pizza
Bellamkonda Sai Sreenivas interview (Telugu) about Kavacham
యాక్ష‌న్ సినిమాల‌కే రీచ్ ఎక్కువ - బెల్లంకొండ శ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 December 2018
Hyderabad

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో నవీన్‌ సొంటినేని నిర్మించిన చిత్రం 'కవచం'. డిసెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...

యాక్షన్‌ సినిమాలకు రీచ్‌ ఎక్కువ...
- యాక్షన్‌ సినిమాలకు పెద్ద రీచ్‌ ఉంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. లవ్‌స్టోరీ అంటే రెండు, మూడు చేయవచ్చు. పది లవ్‌స్టోరీస్‌ వరుసగా చేయలేం. అదే యాక్షన్‌ కథలనుకోండి. ఎన్నైనా చేయవచ్చు. చాలా వేరియేషన్‌ కథలు, జోనర్స్‌లో యాక్షన్‌ కథలున్నాయి. వేరియేషన్‌ చాలా స్కోప్‌ ఉంది.

డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మామిళ్ల గురించి..
-దర్శకుడు శ్రీనివాస్‌ 'దృశ్యం, గోపాలగోపాల' వంటి చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. కాబట్టి ఆయన కథ నెరేట్‌ చేసేటప్పుడు చాలా చక్కగా.. అనుభవమున్న డైరెక్టర్‌లా నెరేట్‌ చేశారు. ఈ కథపై మంచి అవగాహన ఉంది. కథలో మంచి ట్విస్టులు, టర్న్స్‌ ఉంటాయి. తొలి పదిహేను నిమిషాలు కథ నార్మల్‌గా ఉంటుంది. తర్వాత నుండి కథలో ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా స్పీడుగా సాగుతుంటుంది. సినిమా చూస్తే.. ఓ కొత్త దర్శకులు చేసినట్లు అనిపించదు. మంచి కమాండింగ్‌తో ఔట్‌ పుట్‌ రాబట్టుకున్నారు. ఆయకేం కావాలనే దానిపై క్లారిటీతో ఉన్నారు.

సినిమాలో క్యారెక్టర్‌ అదే...
- 'కవచం'లో నేను తొలిసారి పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను కావాలనే ఓ కేసులో ట్రాప్‌ చేసి ఇరికిస్తారు. ఆ ట్రాప్‌ నుండి బయటపడి ఆ పోలీస్‌ ఆఫీసర్‌ కేసును ఓ రోజులో ఎలా సాల్వ్‌ చేసుకున్నాడనేదే కథ. ప్రేక్షకుల్లో ఇంటర్వెల్‌ నుండి నెక్స్‌ట్‌ ఏంజరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. సినిమా చాలా రేసీగా ఉంటుంది.

సినిమా చూడాల్సిందే...
- ఇందులో కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ హీరోయిన్స్‌గా నటించారు. మెహరీన్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మరి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన హీరో ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరికి కవచం ఉండి రక్షించాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

interview gallery



అదే మెయిన్‌ టెయిన్‌ చేశాను...
- 'జయజానకినాయక, సాక్ష్యం' సినిమాల నుండి బాడీ బిల్డప్‌ చేస్తూ వచ్చాను. కాబట్టి ఈ సినిమాకు దాన్నే మెయిన్‌ టెయిన్‌ చేస్తూ వచ్చాను. ఇందులో యాక్షన్‌ ఉన్నా కూడా.. థ్రిల్లర్‌ ప్రధానంగా సినిమా సాగుతుంది. ఎక్కడా సినిమా డివేయిట్‌ చేయకుండా సాగుతుంది. విమర్శకులకు, ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది.

మంచి రిలీజ్‌ డేట్‌ కోసం...
- పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే రీరికార్డింగ్‌ చక్కగా కుదిరింది. పాటలను కాస్త ముందుగా రిలీజ్‌ చేసుండాల్సిందనిపించింది. డిసెంబర్‌ 2న కూడా సాంగ్‌ రికార్డింగ్‌ చేయలేదు. 3 తారీఖున చేశామంటే ఎంత త్వరగా చేశామో అర్థం చేసుకోవాలి. అందుకు కారణం మంచి రిలీజ్‌ డేట్‌. ఇది మిస్‌ అయితే ఫిబ్రవరి వరకు మంచి డేట్‌ దొరకదు. అనుకున్న డేట్‌లో సినిమాను విడుదల చేయడానికి చాలా కష్టపడ్డాం.

అమితాబ్‌ సినిమాలు చూశాను...
- కెరీర్‌ ప్రారంభంలోనే పోలీస్‌ క్యారెక్టర్‌ రోల్‌ చేశావేంటి? అని చాలా మంది అడిగారు. అయితే ఇది కావాలనుకుని చేసిన పని కాదు. మంచి కథ కుదిరింది కాబట్టే చేశాను. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌ లుక్‌లోలో అల్టిమేట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు విజయ్‌. పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చేయడానికి ముందు అమితాబ్‌ బచ్చన్‌గారి సినిమాలు చాలానే చూశాను. ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన సినిమాల్లో ఆయన పేరు విజయ్‌. కాబట్టి అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలో నా పాత్ర పేరుని విజయ్‌ అని పెట్టారు.

ఆ విషయంలో హ్యాపీ...
- ఫ్యాన్స్‌ విషయంలో నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నా వద్దకు వచ్చే ఫ్యాన్స్‌ వాళ్ల అభిప్రాయాలను చాలా జెన్యూన్‌గా చెబుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే కాదు.. చేసే పనిని శ్రద్ధగా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాను.

తేజ సినిమా గురించి...
- తేజగారి సినిమాలో ఫస్టాఫ్‌లో పెద్దగా యాక్షన్‌ ఉండదు. రొమాంటిక్‌ కామెడీ.. సెకండాఫ్‌లో యాక్షన్‌ ఉంటుంది. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ. అల్లుడు శీను తర్వాత ఆ రేంజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న మూవీ. పది రోజుల మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది.

తదుపరి చిత్రాలు...
- మూడు సినిమాలు ఓకే చేశాను. త్వరలోనే వాటి వివరాలను ప్రకటిస్తాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved