pizza

Experience Magical Melody Bangaru Bomma From Sumanth Prabhas, Nidhi Pradeep’s Godari Gattupaina, Rendered Soulfully By Legendary Singers SP Charan, KS Chithra
సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' నుంచి లెజెండరీ సింగర్స్ ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మ్యాజికల్ మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

13 March 2026
Hyderabad

Young hero Sumanth Prabhas comes up with a rural love and family entertainer, Godari Gattupaina, directed by debutant Subash Chandra and produced by Red Puppet Productions. Nidhi Pradeep is the leading lady opposite Sumanth Prabhas in the movie, while Jagapathi Babu will be seen in a pivotal character. The teaser and the first two singles received an overwhelming response, and to keep the momentum going, the makers have now unveiled the film’s third single- Bangaru Bomma.

Music director Naga Vamshi weaves vintage magic with gentle beats, soft strings, and soulful orchestration, creating old-school charm that feels timeless and pure. Balaji’s lyrics portray a protagonist completely captivated by a beautiful girl, lovingly calling her Bangaru Bomma. He admits he becomes restless whenever he sees or even thinks about her, revealing total emotional surrender in love. The mood remains soft, romantic, and mildly playful, with the song flowing between admiration and a sweet tension whenever she appears. Lines about unexplained joy, fluttering emotions, and lingering memories add a warm, dreamy tone reminiscent of youthful love.

The soul of the song lies in the celestial vocals of legendary singers SP Charan and KS Chithra, whose seamless harmony brings ethereal warmth and emotional depth, making every note feel blissful. On screen, Sumanth Prabhas and Nidhi Pradeep’s charming chemistry enhances the overall experience, turning the song into a soothing celebration of first love’s spark.

The film also features cinematography by Sai Santhosh, production design by Pravalya, editing by Anil Kumar P, and sound design by Nagarjuna Thallapalli. With Bangaru Bomma, Godari Gattupaina further elevates the excitement ahead of its release.

Cast: Sumanth Prabhas, Nidhi Pradeep, Jagapathi Babu, Rajeev Kanakala, Laila, Devi Prasad, Sudarshan, Raj Kumar Kasireddy, Viva Raghav and Rohit Krishna Varma

Technical Crew:
Writer and Director - Subash Chandra
Banner - Red Puppet Productions
Producer - Abhinav Rao
Executive Producer - Madhulika Sanchana Lanka
DOP - Sai Santhosh
Music - Naga Vamshi Krishna
Editor - Anil Kumar P
Sound Designer - Nagarjuna Thallapalli
Production Designer - Pravalya D

సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' నుంచి లెజెండరీ సింగర్స్ ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మ్యాజికల్ మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ 'బంగారు బొమ్మ'ను రిలీజ్ చేశారు.

సంగీత దర్శకుడు నాగ వంశీ సాఫ్ట్ బీట్స్, సాఫ్ట్ స్ట్రింగ్స్, హృదయాన్ని హత్తుకునే ఆర్కెస్ట్రేషన్‌తో విన్టేజ్ మ్యాజిక్‌ను ఇచ్చారు. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ సాంగ్ స్వచ్ఛమైన అనుభూతిని అందిస్తుంది.

లిరిక్ రైటర్ బాలాజీ రాసిన సాహిత్యం హీరో ఫీలింగ్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. హీరోయిన్ ని ప్రేమగా “బంగారు బొమ్మ” అని పిలుస్తూ, ఆమెను చూసినా, ఆమె గురించి ఆలోచించినా తనకు అశాంతి కలుగుతుందని చెప్పడం అలరిస్తోంది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మనసును ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

పాట మొత్తం సాఫ్ట్, రొమాంటిక్, ఫన్ ఎక్స్ ప్రెషన్ తో సాగుతుంది. హీరోయిన్ కనిపించే ప్రతి క్షణంలో కలిగే ఎమోషన్స్, గుండెల్లో తేలే భావనలు, మిగిలిపోయే జ్ఞాపకాలు.. అన్ని కలిపి యూత్ లవ్ ని గుర్తు చేసే డ్రీమీ మూడ్‌ను సృష్టిస్తాయి.

ఈ పాటకు అసలైన ప్రాణం లెజెండరీ గాయకులు ఎస్.పీ. చరణ్, కె.ఎస్. చిత్ర అందించిన మధుర వోకల్స్. వారి హార్మనీ పాటకు గొప్ప మాధుర్యాన్ని, భావోద్వేగాలని జోడిస్తుంది.

స్క్రీన్ పై సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ మధ్య కనిపించే క్యూట్ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. ఫస్ట్ లవ్ స్పార్క్‌ను సెలబ్రేట్ చేసే ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు. “బంగారు బొమ్మ” పాట విడుదలతో గోదారి గట్టుపైన సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సుభాష్ చంద్ర
బ్యానర్ - రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత - అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మధులిక సంచన లంక
DOP - సాయి సంతోష్
సంగీతం - నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ - అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved