`
pizza

Making Video Of Sudheer Babu, V Ananda Prasad's, 'HUNT' Action Sequences Out Now
సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన 'హంట్' యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

9 January 2023
Hyderabad

The makers of Sudheer Babu's upcoming action thriller - Hunt, directed by Mahesh and produced by the Veteran V Ananda Prasad have unveiled the making video which emphasizes the breathtaking action sequences in the film.

The video starts with Sudheer introducing the world of action that is packed into Hunt. He describes the film as a proper raw and real action thriller. The director Mahesh adds that the action will be very realistic and visually compelling.

We see the team, including Sudheer himself training extensively and performing very risky stunts without any ropes or safety beds. It is clearly seen that the scintillating action sequences in Hunt are all very real. This should give a new watching experience to the viewers on the big screens.

The team also describes how they shot a car accident sequence for real, without any CGI or VFX. We also get a glimpse of a very interesting chase sequence on Mime Gopi, and Sudheer.

It can be seen that 'Premisthe' fame Bharath is also performing several stunts in the film. He and Sudheer are seen with great physiques and watching them together in action should be interesting.

Renaud Favero and Bryan Viger who worked on several Marvel films and lastly on John Wick 4 have composed the action sequences for this film. These world class action compositions are sure to thrill the Telugu audience.

Hunt is announced for release on the 26th of January, marking the occasion of Republic Day. It promises a proper eye feast to action lovers.

Cast: Sudheer Babu, Srikanth, Bharath, Mime Gopi, Kabir Duhan Singh, Mounika Reddy, Goparaju Ramana, Sanjay Swaroop, and others.

Crew:
Art director: Vivek Annamalai
Costume: Raga Reddy
Action: Renaud Favero and Bryan Viger
Stunts: Ving Chun Anji
Editor: Pravin Pudi
Cinematography: Arun Vincent
Music: Ghibran
Executive Producer: Anne Ravi
Producer: V Anand Prasad
Director: Mahesh

సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన 'హంట్' యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. హీరో రానా దగ్గుబాటి ఈ రోజు సినిమా యాక్షన్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో 'హంట్' సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారని ఆ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. సుధీర్ బాబు, భరత్, యాక్షన్ టీమ్ పడిన కష్టం ఆ వీడియోలో కనిపించింది. డూప్స్, రోప్స్ వాడకుండా ప్రేక్షకులకు రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందం శ్రమించింది. 

యాక్షన్ సన్నివేశాల గురించి హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ''హంట్' రెగ్యులర్ ఫార్ములాలో వెళ్ళే సినిమా కాదు. కథను నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాం. క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ అని ఒక టీమ్ ఉంది. ఫ్రాన్స్‌లో ఉంటారు. వాళ్లను కొన్ని సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాను. చాలా కొత్తగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫైట్స్ చేస్తుంటారు. స్టంట్ పీపుల్ కూడా రోప్స్, బెడ్స్ వాడలేదు. సినిమాలో ఎక్కడా ఒక్క రోప్, బెడ్ వాడలేదు. మా కెమెరామెన్ ఉన్నా... ఫైట్స్ వరకు ఆ టీమ్ కెమెరామెన్ వర్క్ చేశారు. ఆయన కూడా ఫైటర్, స్టంట్ మన్. 'విక్రమ్'లో స్టంట్స్ షూట్ చేసేటప్పుడు బోల్ట్ అని కెమెరా కోసం మిషనరీ వాడారు. ఆ మిషనరీ లేకుండా అటువంటి ఎఫెక్ట్ కెమరామెన్ తీసుకొచ్చారు. దానికి చాలా స్కిల్స్ కావాలి. భరత్‌కు కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మనిషిని పైకి ఎత్తి మూడు నాలుగు అడుగుల దూరంలో ఉన్న గోడపై విసరాలి. ఎవరు చేస్తారని అనుకున్నా. భరత్ బాగా చేశాడు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేశారు క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ టీమ్. ఈ సినిమాలో యాక్సిడెంట్ తర్వాత మెమరీ లాస్ అయిన వ్యక్తిగా నటించాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఒక్కటే క్యారెక్టర్. కానీ, నా వరకు డబుల్ రోల్. మెమరీ లాస్ అవ్వడానికి ముందు, తర్వాత... అర్జున్ పాత్రలో డిఫరెన్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా కనబడుతుంది. అంజి మాస్టర్ ఆరేడు కెమెరాలతో ఛేజ్ సీక్వెన్స్, కార్ యాక్సిడెంట్ చేశారు. ఆయన కూడా రియల్‌గా షూట్ చేశారు. సీజీ వర్క్స్ లేకుండా ఫైట్స్ కూడా రియల్‌గా ఉండాలని అనుకున్నాం. అందుకే, అన్ని కెమెరాలు వాడాం. అన్ని యాంగిల్స్‌లో షూట్ చేశాం. ఛేజ్ సీక్వెన్సు కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ వస్తుంది. దానికి కూడా రిహార్సిల్స్ చేశాం. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు... చాలా కథ ఉంది'' అని చెప్పారు. 

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఒక ఈవెంట్‌లా ఉంటాయి. రియల్, రా, రస్టిక్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులు చూస్తారు. బాడీ డబుల్ వంటివి లేవు. స్క్రీన్ మీద చూసే ప్రతిదీ రియల్. 'హంట్'లో డిఫరెంట్ ఫార్మాట్ ఫైట్స్ చూస్తారు. సుధీర్ బాబు చాలా బాగా చేశారు'' అని చెప్పారు.   

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'హంట్'. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు వర్క్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ 'హంట్'. వాళ్ళ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. జనవరి 26న సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. 

'హంట్' సినిమాలో నటీనటులు:
సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.

'హంట్' సినిమా సాంకేతిక వర్గం :
ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ , స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved