pizza

Sukruthi Veni Bandreddy Wins National Best Child Actress Award for 'Gandhi Tatha Chettu'
‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ సుకృతి వేణి బండ్రెడ్డికి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు

You are at idlebrain.com > news today >

2 August 2025
Hyderabad

The Government of India announced the 71st National Film Awards on Friday (August 1). In this edition, Telugu films showcased their strength at the national level. As part of this, Sukruthi Veni Bandreddy won the Best Child Actress award for the film Gandhi Tatha Chettu. Presented by Tabitha Sukumar under the banners of Sukumar Writings, Mythri Movie Makers, and Gopi Talkies, the film was directed by Padmavati Malladi. Gandhi Tata Chettu is now making waves at the national level.

The story of Gandhi Tatha Chettu is heart-touching and emotionally resonant. What did a granddaughter do for her grandfather? What efforts did she have to make to save a tree? What is the importance of a tree? The story built around these questions captivated everyone. Sukruthi Veni Bandreddy's performance in the film won hearts. To act so powerfully in her very first film is a remarkable feat, and now she has received the well-deserved recognition.

Winning a National Award for a debut performance is no ordinary achievement. Sukruthi Veni has proven herself to be a worthy daughter of her father. The Telugu film industry is showering praise and congratulations on Sukruthi Veni Bandreddy for winning the National Best Child Artist Award.

‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ సుకృతి వేణి బండ్రెడ్డికి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు

భారత ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 1) నాడు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నాయి. ఈ క్రమంలో ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డికి అవార్డు లభించింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, గోపీ టాకీస్ బ్యానర్ల మీద తబిత సుకుమార్ సమర్పణలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది.

అందరి హృదయాల్ని తాకేలా, మనసుల్ని హత్తుకునేలా ‘గాంధీ తాత చెట్టు’ కథ ఉంటుంది. తాత కోసం మనవరాలు ఏం చేసింది? ఓ చెట్టుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? చెట్టు ప్రాముఖ్యత ఏంటి? అంటూ సాగిన కథ, కథనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో సుకృతి వేణి బండ్రెడ్డి నటనకు అందరూ ముగ్దులయ్యారు. మొదటి చిత్రంలోనే అంత గొప్పగా నటించిన సుకృతి వేణి బండ్రెడ్డికి ఇప్పుడు తగిన పురస్కారం లభించింది.

మొదటి చిత్రంతోనే ఇలా జాతీయ అవార్డును సాధించడం అంటే మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయగా సుకృతి వేణి నిలిచారు. జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డు గెలిచిన సుకృతి వేణి బండ్రెడ్డిపై తెలుగు చిత్ర సీమ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతోంది.


.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved