pizza

Power Star Pawan Kalyan, Jyothi Krisna, AM Rathnam's Hari Hara Veera Mallu Team begins shooting an epic war scene
భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' చిత్ర బృందం

You are at idlebrain.com > news today >

16 August 2024
Hyderabad

Power Star Pawan Kalyan starrer an epic action saga, Hari Hara Veera Mallu team has been releasing continuous updates after an unavoidable gap due to unforeseen circumstances. Now, the team has a very exciting and important update to share with fans and movie-lovers.

Now, the production house has started the regular shooting for the film, Hari Hara Veera Mallu Part-1 on 14th August, Today they started shooting a huge war sequence under action choreography of prominent technician, action director Stunt Sliva.

More than 400-500 fighters & junior artists are taking part in this epic war sequence. Pawan Kalyan will start shooting for this sequence in few days, as he is currently busy with his political works.

The production house has planned a lavish schedule to capture this war sequence that will present Pawan Kalyan in a dynamic avatar like never before. He is playing as a historical warrior outlaw for the first time in his career and he is set to give a thrilling ride with Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, quite soon.

Recently released teaser after director Jyothi Krisna took over the project has created a humongous buzz for the film among fans and movie-lovers. This prestigious action saga has Bollywood sensational actor Bobby Deol, Legendary actor Anupam Kher and many others among the cast.

Ace Cinematographer Manoj Paramahamsa is handling cinematography and legendary production designer Thotha Tharani is handling art direction. Oscar award winning music composer MM Keeravani is composing music for the film.

Legendary producer AM Rathnam is presenting the movie on a massive scale on his Mega Surya Productions banner & the film is produced by A Dayakar Rao.

The Pawan Kalyan starrer Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit is set to release soon worldwide in Telugu, Hindi, Tamil, Malayalam languages.

భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం
వెల్లడించింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది.

ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే సమయంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది.

మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. త్వరలోనే 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌'తో ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ చిత్రంపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని
భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved