pizza

Im Game (Telugu) Pre-Release Event
‘ఐయామ్ గేమ్’ చూశాను. చాలా ఎంటర్టైన్‌మెంట్ ఉంటుంది. ఇందులోని కాన్సెప్ట్‌కు మీరందరూ సర్‌ప్రైజ్ అవుతారు: డైరెక్టర్ నాగ్ అశ్విన్

You are at idlebrain.com > news today >

31 August 2026
Hyderabad

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ప్రొడక్షన్‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలాగే ఉంది అని చెప్పారు. ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు.. ఇలా ఎవరి పేరు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అది తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం. మీ అందరి మనసులో నాకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో కూడా అలరిస్తానని నమ్ముతున్నాను. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పాను. నాగి ఈ సినిమా చూశారు. ఆయన ఎడిటింగ్‌లో హెల్ప్ కూడా చేశారు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమాను మీరు కచ్చితంగా థియేటర్‌లో చూడండి. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. తెలుగులో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మహానటి’ నా ఫేవరెట్. అది నాకు పాత్ బ్రేకింగ్ సినిమా. నా తెలుగు కెరీర్‌కు క్రెడిట్ మొత్తం నాగి, స్వప్న, ప్రియాంకకే ఇస్తాను. ఈరోజు నా సినిమాను ప్రమోట్ చేస్తున్నానంటే దానికి కారణం నాగి, స్వప్న, ప్రియాంక. వైజయంతి సినిమా అంటే నాకు ఫ్యామిలీ. నాగి ఎప్పుడు కాల్ చేసినా తన సినిమాలో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దుల్కర్ నిర్మాతగా 'లోక' సినిమా వేడుకకు వచ్చాను. ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఐయామ్ గేమ్’ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన నిర్మించడమే కాదు, నటించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్ట్‌కు మీరందరూ సర్‌ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా ఎంటర్టైన్‌మెంట్ ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది. దుల్కర్ గారు మంచి సినిమాలను ఇష్టపడతారు. ‘మహానటి’ నుంచి ఆయనతో నాకు జర్నీ ఉంది. ఆయన కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు. ఆయన కథ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. తప్పకుండా సెప్టెంబర్ 3వ తేదీన చాలా మంచి సినిమాను చూడబోతున్నారు.

ఆంటోనీ వర్గీస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి కల్చర్ నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది.

నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ.. దుల్కర్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన అద్భుతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

కదిర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్. అలాగే ఒక అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. దుల్కర్ గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అయినా కొత్త కథలు చెప్పడానికి ఎప్పుడూ రిస్క్ తీసుకుంటారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ చాలా గొప్ప ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంది.

సంయుక్త విశ్వనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఒక గొప్ప అనుభవం. ఏదో ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

దర్శకత్వం: నహాస్ హిదాయత్
సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్,
సంగీతం: జేక్స్ బిజోయ్,
ఎడిటింగ్: చమన్ చాకో
లైన్ ప్రొడ్యూసర్: బిబిన్ పెరుంబిల్లి,
ప్రొడక్షన్ హెడ్స్: సుజోయ్ జేమ్స్, దేవదేవన్,
ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చలిసేరి,
మేకప్: రోనెక్స్ జేవియర్,
కాస్ట్యూమ్: మషార్ హంస,
ప్రొడక్షన్ కంట్రోలర్: దీపక్ పరమేశ్వరన్,
అసోసియేట్ డైరెక్టర్: రోహిత్ చంద్రశేఖర్,
సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్,
VFX: తౌఫీక్ (ఎగ్ వైట్),
పోస్టర్ డిజైన్: టెన్ పాయింట్,
సౌండ్ డిజైన్: సింక్ సినిమా,
సౌండ్ మిక్స్: కన్నన్ గణపతి,
స్టిల్స్: SBK,

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved