Rebel star Prabhas on Monday released the teaser of Sudheer Babu-starrer Harom Hara. The film is an important one for Sudheer as he is going through a lean patch and one glance at the teaser gives hope that his hoodoo will finally end.
Playing out over one minute and 43 seconds, the teaser opens with a sea of supporters protesting against the arrest of our protagonist Subrahmanyam (played by Sudheer) at the premises of a police station. In a voice over, Subrahmanyam is later seen saying that “everyone holds a gun to acquire power, whereas the gun in his hand travelled many places to latch on to him”. He believes it is saying something to him. Film’s writer-director Gnanasagar Dwaraka doesn’t give much in terms of the plot, rather establishing his supporting cast comprising Sunil, Jayaprakash, Ravi Kale, Kadambari Kiran etc. The film seems to be a rustic period drama set in the backdrop of Kuppam town when gang wars were prevalent with various groups fighting for one-upmanship as cops try their best to maintain law and order. “The times are such that if a lion is scared, it will be used for farming. If it lets its threatening roar out, people will be confined to their boundaries”, thunders Subrahmanyam, who seems to rise from a common man to a powerful gangsta. The teaser ends him proclaiming that if the opposite party begins the war, he will conclude it with his signature.
Wrapping up, the teaser is top-class, intense and atmospheric, while promising an action-entertainer with great drama. Sudheer seems to have sunk his teeth into the role, carrying it a lot of swag and panache, while the supporting characters' Seema accent lends a degree of authenticity to the proceedings. Parts of the teaser are superbly accentuated by the terrific background score of Chaitan Bharadwaj.
Produced by Sumanth G Naidu, Harom Hara, with Malvika Sharma opposite Sudheer Babu, storms into cinemas early next year. It will be released in Tamil, Kannada, Malayalam, and Hindi as well.
ప్రభాస్, మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లాంచ్ చేసిన సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్
హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్, మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్‌లు ‘పవర్ ఆఫ్ సుబ్రమణ్యం పేరుతో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ‘హరోం హర’ టీజర్‌ను లాంచ్ చేశారు.
హీరోని పోలీసులు అరెస్టు చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతని మద్దతుదారులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. సుబ్రమణ్యంగా సుధీర్ బాబు సాధారణ వ్యక్తి, కానీ పరిస్థితులు అతన్ని హింసాత్మక మార్గంలో నడపవలసి వస్తుంది. కథాంశాన్ని రివిల్ చేయకుండా, అన్ని ప్రధాన పాత్రలను, సినిమా ప్రిమైజ్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా టీజర్ ప్రెజెంట్ చేసింది.
టీజర్ ని చాలా ఇంటెన్స్, ఎనర్జీతో కూడిన అంశాలతో అద్భుతంగా కట్ చేశారు. యుద్దభూమిలో మనుగడ సాగించడానికి, విజయం సాధించడానికి ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని టీజర్ చూస్తోంది. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ పల్లెటూరి కథను ఎంచుకుని, దాన్ని అత్యంత అద్భుతంగా అందించాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సెటప్‌కి డైలాగ్‌లు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
సాధారణ వ్యక్తి నుంచి శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగే సుబ్రమణ్యం పాత్రను అద్భుతంగా పోషించారు సుధీర్ బాబు. తన పాత్రలో చాలా లేయర్స్ వున్నాయి. పవర్ ఫుల్ రోల్, సరికొత్త మేకోవర్ లో సుధీర్ బాబు ప్రేక్షకులని కట్టిపడేశారు. కుప్పం నేపథ్యంలో సాగే కథ కావడంతో రాయలసీమ స్లాంగ్‌లో పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సునీల్ తన ప్రెజన్స్ తో అలరించాడు, మాళవిక శర్మ హీరోయిన్ గా ఆకట్టుకుంది. లక్కీ లక్ష్మణ్, రవి కాలే , అర్జున్ గౌడ ముఖ్యమైన పాత్రలు పోషించి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.
సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ ఫ్రేమ్‌లను లార్జర్-దాన్-లైఫ్ గా చిత్రీకరించారు. క్రేజీ యాక్షన్ బ్లాక్‌లలో తన నైపుణ్యాలన్ని చూపించారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ గ్రాండియర్ ని పెంచుతుంది. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా వుంది. 2024 ప్రారంభంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానున్న ప్రాజెక్ట్ పై ఈ టీజర్ చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత - సుమంత్ జి నాయుడు
సంగీతం - చైతన్ భరద్వాజ్
డీవోపీ- అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ - రవితేజ గిరిజాల
బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్