సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా భూమిక పాత్రికేయులతో మాట్లాడుతూ ...
- ఇది వరకు నేను నటించిన చిత్రాలకు భిన్నమైన పాత్రలో `యు టర్న్` కనపడతాను. ఓ ఆర్టిస్ట్ భిన్నమైన పాత్రలు చేస్తేనే నటుడిగా సంతృప్తి.. గుర్తింపు దొరుకుతుంది. నేను కన్నడ `యు టర్న్` చూశాను. అయితే నేను నా తరహాలో నటిస్తూనే డైరెక్టర్ ఎలా కావాలనుకుంటున్నారో అలాంటి ఔట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. యు టర్న్‌లో నేను చేసిన పాత్రను మరే సినిమాలోనూ చేయలేదు. తెరపై ఎలా ఉంటుంది. ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే దానిపై ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను.
- సమంత అద్భుతంగా నటించింది. ఈగలో తను నటన చూశాను. ఆన్ సెట్స్‌లో తను ఇన్‌స్టెంట్ ఎనర్జీతో నటిస్తుంది.
- పాత్ర ఎంత నిడివి ఉందనడం కంటే ఎంత్ర ప్రాముఖ్యత ఉంది. అని చూసుకుని దాన్ని ఇంపాక్ట్‌తో నటిస్తే చాలు.
- నేను కూడా మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాను. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే అలాంటి సినిమాల సంఖ్య ఇంకా పెరగాలి. మన రచయితలు అలాంటి పాత్రలను క్రియేట్ చేయాలి.
- తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. మంచి టీమ్ కుదిరితే.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తాను.
- 1999లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇరవైయేళ్లుగా నటిగా రాణిస్తున్నాను. ఈ సమయంలో మనతో పాటు మన చుట్టు పక్కల ఉండే చాలా విషయాలు మారుతాయి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు నా చుట్టు ఉన్న విషయాలను చూసే కోణం మారింది.
- సక్సెస్, ఫెయిల్యూర్ నన్ను ఎప్పుడూ బాధించవు. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం అలాంటిది. ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఒకప్పుడు లేదు. కాబట్టి నాపై జయాపజయాలు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.
- హిందీలో ఈ ఏడాది విడుదల కాబోయే `కామోషి` చిత్రంలో నా పాత్ర చిన్నదే అయినా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే తమిళంలోఓ సినిమా.. తెలుగులో యు టర్న్ సినిమాలు చేశాను. ప్రతి పాత్ర చాలా వైవిధ్యమైనదే.