pizza

Natural Star Nani, Shouryuv, Vyra Entertainments, Hi Nanna New Shooting Schedule Kick-started In Coonoor, Get Ready For A Musical Extravaganza
నేచురల్ స్టార్ నాని, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్‌లో ప్రారంభం- త్వరలో మ్యూజికల్ ఫెస్ట్ బిగిన్స్

You are at idlebrain.com > news today >
Follow Us

2 September 2023
Hyderabad

Natural Star Nani is presently starring in a Pan India film Hi Nanna being helmed by debutant Shouryuv. Produced prestigiously by Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala under the banner of Vyra Entertainments, the movie that stars Mrunal Thakur playing the female lead. Billed to be a wholesome family entertainer, the movie will see Baby Kiara Khanna as Nani’s daughter.

Meanwhile, the film’s new shooting schedule is kick-started in the lush beauty of Coonoor. Nani says Hi from the location and he is seen enjoying the exotic location. Get ready for a musical extravaganza. The musical promotions of the movie will begin soon.

The makers previously unveiled the film’s first look poster and also a glimpse which received a thumping response. The glimpse helped the movie to garner a good buzz across the country.

Hesham Abdul Wahab scores the music, while Sanu John Varughese ISC is the cinematographer. Praveen Anthony is the editor and Avinash Kolla is the production designer, and Satish EVV is the executive producer.

The movie will hit the screens in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on December 21, this year.

Cast: Nani, Mrunal Thakur, Baby Kiara Khanna

Technical Crew:
Director: Shouryuv
Producers: Mohan Cherukuri (CVM) and Dr Vijender Reddy Teegala
Banner: Vyra Entertainments
DOP: Sanu John Varughese ISC
Music Director: Hesham Abdul Wahab
Production Designer: Avinash Kolla
Editor: Praveen Anthony
Executive Producer - Satish EVV
Costume Designer: Sheetal Sharma

నేచురల్ స్టార్ నాని, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్‌లో ప్రారంభం- త్వరలో మ్యూజికల్ ఫెస్ట్ బిగిన్స్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది.

తాజాగా ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ కూనూర్ పచ్చని అందాలలో ప్రారంభమైయింది. నాని లొకేషన్ నుండి ‘హాయ్’ చెబుతూ ఎక్సోటిక్ లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.

మేకర్స్ గతంలో విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ నేషనల్ వైడ్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.

'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఈవీవీ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved