pizza

Happy Raj trailer launch
'హ్యాపీ రాజ్' ఫన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు బ్యూటీఫుల్ మెసేజ్ వున్న సినిమా. మార్చి 27న అందరూ ఫ్యామిలీస్ కలసి థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో జివి ప్రకాష్ కుమార్

You are at idlebrain.com > news today >

20 March 2026
Hyderabad

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. వెంకీ గారు, శివ గారు ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని సోషల్ మీడియాలో లాంచ్ చేసిన రవితేజ గారికి థాంక్యూ సో మచ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చూశారు. వాళ్లకి చాలా నచ్చింది. మైత్రి మూవీ మేకర్ మైత్రి మూవీస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫన్ కమర్షియల్ మెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. సినిమా చూసిన తర్వాత ఆ ఈ కథ మీ మనసులను హత్తుకుంటుంది. చాలా స్పెషల్ ఫిలిం. మీరందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్ ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. చాలాకాలం నిలిచిపోతుంది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.జీవి గారి మ్యూజిక్ కంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్ గా ఇరుముడి సినిమాకి ఆయన తో వర్క్ చేయడం కుదిరింది. మ్యూజిక్ వర్క్ అంత అద్భుతంగా జరుగుతోంది. తనని మ్యూజిక్ డైరెక్టర్ గా కలిసి ఇప్పుడు హీరోగా తన ఈవెంట్ కి రావడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఆయన సినిమాకి మ్యూజిక్ చేసిన నటించినా ప్రాణం పెట్టి చేస్తారు. హీరోగా దాదాపు 20 సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాపీ రాజ్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఆయన ఇంకా ఎక్కువ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమిళ్ నుంచి వచ్చిన ప్రతి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో అద్భుతంగా ఆడుతోంది. మంచి సినిమా ఎక్కడున్నా మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గౌరీ ప్రియ గారు ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. టైటిల్ లో ఉండే హ్యాపీనెస్ ప్రేక్షకులు కూడా రావాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్ కి డైరెక్టర్ కి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా హిట్ అయిన తర్వాత డైరెక్టర్ తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గౌరీ తెలుగు అమ్మాయి. తను ఇక్కడ ఇక్కడి నుంచి తమిళ్ బవెళ్లి అక్కడ అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయం. తనకి కంగ్రాజులేషన్స్. జీవీ నా ఫ్రెండ్. మా జర్నీ సార్ తో మొదలైంది. నాకు ఆయన అన్ని సినిమాల్లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా తన వర్క్ కి పూర్తి న్యాయం చేస్తారు. విశ్వనాద్ అండ్ సన్స్ కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించి జీవి ఇప్పుడు తీసుకుంటున్నా రెమ్యూనికేషన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.

మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చూశాం. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు గొప్ప మెసేజ్ ఉంటుంది. సీన్స్ అన్ని చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్ మదర్ ని చూసే విధానంలో మార్పు ఉంటుంది. జీవి గారు, గౌరీ ప్రియ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఇది తెలుగులో కచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా అందరూ హ్యాపీగా ఉంటారని నమ్ముతున్నాను. ఈవెంట్ కి వచ్చి సినిమాని ఆశీర్వదించిన వెంకీ అట్లూరి గారికి శివ నిర్మాణ గారికి థాంక్యూ. మార్చి 27న సినిమా తెలుగు తమిళ్లో రిలీజ్ అవుతుంది. మార్చి 25న ఒక ప్రీమియర్ కూడా అనుకుంటున్నాము. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

మూవీ డైరెక్టర్ మరియా రాజా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ముందుగా నవీన్ పోలిశెట్టి గారికి థాంక్యూ చెప్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ రాసిన తర్వాత సోషల్ మీడియాలో ఉన్న మెయిల్ ఐడీస్ పట్టుకొని చాలామందికి పంపించాను. స్క్రిప్ట్ చదివి నవీన్ పోలిశెట్టి గారు కాల్ బ్యాక్ చేశారు. ఆయనకి ఈ స్క్రిప్ట్ చాలా నచ్చింది.ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తర్వాత ఈ స్క్రిప్ట్ ని జీవీ ప్రకాష్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను.ఈ క్యారెక్టర్ కి ఆయన పూర్తి న్యాయం చేశారు. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ప్రదీప్ రంగనాథన్ గారి దగ్గర ఐదు సంవత్సరాలు పనిచేశాను. లవ్ టు డే డ్రాగన్ సినిమాలకి వర్క్ చేశాను. లవ్ టుడే చిత్రానికి తెలుగు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతం. అలాంటి ప్రేమనే ఈ సినిమాకి కూడా ఇస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ టుడే లో ఉన్న ఎనర్జీ ఇందులో కూడా ఉంది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కి ధన్యవాదాలు. వాళ్లకి కంటెంట్ నచ్చి ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. ఈ సినిమా కేవలం నవ్వించడమే కాదు చాలా ఎమోషన్స్ ని టచ్ చేస్తుంది. తప్పకుండా ఇది ఆడియన్స్ కి గుర్తుండిపోతున్న గుర్తుండిపోయే సినిమా.

హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శివ నిర్మాణ గారికి వెంకీ అట్లూరి గారికి స్పెషల్ థాంక్స్. నేను నటించిన తమిళ్ సినిమా నా మాతృభాష తెలుగులో ఒకేరోజు రావడం చాలా చాలా స్పెషల్. నా కెరీర్ లో ఫస్ట్ టైం జరుగుతుంది. టైటిల్ లో ఉన్నట్లే ఈ సినిమా చాలా హ్యాపీ ఫిలిం. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మంచి కుటుంబ విలువలతో ఫన్ తో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దర్శకులకు ధన్యవాదాలు ఇచ్చింది. 27న తప్పకుండా ఈ సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ జైవర్ద మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. దాంతోపాటు హై ఎమోషన్స్ మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. జీవి ప్రకాష్ గారు మనతో పాటు నిలిచిపోయే మ్యూజిక్ ని అందిస్తారు. అలాగే తన నటన కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా తన యాక్టింగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా ఉంటుంది. ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీకి ధన్యవాదాలు. మార్చి 27న అందరూ థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది.

తారాగణం: జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ, అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్, అదుర్చి అరుణ్, మధురై ముత్తు, దేవి మహేష్, సోఫాబాయ్ రసూల్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం- మరియా రాజా ఎలాంచెజియన్
నిర్మాత- జైవర్ద
సహ నిర్మాత - జైకాంత్ సురేష్
తెలుగు రిలీజ్: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP
డీవోపీ-మధన్ క్రిస్టోఫర్
ఎడిటర్- ఆర్కే సెల్వ
సంగీతం- జస్టిన్ ప్రభాకరన్
ప్రొడక్షన్ డిజైనర్ - కుమార్ గంగప్పన్
కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రవీణ్ రాజా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- విశ్రేత్ కెఎల్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved