13 November 2023
Hyderabad
Creative Director Prasanth Varma’s highly-anticipated Pan India film Hanu-Man starring the young and talented hero Teja Sajja is getting ready for Sankranthi's release. The film’s teaser and then the Powerful Hanuman Chalisa got a thumping response. As there are exactly two months left for the film’s theatrical release, the makers came up with an update on the new song.
The song Superhero Hanuman will be out for Children’s Day on the 14th of this month at 5:04 PM. This stirring number is going to be a fancy one, in terms of visual presentation. The song poster shows Teja Sajja in a stylish avatar as he wears shades. He is seen with a firecracker in his mouth, while there is a monkey sitting on his shoulder. The poster also sees men with masks. The ambiance in the poster is purely festive.
Gowrahari, Anudeep Dev, and Krishna Saurabh trio scored the music for the movie produced prestigiously by K Niranjan Reddy of PrimeShow Entertainment, while Smt Chaitanya presents it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer and Kushal Reddy is the associate producer. The cinematography for this magnum opus is by Shivendra, wherein Srinagendhra Tangala is the production designer.
Amritha Aiyer is the leading lady opposite Teja Sajja in the movie, where Vinay Rai will be seen as the antagonist and Varalaxmi Sarathkumar in a key role.
Hanu-Man is the first film from Prasanth Varma’s Cinematic Universe. The film is essentially set-up in an imaginary place called “Anjanadri”. Since the concept of the film is universal, it has the potential to do well across the globe.
HANU-MAN will have a Pan World release in several Indian languages including Telugu, Hindi, Marathi, Tamil, Kannada, Malayalam, English, Spanish, Korean, Chinese and Japanese on January 12, 2024.
Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar, Vinay Rai, Getup Srinu, Satya, Raj Deepak Shetty and others
Technical Crew:
Writer & Director: Prasanth Varma
Producer: K Niranjan Reddy
Banner: Primeshow Entertainment
Presents: Smt Chaitanya
Screenplay: Scriptsville
DOP: Dasaradhi Shivendra
Music Directors: Anudeep Dev, Gowrahari and Krishna Saurabh
Editor: SB Raju Talari
Executive Producer: Asrin Reddy
Line Producer: Venkat Kumar Jetty
Associate Producer: Kushal Reddy, Pushpak Reddy
Production Designer: Srinagendhra Tangala
Costume Designer: Lanka Santhoshi
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ 'హను-మాన్' నుంచి సూపర్ హీరో హనుమాన్ నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విడుదల
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. సినిమా థియేట్రికల్ విడుదలకు సరిగ్గా రెండు నెలల సమయం వుండగా మేకర్స్ కొత్త పాటకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు.
సూపర్ హీరో హనుమాన్ పాట బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. సాంగ్ పోస్టర్‌లో తేజ సజ్జ షేడ్స్‌లో స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. అతని నోటిలో క్రాకర్ వుంది. భుజంపై ఒక కోతి కూర్చుని ఉంది. పోస్టర్‌లో మాస్క్‌లు ధరిస్తూ కొందరు కనిపించారు. పోస్టర్‌లో పండుగ కళ ఉట్టిపడింది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. హను-మాన్ "అంజనాద్రి" ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి