుజరాత్ లో మా మూవీ చూసిన ఒక వుమెన్ నాకు ఇన్ స్టాద్వారా మెసేజ్ పంపింది. సినిమా చూశాక తనకు చాలా ధైర్యంగా ఉందని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే దర్శకుడిగా నేను మరో సినిమా చేయకున్నా ఫర్వాలేదు అనేంత సంతృప్తి కలిగింది. నేను సినిమాలో ఏ ఎమోషన్ అనుకున్నానో, అది మీడియా మిత్రులకు పర్పెక్ట్ గా అర్థమైంది. నేను ఎలా అనుకున్నానో అవన్నీ రివ్యూస్ లో రాశారు. మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. నా టీమ్ అంతా ప్యాషనేట్ గా మూవీ కోసం వర్క్ చేశారు. ఈ సక్సెస్ వచ్చిందంటే అరవింద్ గారే కారణం. ఆయన నా విజన్ ను నమ్మి పూర్తిగా నాకు స్వేచ్ఛనిచ్చారు. అరవింద్ గారికి, విద్య, ధీరజ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి మాట్లాడుతూ - మా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది. మా పీఆర్ టీమ్ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు బాగా తీసుకెళ్లింది. మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో నా మనసు నిండిపోతోంది. మరో సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల ఈ సెలబ్రేషన్స్ మీట్ కు రాలేకపోయాను. అందుకు చాలా బాధగా ఉంది. వుమెన్ ఎమోషన్స్ ను రాహుల్ అర్థం చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అదే విషయాన్ని రాహుల్ ను షూటింగ్ టైమ్ లో అడిగాను. భూమా పాత్రలో నటించే అవకాశాన్ని ఇచ్చిన రాహుల్ కు థ్యాంక్స్. దీక్షిత్ అద్భుతమైన నటుడు. విక్రమ్ గా అతను బాగా పర్ ఫార్మ్ చేశాడు. దీక్షిత్ కెరీర్ లో మరింత

నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ - శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ - జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ - ఫస్ట్ షో
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్స్ - గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved