pizza

Godari Gattupaina Trailer on April 27
సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పర్ ప్రొడక్షన్స్ 'గోదారి గట్టుపైన' ట్రైలర్ ఏప్రిల్ 27న రిలీజ్

You are at idlebrain.com > news today >

25 April 2026
Hyderabad

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. 'గోదారి గట్టుపైన' ట్రైలర్ ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నారు.

ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్‌ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సుభాష్ చంద్ర
బ్యానర్ - రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత - అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మధులిక సంచన లంక
DOP - సాయి సంతోష్
సంగీతం - నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ - అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved