pizza

Legendary Actor Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రంలో లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్

You are at idlebrain.com > news today >

08 August 2024
Hyderabad

One of the greatest ever and legendary Indian actors, Anupam Kher, joined magnum opus and epic action saga Pawan Kalyan's Hari Hara Veera Mallu. The legendary actor has been an asset to any film he joins and he has a highly precious and coveted role in Hari Hara Veera Mallu too.

For the first time ever, Power Star Pawan Kalyan is going to share the screen with the legendary actor Anupam Kher. Fans can anticipate a crackling combination of scenes between the two actors, say the makers. They are promising a once in a lifetime experience with the marvelous epic Hari Hara Veera Mallu.

Recently, young director Jyothi Krisna took over the project and released a special teaser increasing hype and buzz for the film, thereby giving huge expectations to fans of the actor, who have been waiting for the film in great anticipation.

Ace Cinematographer Manoj Paramahamsa joined the highly skilled and talented team for the remainder of the project. Legendary production designer Thotha Tharani and Baahubali fame VFX supervisor Srinivas Mohan are also working in tandem with him to create the epic.

Oscar award winning music composer MM Keeravani is composing music for the film. To continue the shoot of the film, Hari Hara Veera Mallu, team has started recce for the locations while simultaneously started finishing post production works and VFX works. Movie is going to release in two parts and Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit is set to release soon. More details will be revealed soon by the makers.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రంలో లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'హరి హర వీరమల్లు'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ 'హరి హర వీరమల్లు'లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నా.రు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తున్నారు.

ఇటీవల, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంతో ప్రభితగల సాంకేతిక నిపుణులు 'హరి హర వీరమల్లు' చిత్రం కోసం పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ చిత్రం యొక్క మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేయడం కోసం సాంకేతికత బృందంలో చేరారు. లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి మరియు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ వంటి దిగ్గజాలు ఈ అద్భుత చిత్రం కోసం పని చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది. మరోవైపు సమాంతరంగా నిర్మాణానంతర‌ పనులు ప్రారంభించారు. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. "హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్" త్వరలో విడుదల కానుంది. మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved