`
pizza

Actress Hamsa Nandini Shares Her Breast Cancer Journey on Woman's Day
మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పంచుకున్న హీరోయిన్ హంసా నందిని

You are at idlebrain.com > news today >
Follow Us

7 March 2023
Hyderabad

In a heart-wrenching yet inspiring account, actress Hamsa Nandini shared her battle with breast cancer on Woman's Day. The actress revealed that she was diagnosed with grade 3 carcinoma in July 2020, just as she resumed shooting for her film post-lockdown. Her mother had also battled breast cancer 18 years ago and unfortunately lost the fight.

Hamsa shared that the ghosts of her past, fear, confusion, and anxiety all visited her again upon diagnosis. After a series of scans and tests, she bravely underwent surgery, which removed the tumour. She also braved 16 cycles of chemotherapy which were needed even though there was no spread of cancer. At this point, it was assumed that the worst was over. However, the relief was short-lived as she tested positive for BRCA1 (Hereditary Breast Cancer), which meant she had a genetic mutation that almost guaranteed a 70% chance of another Breast Cancer throughout her life. The only way to mitigate the risk was through some very invasive prophylactic surgeries, which she underwent last year.

Despite the harsh treatments and a challenging prognosis, Hamsa made a few promises to herself, including not letting the disease define her life, fighting it with a smile, getting back on screen stronger, and telling her story to educate and inspire others.

It's been a year and a half since her diagnosis, and Hamsa has stuck to her promises. She attributes her healthy and fully alive state to three factors: early diagnosis, a supportive network of competent doctors and her family, and a positive mindset.

In November last year, Hamsa was back on the set to shoot for a film. She has multiple projects lined up and looking forward to being back on the big screen soon. When asked about her experience on the sets post-treatment, she said,” I have always felt the most alive in front of the camera… being back on the sets has proven to be more therapeutic than I could have imagined. I already feel stronger and more energized than I have ever felt before.” Hamsa's valiant fight against this dreaded disease has earned her the nicknames 'Warrior' & 'Fighter' amongst her fans and on the set.
Hamsa has also decided to dedicate herself to educating others about early diagnosis through self-checkups, regular mammography, and genetic testing. She aims to make information about all aspects of breast cancer management and treatment easily accessible to people across India. When asked about this, she said,” I am thankful for the universe that I am alive and am here. During my chemotherapy, I made a promise to myself that I would live every moment like it was my last and that I would leave this world in a better shape than I found it. In keeping with it, I am happy to say that I am establishing the 'Yamini Cancer Foundation', which is named after my late mother, who was also a victim of breast cancer.”
Hamsa's valiant fight against this dreaded disease has earned her the nicknames 'Warrior' & 'Fighter' amongst her fans and colleagues.

On this Woman's Day, Hamsa's story serves as a reminder of the importance of self-care, early detection, and support. Her strength and determination inspire us all to fight against all odds and to live our lives to the fullest.

మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పంచుకున్న హీరోయిన్ హంసా నందిని

హీరోయిన్ హంసా నందిని మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో తను చేసిన స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని, ప్రయాణాన్ని పంచుకున్నారు. లాక్డౌన్ తర్వాత తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినసమయంలో జూలై 2020లో తనకు గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఆమె తల్లి కూడా 18 సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో పోరాడారు, అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయారు.

రోగ నిర్ధారణ తర్వాత భయం, గందరగోళం, ఆందోళన ఆవహించాయని గతాన్ని గుర్తుచేసుకున్నారు హంసానందిని. వరుస స్కాన్లు , పరీక్షల తర్వాత ఆమె ధైర్యంగా శస్త్రచికిత్స చేయించకొని ట్యూమర్ ని తొలగించారు. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన 16 సైకిల్స్ కీమోథెరపీని కూడా ధైర్యంగా ఎదుర్కున్నారు. కష్టకాలం ముగిసిందని భావిస్తున్న సమయంలో ఆమెకి BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీని అర్ధం.. ఆమె జీవితకాలంలో మరో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70% వుందని తెలిసింది. ఈ రిస్క్ ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గమైన ఇంటన్సివ్ ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీని ఆమె గత సంవత్సరం చేయించుకున్నారు.

కఠినమైన చికిత్సలు, సవాలుతో కూడిన రోగనిర్ధారణ ఉన్నప్పటికీ, వ్యాధి తన జీవితాన్ని నిర్దేశించకూడదని,.. చిరునవ్వుతో పోరాడుతూ, తిరిగి తెరపైకి రావాలని, ఇతరులకు అవగాహన కల్పించడానికి, స్ఫూర్తిని నింపేలా తన కథను చెప్పాలని హంసా తనకు తానుగా వాగ్దానం చేసుకున్నారు.

ఆమె రోగనిర్ధారణ చేసి ఏడాదిన్నర అయ్యింది. ఆమె తన వాగ్దానాలకు కట్టుబడి ఉంది: ముందస్తు రోగనిర్ధారణ, సమర్థులైన వైద్యులు సహాయక నెట్‌వర్క్, ఆమె కుటుంబ, సానుకూల మనస్తత్వం వలన తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి వచ్చానని చెప్పారు హంసానందిని.

గతేడాది నవంబర్‌లో సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టారు హంసనందిని. ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలో బిగ్ స్క్రీన్ పైకి రావాలని ఎదురుచూస్తోంది. ట్రీట్‌మెంట్ తర్వాత సెట్స్‌లో తన అనుభవం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు.. "కెమెరా ముందు నేను ఎప్పుడూ లైవ్లీ గా ఫీలౌతాను. సెట్స్‌పైకి రావడం గొప్ప ఉత్సాహాని ఇస్తుంది. నేను ఇంతకు మునుపు కంటే బలంగా, మరింత శక్తివంతంగా వున్నాను’’ అన్నారు.

ఈ భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా హంసా చేసిన సాహసోపేతమైన పోరాటం ఆమెకు అభిమానులు, సహచరులు, సెట్‌లో 'వారియర్ ' & 'ఫైటర్' అనే మారుపేర్లను సంపాదించిపెట్టాయి.

సెల్ఫ్ -చెకప్‌లు, రెగ్యులర్ మామోగ్రఫీ, జన్యు పరీక్షల ద్వారా ముందస్తు రోగ నిర్ధారణ గురించి ఇతరులకు అవగాహన కల్పించడానికి తనను తాను అంకితం చేసుకోవాలని హంసా నందని నిర్ణయించుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ మ్యానేజ్ మెంట్, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాల గురించి సమాచారాన్ని దేశం అంతటా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యం. దీని గురించి అడిగినప్పుడు.. "నేను జీవించి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కీమోథెరపీ సమయంలో, నేను ప్రతి క్షణాన్ని నా చివరిదిగా జీవిస్తానని, మెరుగైన స్థితి కోసం ప్రయత్నిస్తానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి మరణించిన నా తల్లి పేరు మీద 'యామినీ క్యాన్సర్‌ ఫౌండేషన్‌'ని నెలకొల్పుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.’’ అన్నారు

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసానందిని కథ.. సెల్ఫ్ కేర్, ముందస్తు గుర్తింపు, సపోర్ట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఆమె బలం, సంకల్పం అన్ని ప్రతికూల పరిస్థితులలో పోరాడటానికి, జీవితాలను సంపూర్ణంగా జీవించడానికి స్ఫూర్తినిస్తోంది.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved