pizza

Hanuman 3D trailer launch
హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: సూపర్ హీరో తేజ సజ్జ

You are at idlebrain.com > news today >

21 June 2026
Hyderabad

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు చాలా ప్యాషనేట్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ 3D రూపంలో వస్తోంది. దయచేసి మీరందరూ జూన్ 25న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. అందరూ కలిసి జూన్ 25న థియేటర్లకు రండి. ఈ సినిమాకు పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, తేజ , అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చు. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు.

సూపర్ హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను కూడా మీతో పాటు ఇప్పుడే మొదటిసారి ఈ 3D ట్రైలర్‌ను చూశాను. నిరంజన్ గారు, చైతన్య గారు ఎంతో కష్టపడి దీనిని సిద్ధం చేశారు. ఇప్పటివరకు వారు పడిన శ్రమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది. 3D చాలా అద్భుతంగా వచ్చింది. ఇది అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. నేనూ మీలాగే మళ్లీ థియేటర్లలో ఈ సినిమాను 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ టీమ్‌ను మళ్లీ కలవడం ఒక రీయూనియన్‌లా అనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. సాయి దుర్గ తేజ్ గారు, నిరంజన్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఆ సినిమాపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. జూన్ 25న హనుమాన్ 3D విడుదలవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి."

నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా ఈవెంట్‌కు వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి ధన్యవాదాలు. మీరు హనుమాన్ సినిమాను 2Dలో ఎంతగా ఆస్వాదించారో, 3Dలో కూడా అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.

నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హనుమాన్ చిత్రానికి ప్రేక్షకులు అందించిన అపారమైన ఆదరణకు ప్రతిగా మేమేం చేయగలమని ఆలోచించి, 3Dలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అత్యాధునిక టెక్నాలజీతో ఈ 3D వెర్షన్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు ట్రైలర్‌లో స్వామివారిని 3Dలో చూసిన తర్వాత ఆయన ఆశీస్సులు మాపై ఉన్నాయనే భావన కలిగింది. హనుమంతుడు స్వయంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. ట్రైలర్ చూస్తూ మీరు చేసిన ‘జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలను మేమెప్పటికీ మర్చిపోలేం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. 3D వెర్షన్ కూడా మీకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. జూన్ 25న అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. హనుమాన్ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన రోజు నా పుట్టినరోజు కావడం ఎంతో ప్రత్యేకం. అలాంటి బహుమతిని నేను ఎప్పుడూ ఊహించలేదు. సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

3D కిరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దాదాపు 600 మంది టెక్నీషియన్లు మూడు నెలల పాటు నిరంతరంగా శ్రమించి ఈ అద్భుతమైన 3D వెర్షన్‌ను సిద్ధం చేశారు. ప్రేక్షకులకు అత్యుత్తమ 3D అనుభూతి అందించాలనే లక్ష్యంతో పనిచేశాం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. హనుమాన్ 3D మీ అందరికీ మరపురాని అనుభూతిని అందిస్తుంది.

హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. హనుమాన్ 3D చూసిన తర్వాత మళ్లీ గూస్‌బంప్స్ వచ్చాయి. ఈ వెర్షన్‌ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఒక రీయూనియన్‌లా అనిపిస్తోంది. మరోసారి ఈ టీమ్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 25న మీరు అందరూ హనుమాన్ 3Dను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గారికి, నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి, తేజ గారికి ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. హనుమాన్ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన విజయానందాన్ని మాటల్లో చెప్పలేను. హనుమాన్ 3D వెర్షన్ కూడా ప్రేక్షకులను అద్భుతంగా అలరించబోతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved