pizza

Music director Hesham Abdul Wahab about Hi Nanna
Music Reflects Nani’s Performance & Shoryuv’s Visual Treat -Abdul Hesham Wahab on Hi Nanna
మనసుకు హాయినిచ్చే మ్యూజిక్ తో ‘హాయ్ నాన్న’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది: సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్

You are at idlebrain.com > news today >
Follow Us

5 December 2023
Hyderabad

Natural Star Nani stars in this wholesome feel-good family entertainer, directed by Shouryuv in his debut, and produced by Vaira Entertainment. The film, featuring Mrunal Thakur as the heroine and Shruti Haasan in a pivotal role, has already generated high expectations with its teaser, trailer, and songs receiving tremendous response. The much-anticipated 'Hi Nanna' is set to release on December 7.

In a press conference, the star composer Hesham Abdul Wahab, responsible for the sensational super hit audio of the film, shared insights into the unique features of 'Hi Nanna.'

Q: How does it feel to receive such a positive response with your first Telugu film Kushi, gaining a good reputation in this industry?
A: Very happy. But there is still much to learn. Every film is a test and a learning experience. 'Hi Nanna' helped me explore and expand my skills.

Q: Love, romance, drama are common themes in your films. How do you keep them fresh?
A: It's not just about the music director; the entire team, including the director, writer, and editor, focuses on presenting something new. While the themes of love and romance may be common, the key lies in the unique storytelling. It's similar to movies like 'Kaadal,' 'Roja,' 'Mumbai,' 'Ok Bangaram' – the difference is in how the director tells the story. Music, too, conveys the same emotion, and the uniqueness lies in the singer, lyrics, and context.

Q: People are comparing your songs 'Darshan' and 'Samayama.' What are your thoughts?
A: It's natural to draw comparisons because the first note of both songs is the same. However, the classic composition sounds more contemporary in 'Samayama.' The audience is smart and updated, and both songs have gone viral.

Q: How do you come up with new tunes, and what precautions do you take?
A: I follow the director's vision. For 'Hi Nanna,' I collaborated with the director and music team to deliver what he wanted. The film's soft romantic theme is reflected in the music, lighting, and visuals, creating a pleasant and peaceful atmosphere.

Q: Your songs often have a word that hooks the audience. Why is that?
A: I enjoy focusing on a specific word when creating a song. For instance, in 'Hi Nanna,' I specifically asked the lyricists to emphasize certain words. Songs with familiar and commonly used words tend to have a lasting impact.

Q: Lately, songs don't have stanzas. What is your opinion on this?
A: It's entirely in the hands of the director. 'Hi Nanna' has a mix of styles, surprising the audience with the placement of pallavi and stanzas. Shouryuv, the director, showcased both formats exceptionally well, and we utilized advanced technology in the music.

Q: How did you feel when you saw 'Hi Nanna'?
A: I am confident in saying that Telugu audiences appreciate unique films. 'Hi Nanna' stands out with a great storyline, and Nani's performance is remarkable. After watching the movie, I understood why Nani is called a natural star. The characters of Mrunal, Baby Kiara, and others are touching.

Q: Tell us about the song 'Odiyamma.'
A: The song needed high energy to match the visuals of a big party scene. It took some time to capture that energy. Shouryuv liked the tune I sent him, and it was his idea to have Dhruv sing the song along with Shruti Hasan.

Q: About Vaira Entertainment Production House?
A: Vaira Entertainment is a fantastic production house. We had 15 musicians working for about 40 days in Hyderabad, with over 20 additional players participating in the recordings. The producers spared no expense in making a grand movie.

Q: Any upcoming projects?
A: I am working on a film for Sriram Aditya with Sharwanand and also on a project with Rashmika called 'Girlfriend.'

 

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సెన్సేషనల్ సూపర్ హిట్ ఆడియో అందించిన స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ 'హాయ్ నాన్న' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కదా.. ఈ ఆదరణ ఎలా అనిపిస్తోంది?
చాలా ఆనందంగా వుంది. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా ఒక పరీక్షే. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. ఇంకా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేయాలి. హాయ్ నాన్న చిత్రం నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవడానికి తోడ్పడింది.

హృదయం, ఖుషి, హాయ్ నాన్న..ఇలాంటి చిత్రాలన్నిటిలో కామన్ గా లవ్, రొమాన్స్, డ్రామా వుంటుంది కదా.. వీటిలోనే కొత్తదనం చూపించడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారు ?
ఇది కేవలం సంగీత దర్శకుడే కాదు.. దర్శకుడు, రచయిత, ఎడిటర్.. అలా అందరూ కొత్తదనం ఎలా చూపించాలనే విషయంపైనే దృష్టి పెడతారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థుతులే వుంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్ గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి వుంటుంది. సంగీతం కూడా అలానే వుంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్ గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది.

