pizza
Anand Deverakonda interview (Telugu) about Dorasani
మా అన్న ప్రౌడ్‌గా ఫీల‌యితే మంచిగా అనిపించింది - ఆనంద్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 July 2019
Hyderabad

విజయ్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్రం `దొర‌సాని`. రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక నాయిక‌గా న‌టించింది. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించాయి. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియాతో హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌ ముచ్చ‌టించారు...

* ఇండ‌స్ట్రీకి రావ‌డం ఎలా ఉంది?
- చాలా బావుంది. న‌మ్మి సినిమా చేశాను.

* మీ గురించి చెప్పండి?
- నేను కూడా మా అన్న చ‌దివిన స్కూల్లోనే చ‌దివా. ఆ త‌ర్వాత యు.ఎస్‌.లో జాబ్ చేశా. అన్న పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చేసిన త‌ర్వాత చాలా మంది మా డాడీని క‌లిసి `పెద్దోడు బిజీగా ఉన్నాడు. చిన్నోడైనా సినిమాలు చేస్తాడా` అన్న ధోర‌ణితో అడిగేవారు. నాకు అప్ప‌ట్లో సినిమాలంటే మ‌న‌వ‌ల్ల కాదులే అనిపించేది.

* న‌ట‌న నేర్చుకున్నారా?
- నేను చిన్న‌ప్పుడు థియేట‌ర్స్ చేశారు. అమెచ్యూర్ థియేట‌ర్స్ చేశాను కానీ, ఎప్పుడూ కెమెరా ఫేస్ చేయ‌లేదు. అందుకే కాస్త భ‌య‌ప‌డ్డాను. బ‌ట్ చేశాను.

* యు.ఎస్‌. నుంచి ఎందుకు వ‌చ్చిన‌ట్టు?
- అన్న బ్యేన‌ర్ పెట్టారు క‌దా. దాన్ని చూసుకుందామ‌ని, రౌడీ గార్మెంట్స్ చూసుకుందామ‌నుకున్నా. అలా ఉన్న‌ప్పుడే ఈ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. స‌రేన‌ని ట్రై చేశా.

* ఇంత‌కీ అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- ఈ సినిమా కోసం ఆడిష‌న్స్ చేస్తున్నార‌ని తెలిసింది. ఐదు గంట‌లు ప్రాప‌ర్‌గా క‌థ విన్నాను. నాకు, శివాత్మిక‌కు క‌లిపి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇద్ద‌రం క‌లిసి చేశాం. వాళ్ల‌కు లుక్ ఓకే అనిపించింది. స‌రేన‌ని నాక్కూడా న‌చ్చిచేశా.

* హీరోగా ఎలా అనిపించింది?
- హీరో అనేది కాదుగానీ, రాజు అనే పాత్ర చేయ‌డం థ్రిల్లింగ్‌గానే అనిపించింది.

* మీ అన్న ఏమ‌న్నారు?
- సినిమా చూడ‌టానికి వ‌చ్చేటప్పుడు టెన్ష‌న్ ప‌డ్డారు. నా సినిమాకు కూడా నేను ఇంత టెన్ష‌న్ ప‌డ‌ను అని అన్నారు. సినిమా చూసి న‌చ్చిన చోట్లంతా చింపేశావ్ అని చెప్పారు.

* తెలుగు మాట్లాడ‌టం మీకు క‌ష్ట‌మ‌యింద‌ని ఆ మ‌ధ్య శివాత్మిక చెప్పిన‌ట్టున్నారు?
- అంటే నేను ఇంగ్లిష్ మీడియ‌మ్ చ‌దివాను. దానికి తోడు యు.ఎస్. వెళ్లా. ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ శ్లాంగ్ మాట్లాడాల్సి వ‌చ్చింది. అందుకే కాస్త వోక‌ల్ ట్రైనింగ్ తీసుకున్నా.

* వ‌ర్క్ షాప్‌లు క‌లిసే చేశారా?
- వ‌ర్క్ షాప్ నేను విడిగా, శివాత్మిక విడిగా చేశాం. సినిమాలో ఆమె గ‌డీ లోప‌ల ఉంటుంది. నేను బ‌య‌ట ఉంటా. కాస్త డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ తెలియ‌డం కోస‌మే నేను విడిగా చేశాను. నాతో పాటు ఫ్రెండ్స్ కేర‌క్ట‌ర్లు ఉంటాయి. వాళ్ల‌తో క‌లిసి చేశా.

* షూటింగ్ కి రాజ‌శేఖ‌ర్‌గారు వ‌చ్చారా?
- రెండు, మూడు రోజులు వ‌చ్చిన‌ట్టున్నారు. ఆయ‌న క‌ల్కి సినిమాతో బిజీగా ఉన్నారు.

* మీ ద‌ర్శ‌కుడి మీద ఏంటి అంత న‌మ్మకం.. అంద‌రూ వ‌రుస‌గా ఆఫ‌ర్లు ఇచ్చారు?
- ఆయ‌న చాలా మంచి క‌థ‌కుడు. ఆయ‌న రాసిన ప్ర‌తి విష‌యం మీదా ఆయ‌న‌కు ప‌ట్టు ఉంటుంది. అది చాలా గ్రేట్‌గా అనిపిస్తుంది.

* సెకండ్ సినిమాకు సిద్ధం చేసుకుంటున్న‌ట్టున్నారు?
- రొమాంటిక్ కామెడీ అంటారు క‌దా. ఆ త‌ర‌హా చిత్రం. వ‌చ్చే నెల నుంచి షూటింగ్ ఉంటుంద‌నుకుంటున్నా.

* మొన్న ప్రీ రిలీజ్‌లో మీ అన్న ఎమోష‌న్ అయితే ఏమ‌నిపించింది?
- నాక్కూడా క‌న్నీళ్లు వ‌చ్చాయి. త‌ను ఆడిష‌న్‌కి ఒక‌సారి వెళ్లిన‌ప్పుడు నేను కూడా వెళ్లా. ఇది చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన సంగ‌తి అనుకోండి. అయినా అప్పుడు ముగ్గురు వ‌స్తే, వాళ్ల‌ల్లో విజ‌య్ చాలా బాగా చేశాడు. అయితే త‌న‌కి రాలేద‌న్న‌మాట‌. అప్పుడు త‌ను డిస‌ప్పాయింట్ కావ‌డం క‌ళ్లారా చూశా. త‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి ఎదిగాడు కాబ‌ట్టి, నేను సుఖాన్ని వ‌దిలేసి ఎక్క‌డ ఇబ్బందుల్లో ప‌డ‌తానో అని త‌న ఆలోచ‌న‌. అంతే.

* సినిమాల గురించి మాట్లాడుకుంటారా?
- చాలా సార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. మా నాన్న కొన్ని టీవీ సీరియ‌ళ్లు కూడా డైర‌క్ట్ చేశారు. సో మేం సినిమాల గురించి బాగానే మాట్లాడుకుంటూ ఉంటాం.

* ఫ‌ర్ద‌ర్‌గా ఎలాంటి సినిమాలు చేయాల‌ని ఉంది?
- పాత్ర‌కు నేను ఫిట్ అవుతాన‌నిపిస్తే క‌చ్చితంగా చేస్తాను.

* సినిమాను ఇండ‌స్ట్రీలో ఇంకెవ‌రైనా చూశారా?
-సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వాళ్లు చూశారు.

* మీరు మాట్లాడుతుంటే అచ్చం విజ‌య్ మాట్లాడుతున్న‌ట్టే ఉంది?
-వాడు చ‌దివిన స్కూల్లోనే చ‌దివా. వాడు పుట్టి పెరిగిన ఇంట్లోనే పెరిగా. సో అలాగే ఉంటుందేమో (న‌వ్వుతూ)

* ఈ చిత్రంలో లిప్‌లాక్‌లున్నాయా??
- సినిమా లో మంచి ఇంటెన్స్ ప్రేమ ఉంటుంది. ఎన్ని లిప్‌లాక్‌లున్నాయ‌న్న సంగ‌తి ముఖ్యం కాదు.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved