1 August 2019
Hyderabad
కార్తికేయ హీరోగా నటించే ‘గుణ 369’ ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న భామ అనఘ. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆమె హైదరాబాద్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..
మీ పేరుకు అర్థం ఏంటి?
- ప్యూర్ అని అర్థం.
మీ గురించి చెప్పండి?
- మలయాళంలో మూడు సినిమాలు చేశా. వాటిలో పాత్రలు చాలా చిన్నవి. లీడ్ రోల్ మాత్రం ఫస్ట్ టైమ్ తమిళ్‌లో చేశాను. ఎంటెక్ చేశా. పీజీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా కొచ్చి వెళ్లాను. అక్కడ నాకు పరిచయమైన వాళ్లల్లో సినిమా వాళ్లున్నారు. వాళ్ల ద్వారా ఆడిషన్స గురించి తెలిసింది. అలా వెళ్లినప్పుడు నేను సెలక్ట్ అయ్యా. అటు నుంచి తమిళ్ ఇండసీ్ట్రలోకి వెళ్లా. హిప్‌హాప్ తమిళా హీరోగా చేసిన సినిమాలో నేను హీరోయిన. ఆ సినిమా చూసి మా దర్శకుడు అర్జున జంధ్యాలగారు ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకున్నారు.
ఇందులో మీది నటనకు అవకాశం ఉన్న పాత్రా?
- అవునండీ. నేను గర్ల్ నెక్స్ట్ డోర్‌లాగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు గీత. విలేజ్ అమ్మాయిని. సెల్‌ఫోన షాప్‌లో పనిచేస్తుంటాను. అయినా మనసులో అనుకున్న విషయాన్ని చాలా గట్టిగా చెప్పగలనన్నమాట.
కార్తికేయతో పనిచేయడం గురించి?
- ఆయన నటించిన ‘ఆర్.ఎక్స్.100’ గురించి విన్నానే కానీ, అప్పటిదాకా చూడలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు చూశాను. అంత పెద్ద సక్సెస్ ఉండి కూడా ఆయన చాలా సింపుల్‌గా, తనతో ఈక్వెల్‌గా నన్ను ట్రీట్ చేశారు.
మూడు భాషల్లో నటించారు. టాలీవుడ్ ఎలా ఉంది?
- ఇక్కడ నన్ను ప్రిన్సెస్‌లాగా ట్రీట్ చేస్తున్నారు. చాలా గౌరవంగా చూసుకుంటున్నారు.
మలయాళంలో అల్లు అర్జున ఫేమస్ కదా?
- చాలా ఫేమస్ అండీ. ఆయన నటించిన సినిమా కూడా చూశా. ఆయన డ్యాన్సులు, పాటలు నాకు బాగా ఇష్టం. హీరోయిన్లలో సమంత, నయనతార అంటే ఇష్టం. వాళ్ల కెరీర్లు షేపప్ అయిన తీరు నన్ను ఇనస్పయిర్ చేశాయి.
మీరు గ్లామర్ పాత్రలు చేయరా?
- చేయకూడదనేం లేదు. నాకు వచ్చే కథలను బట్టి డిసైడ్ చేస్తాను. అలాగని ఏదో ఐదారు సీన్లలో నటించే పాత్రలు చేయాలని లేదు.