దర్శన, సమయమా.. ఈ రెండు పాటలకు చాలా మంది పోలికలు తీసుకొస్తున్నారు.. దీని గురించి?
ఈ పోలిక తీసుకురావడం సహజమే. ఎందుకంటే దర్శన, సమయమా.. ఈ రెండు పాటల మొదటి నోట్ ఒకేలా వుంటుంది. కానీ దర్శన కంటే క్లాసిక్ కంపోజిషన్ సమయమాలో వినిపిస్తుంది. అయితే ఆడియన్స్ చాలా తెలివిగా, అప్డేట్ గా వుంటారు. దర్శనతో పోలిక పెట్టడం ఆనందమే. రెండు పాటలు వైరల్ అయ్యాయి(నవ్వుతూ)

నిరంతరం కొత్త ట్యూన్స్ ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రతలు తీసుకుంటారు ?
నా వరకూ దర్శకుడు విజన్ ని ఫాలో అవుతాను. ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్ కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. హాయ్ నాన్న వెరీ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్ గా చేశాం. మీరు బాగా పరిశీలిస్తే హాయ్ నాన్న లో లైటింగ్ విజువల్స్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతని ఇచ్చేలా వుంటాయి.

దర్శన, ఖుషి, సమయమా, అమ్మాడి.. ఇలా మీ పాటల్లో ఒక పదంతో హుక్ చేసే స్వభావం కనిపిస్తుంది.. దీని గురించి చెప్పండి?
సహజంగానే ఒక పదంతో పాటలోకి వెళ్ళడం నాకు ఇష్టం. ఇందులో అమ్మాడి పాట చేసినప్పుడు కూడా ముందు.. ఆ పదంపైనే దృష్టి పెట్టాను. లిరిక్స్ రైటర్స్ కి ప్రత్యేకంగా అడిగాను. అలాగే గాజుబొమ్మ, సమయమా పాటలు కూడా పదాలతోనే ముందుగా హత్తుకుంటాయి. అందరికి తెలిసిన, సహజంగా వాడుకలో వున్న ఇలాంటి పదాలతో వున్న పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయని భావిస్తాను.

ఈ మధ్య కాలంలో పాటల్లో చరణాలు వుండటం లేదు కదా.. దీనిపై మీ అభిప్రాయం ?
ఇది పూర్తిగా దర్శకుడు చేతిలో వుంటుంది. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలంటే.. లాస్ట్ వీక్ వర్క్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ సినిమా హ్యంగోవర్ లోనే వున్నాను. దర్శకుడు శౌర్యవ్ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యాను. పల్లవి ఒక చోట, చరణం మనకు సర్ ప్రైజ్ ఇచ్చేలా మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు. సమయమా పాట శైలి చాలా భిన్నంగా వుంటుంది. గాజు బొమ్మ పాటలో రెండు చరణాలు వుంటాయి. శౌర్యవ్ రెండు ఫార్మెట్స్ ని చాలా చక్కగా చూపించారు. ఇందులో ప్రతి పాటకు ప్రాముఖ్యత వుంటుంది. మ్యూజిక్ పరంగా అందుబాటులో వున్న అడ్వాన్స్ టెక్నాలజీ ని యూజ్ చేశాం.

‘హాయ్ నాన్న’ చూసినప్పుడు ఎలా అనిపించింది ?
వందకి వంద శాతం నమ్మకంతో చెబుతున్నా.. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన చిత్రాలని చూస్తారు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప కథలు వచ్చాయి. అందులో ‘హాయ్ నాన్న’ కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. నాని గారి నటన అద్భుతంగా వుంటుంది. నాని గారిని నేచురల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్ధమైయింది. అలాగే ఇందులో మృణాల్, బేబీ కియరా.. ఇలా అందరి పాత్రలు మనసుని హత్తుకునేలా వుంటాయి.

ఓడియమ్మ పాట గురించి చెప్పండి ?
కథలో ఒక పెద్ద పార్టీ సాంగ్ వుంది. ఆ విజువల్స్ మ్యాచ్ చేసే ఎనర్జిటిక్ నెంబర్ కావాలి. ఆ ఎనర్జీని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక ట్యూన్ రికార్డ్ చేసి శౌర్యవ్ కి సెండ్ చేశాను. అది ఆయనకి చాలా నచ్చింది. మనకి కావాల్సిన ఎనర్జీ ఇదే అన్నారు. ఈ పాటని ద్రువ్ తో పాడించాలానే ఆలోచన శౌర్యవ్ దే. అలాగే శ్రుతి హసన్ గారు కూడా అద్భుతంగా పాడారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ గురించి ?
వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమా కోసం 15 మంది మ్యుజిషియన్స్ దాదాపు 40 రోజులు హైదరాబాద్ లో పని చేశాం. మరో 20 మందికి పైగా ప్లేయర్స్ రికార్డింగ్స్ లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. మ్యూజిక్ అంతా హైదరాబాద్ లోనే చేశాం.

కొత్తగా చేస్తున్న చిత్రాలు?
శర్వానంద్‌ గారు, శ్రీరాం ఆదిత్య సినిమాకి చేస్తున్నాను. అలాగే రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పని చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved