దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్‌కు చెందిన వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాకు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన అందించారు.
మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ఐ యామ్ గేమ్’ నిలవనుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ అల్ట్రా స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. తన కెరీర్‌లో ఇదే అత్యంత స్టైలిష్ మూవీ అని దుల్కర్ ఇప్పటికే వెల్లడించారు. ‘లోకా’ బ్లాక్‌బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఇదే దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రం కావడం విశేషం.
ఇప్పటివరకు మలయాళ ప్రేక్షకులు చూడని స్టైల్‌లో థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా అందించబోతోంది. దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోని వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కయాడు లోహర్, కతిర్, పార్థ్ తివారి, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సీక్వెన్స్‌లను అన్బరివ్ డిజైన్ చేస్తున్నారు. ‘ఆర్డీఎక్స్’ బ్లాక్‌బస్టర్ తర్వాత నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది.