18 September 2018
Hyderabad
నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మించిన చిత్రం `దేవదాస్`. ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతుంది. ఈ నెల 20న ఆడియో విడుదలవుతుంది. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత సి.అశ్వనీదత్ ఇంటర్వ్యూ విశేషాలు..
* నిర్మాతగా ఇది నాకు 45వ చిత్రం. చాలా రోజుల తర్వాత డైరెక్ట్‌గా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నాం. ఒకప్పుడు నాలుగైదు మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించిన సంస్థలో దేవదాస్ వంటి మల్టీస్టారర్ రావడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావుగారి పుట్టినరోజు సందర్భంగా దేవదాస్ ఆడియో విడుదల చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. స్వప్న, ప్రియాంక లీడర్‌షిప్‌లో తెలుగులోనే కాదు.. వేరే భాషల్లో కూడా సినిమాలు చేయాలనుంది. కల్‌కఠా మెయిల్, కంపెనీ తర్వాత హిందీ సినిమాల నిర్మాణం చేయలేదు. నాగ్ అశ్విన్ కూడా హిందీలో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి హిందీ రంగంలో అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉన్నాం. వయాకామ్ మోషన్ పిక్చర్స్ 18 సంస్థ మాకు పార్ట్‌నర్‌గా ఉంటుంది. అలాగే తమిళంలో కూడా సినిమాలు చేయాలనుంది. వైజయంతీ మూవీస్ ప్లాట్‌ఫామ్‌ను తిరిగి కొద్దిగా పెంచాలని స్వప్న, ప్రియాంకలు ఆలోచిస్తున్నారు.
* `దేవదాస్` గురించి చెప్పాలంటే నాకు మంచి మిత్రుడు శ్రీధర్ బాబు సింపుల్‌గా లైన్ చెప్పారు.. అది బాగుందని అనిపించడంతో సినిమా చేద్దామని అనుకున్నాం. భూపతిరాజా ఆ కథకు మంచి స్క్రిప్ట్‌ను అందించారు. శ్రీరామ్ ఆదిత్య చక్కగా స్క్ర్రీన్‌ప్లే, దర్శకత్వం వహించాడు. ఇవాళ ప్రేక్షకులు ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఎన్నో కొత్త కథలను యంగ్ దర్శకులే డైరెక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీరామ్ ఆదిత్య ఒకరు. ఇంజనీరింగ్ చదువకున్న కుర్రాడు. బాగా చదువుకున్నాడు కాబట్టి సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. స్నేహం గురించి గొప్ప నిర్వచనం ఈ సినిమాలో ఇచ్చాం. అలాగే సాయిమాధవ్ బుర్రాగారు గొప్పగా డైలాగ్స్ రాశారు. మా సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన మణిశర్మగారు మాతో చేసిన 17వ సినిమా ఇది. చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. నాతో పాటు బిగ్ కమర్షియల్ గా తనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా గ్యాప్ ఉంది. పాటలు, నేపథ్య సంగీతంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన విశ్వరూపం చూపించాడు. రెండున్నర గంటలు సినిమా వినోదాత్మకంగా ఉంటుంది.
* లైన్ సెలక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్టర్ ఎవరని మూడు నెలలు వెయిట్ చేశాం. చివరకు శ్రీరామ్ ఆదిత్య అయితే బావుంటుందనిపించింది. తన దర్శకత్వంలో భలేమంచిరోజు, శమంతక మణి చిత్రాలను చక్కగా డైరెక్ట్ చేశాడు. శమంతక మణి సినిమా సమయంలో ఈ సినిమాకు డైరెక్టర్ తనని ఎంపిక చేశాం. ఈ స్టోరీ డెవలప్ చేసే క్రమంలో తను చాలా దూరం ట్రావెల్ చేశాడు.
* నాగార్జునగారితో `అజాద్` తర్వాత నేను సినిమా చేయలేదు. ఈ గ్యాప్‌లో నేను అబ్జర్వ్ చేసింది.. అంతకు ముందు నాగార్జునగారంటే 9,9.30కి వచ్చి మల్లెపువ్వులాగా, దర్శకుడు ఏం చెబితే అది చేసేవారు. కానీ ఇవాళ నాగార్జునగారిలో ఉన్న ఇన్వాల్వ్ మెంట్ చూస్తే నేను షాక్ అయ్యా. ఎన్టీ రామారావుగారు గనుక స్టోరీ, స్క్రీన్‌ప్లే నుంచి అన్ని డిపార్ట్ మెంట్‌లు ఎలా చేస్తారో, అంతగా చేశారు నాగార్జునగారు. ఆన్‌స్క్రీన్, బిహైండ్ స్క్రీన్‌గానీ నాగార్జునగారూ, నానిగారూ ఆసమ్‌గా చేశారు. వాళ్లను చూస్తే చాలా కొత్తగా అనిపించింది.
* వైజయంతిలో చిరు 4, నాగ్ 4, కృష్ణగారు 4 సినిమాలు చేశారు. ఇప్పుడు `దేవదాస్`తో నాగార్జునగారు 5వ సినిమా కూడా చేశారు. సో మా సంస్థలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయనే.
* ఆ తరం నటులతో మొదలుపెట్టిన వైజయంతీ మూవీస్‌కి, ఇప్పుడు సావిత్రిగారి కథను చెప్పడం ప్రెస్జీజియస్ అని అనుకుని చేశాం. ఆ సినిమా తీసినందుకు ప్రతి ఒక్కరికీ చాలా గొప్పగా అనిపించింది. స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ కలిసి చేసిన సినిమా `మహానటి`. ఇప్పుడు మరలా వైజయంతీ మూవీస్ ఫార్ములాలో మేం `దేవదాస్`ను తీశాం. మా సంస్థ ప్రతిష్టకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.
* నాగి నెక్స్ట్ సినిమా రాయడాన్ని మొదలుపెట్టారు. అలాగే మరో గొప్ప దర్శకుడు... నాకెంతో ఇష్టమైన దర్శకుడు అట్లీతో జనవరి నుంచి మరో సినిమా మొదలుపెడతాం. హీరోల పరంగా తారక్‌తో ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండతో రెండు సినిమాలున్నాయి. విజయదేవరకొండతో తీసే తొలి సినిమాను రాజ్,డి.కె డైరక్ట్ చేస్తారు. స్వప్న సినిమాలో నాగి ఎవరితో తీస్తారనేది ఇంకొన్ని రోజుల్లో చెబుతాం.
* కెమెరా ముందుకు రావాలని, దర్శకత్వం చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అన్నం వండటానికి ముందు, ఉడికిన తర్వాత చూసి చెప్పడం ఉత్తమం.
* సెప్టెంబర్ లాస్ట్ వీక్ మా సంస్థకు బాగా కలిసొచ్చిన సంవత్సరం. ఇన్నేళ్ల నా సినిమా జర్నీలో చాలా తృప్తి ఉంది. చాలాఇళ్లల్లో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద వాళ్ల లాగా నా పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అది నేను సాధించిన ఘనతగా భావిస్తున్నాను. అది చాలా గొప్ప థ్రిల్. నేను ఇంత స్టేజ్‌కి వస్తానని కానీ, ఇన్ని ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే నా సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం నా పేరు చెప్పుకోవాలని మాత్రం ఉండేది. రెండు దెబ్బలు మధ్యలో తగిలాయి. అప్పుడు కాస్త తేరుకుని మనమే కదా తీయగలం.. మనమే తీయాలి అని నా భార్య వెనుక నుంచి ఎప్పుడూ చెబుతూ ఉండేది. పోతే పోతాయి.. మళ్లా కష్టపడదాం. నువ్వు తప్ప మంచి సినిమాలు ఎవరు చేయగలరు? అని ఎంకరేజ్ చేస్తా ఉండేది. పిల్లలు ముగ్గురూ అమెరికా వెళ్లి చదువుకుని వచ్చినా పెద్ద వాళ్లు ఇద్దరూ ఈ రంగంలోనే ఉన్నారు. అది చాలా గర్వంగా అనిపిస్తుంటుంది.
* నా 21లో ఎన్టీఆర్‌గారితో సినిమా చేశా. 20 ఎండింగ్‌లో విశ్వనాథ్ గారితో ఓ సీతకథ చేశా. దీన్ని కూడా వ్యాపారంగానే ఎంచుకుని ఈ రంగానికి వచ్చాను కాబట్టి ఇష్టంగా చేశా. నేను డబ్బులుగా అయితే ఆ రోజు మా నాన్నగారు 1973లో తీసుకు వచ్చినదానికి టీ.నగర్‌లో స్థలాలు కొని ఉంటే కోట్లాధిపతిని అయి ఉండేవాడిని. డబ్బు పరంగా ఆ రోజు నేను తెచ్చినదానికి, ఇప్పుడున్న దానికీ బ్యాలన్స్ షీట్ చూసుకోకూడదు. కీర్తి ప్రతిష్టల పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను తాతలతో తీశా. తండ్రులతో తీశా. మనవళ్లతో తీశా. ఇంకా తీస్తా. ఇప్పుడు 45 ఏళ్లుగా ఉన్నా.. ఇంకా 100 ఏళ్లు నా పిల్లలు దీన్ని నడుపుతారు. మా సంస్థకు ఓ రోజు తెల్లారుజామున ఎన్టీరామారావుగారు వైజయంతీ మూవీస్ అని నామకరణం చేశారు. ఆపేరు బలంతో వందేళ్లు తప్పకుండా ఉంటుంది మా సంస్థ.
* స్వయంకృషి అనేది లేకపోతే ఏమీ చేయలేం. అది కావాలి. కానీ, మనకంటే ఇంకా గొప్పగా కష్టపడేవాళ్లు, మనకన్నా గొప్పగా ఆలోచించగలిగిన వాళ్లు.. చాలా మంది ఉన్నారు. ఇంత పోయింది.. అంత పోయింది అని అనుకున్నప్పుడు పక్కన కొందరిని చూస్తే వాళ్లు ఇంకా ఎంతో పోగొట్టుకున్నారు. అందుకే నాకు తెలిసి సినిమా రంగంలో అదృష్టం అనేది తప్పకుండా కలిసి రావాలి. ఇక్కడ టాలెంట్ మాత్రమే సరిపోదు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా.
* తెలుగు దేశం పార్టీ ప్రచారానికి సంబంధించిన పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగానీ నేను పోటీచేయను. పబ్లిసిటీ విభాగంలో మాత్రం తప్పకుండా నా వంతు కృషి చేస్తా. ఈ సినిమా విడుదల విడుదల కావడంతో నేను పబ్లిసిటీ మీదకు వెళ్తా. ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేస్తారు, గొప్పగా చేస్తారు అని అనుకున్నాను తప్ప, నేను ఆయన వెనుక రాలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక్కడ చంద్రబాబునాయుడు చేస్తున్న పనులు చూసి, కేవలం ఆయన మీద అట్రాక్షన్‌తో వచ్చాను. స్వతహాగా నా నరనరాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్ట్. అలాంటిది నాకు చంద్రబాబునాయుడుగారి మీద ఇష్టం, అందుకే తెలుగుదేశం పార్టీకోసం చేస్తున్నా. ఈ సీనియారిటీకి కంటెస్ట్ చేస్తే బావుంటుందని చాలా మంది అడిగారు. నాకు కంటెస్ట్ చేయాలని అసలు లేదు. నేను ఎవరిమీద రుద్దను. నామినేటెడ్‌గా, గౌరవప్రదమైన పదవులు కావాలని కూడా అనుకోవడం లేదు.
* నాగి ఒక స్టేజ్‌లో చెప్పినప్పుడు చిరంజీవిగారికి యాప్ట్ అవుతుందని అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆ కథ ఎలా వెళ్తుందో.. ఏంటో చూడాలి.
* వంద కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది కాలమాన పరిస్థితులను బట్టి పెట్టక తప్పడం లేదు. కానీ సక్సెస్ రేట్ మాత్రం పెరగకపోతే చాలా కష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడున్న 10 శాతం సక్సెస్ రేటే ఇప్పుడూ ఉంటే, ఇది మీనింగ్ లెస్. కాకపోతే ఇవాళ నిర్మాతలకి వరంలాగా టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఓవర్సీస్ రైట్స్ పెరిగాయి కాబట్టి రిస్క్ అంతగా అనిపించడం లేదు. లాస్ట్ 5,6 ఏళ్ల నుంచి, మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత ఎలా ఉన్నా.. ఫస్ట్ వీక్ షేర్లు వస్తున్నాయి కాబట్టి, ఎలాగూ బయటపడుతున్నారు కాబట్టి, పెద్దగా రిస్క్ అనిపించడం లేదు.
* ఎదురులేని మనిషి అప్పుడు ఎంతయిందో నాకు గుర్తులేదు. అప్పుడు 16. 15లక్షల్లో అయినట్టుంది. అదే ఇప్పుడైతే కోట్ల మీదే. నేను స్వప్నని `మహానటి`కి ఎంతవుతుందని అడిగా. రూ.16-17కోట్లవుతుందని అన్నది. కానీ అది ఎక్కువనుకున్నా. అయినా సావిత్రి మీద కాబట్టి `ఫర్వాలేదు. గ్రాఫిక్స్ దగ్గర, సెట్స్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు` అని అన్నా. ఆఖరికి అది రూ.29కోట్లయింది. క్వాలిటీ వంటివన్నీ చూసినప్పుడు అది అంతే అయింది. దాన్ని ఏమీ చేయలేం.
* స్వప్న సినిమాలో మా విజయదేవరకొండ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా చేయాలంటే రాజమౌళి సినిమా పూర్తవ్వాలి కదా.
* అప్పట్లో విజయ ప్రొడక్షన్స్, ఆ తర్వాత జగపతి అధినేత, ఆ తర్వాత రామానాయుడు.. అలా భారీగా తీసేవాళ్లు. కానీ ఇవాళ అందరూ భారీగానే చేస్తున్నారు. 100లో 90 మంది భారీగా తీస్తున్నారు. భారీగా తీస్తున్నామా, మామూలుగా తీస్తున్నామా అనే సంగతి తీసే నిర్మాతల్లో 90 శాతం మందికి తెలియదు.
* అశ్వనీదత్ భారీ సినిమాలు తీసి ఇండస్ట్రీని చెడగొట్టాడనే టాక్ కూడా ఉంది కదా.. ``సార్ అన్నీ సినిమాలు అలా జరగలేదు. అప్పుడు గ్రాఫిక్స్ లేకుండా, ఇన్ కెమెరా చేశారు. దానివల్ల అయింది. హీరోనే సినిమా అని నమ్మి నేను ఇండస్ట్రీకి వచ్చాను. హీరోతో సినిమాలు చేయను అని నేనెప్పుడూ అనలేదు.