pizza
Chandoo Mondeti interview (Telugu) about SavyaSachi
'సవ్యసాచి' లాంటి కథలతో సినిమా చేసేటప్పుడు చాలా మోటివేట్‌ అవుతుంటాను - చందు మొండేటి
You are at idlebrain.com > news today >
Follow Us

29 October 2018
Hyderabad

 

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సవ్యసాచి'. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌(సి.వి.ఎం)ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 2న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మొండేటితో ఇంటర్వ్యూ...

'సవ్యసాచి' కథాలోచన ఎవరిది?
- ఓ ఫ్రెండ్‌ కారణంగా వానిషింగ్‌ సిండ్రోమ్‌ అనే ఆర్టికల్‌ చదివాను. ఆ ఆర్టికల్‌ను చదువుతున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. వానిషింగ్‌ సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తులు ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలాంటి విపరీతాలు ఉంటాయి? అనేవి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నా మైండ్‌లో వేరే కథ రన్‌ అవుతూ ఉంది. ఆ కథలో వానిషింగ్‌ సిండ్రోమ్‌ను తీసుకొచ్చి బ్లెండ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అని హీరో చైతన్యను అడిగాను. ఆయన కూడా ఎగ్జయిట్‌ అయ్యారు. దానిపై కథను డెవలప్‌ చేయడం ప్రారంభించాను. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలోని నవీన్‌గారు, మోహన్‌గారికి నా ఆలోచన చెప్పాను. వాళ్లు కూడా ఎగ్జయిట్‌ అయ్యారు. తర్వాత నేను, హీరో నాగచైతన్య, నిర్మాతలు కూర్చుని మాట్లాడుకున్నాం. 'కొత్తగా ఉంది.. డెవలప్‌ చేద్దాం' అని గత ఏడాది ఆగస్ట్‌, సెప్టెంబర్‌లో అనుకున్నాం. టైటిల్‌ కూడా 'సవ్యసాచి' అని అప్పుడే ఫిక్స్‌ అయ్యాం. అందరికీ నచ్చడంతో కథను డెవలప్‌ చేసుకుంటూ వచ్చాను. అంతా ఓకే అనుకున్న తర్వాత సెట్స్‌కు వెళ్లాం.

సినిమాలో ఎడమ చేయికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
- హీరో రెండు చేతులకు సమానమైన బలం ఉంది. కానీ ఎడమ చేయి కాస్త డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంది. దానికంటూ ఓ సపరేట్‌ క్యారెక్టరైజేషన్‌ ఉందని అనుకున్నప్పుడు ఈ టైటిల్‌ యాప్ట్‌గా అనిపించింది. కథే స్టయిల్‌గా ఉంటుంది.

చైతన్యతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది?
- అక్కినేని ఫ్యామిలీ లవ్‌స్టోరీస్‌కి పాపులర్‌. చైతన్య చేసిన ఏ లవ్‌స్టోరీ కూడా ఫెయిల్‌ కాలేదు. అలాగే ప్రస్తావించాల్సిన విషయమేమంటే సాధారణంగా కథంతా ఓకే అయిన తర్వాత కలిసి ట్రావెల్‌ చేయడం ఓకే. కానీ పాయింట్‌ వినగానే నచ్చి.. 'చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది' అని నన్ను ఎంకరేజ్‌ చేయడం గొప్ప విషయం.

ఫస్ట్‌ కాపీ చూశారా? డైరెక్టర్‌గా మీకు సంతృప్తిగా అనిపించిందా?
- సినిమాలో పాత్రలన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాటిని క్యారీ చేసే నటీనటులు ఎంతో అవసరం. చైతన్య క్యారెక్టర్‌కు అపోజిట్‌గా మాధవన్‌గారితో పాటు మరో నలుగురు పేర్లను కూడా అనుకున్నాం. మాధవన్‌గారు పాన్‌ ఇండియా యాక్టర్‌. తమిళం, హిందీలో చాలా పాపులర్‌్‌. ఆయన నార్మల్‌ సినిమాలు చేయరు. చాలా పెక్యులర్‌ మూవీస్‌నే చేయడానికి ఇష్టపడతారు. ఆయనకు నేను 45 నిమిషాల నెరేషన్‌ ఇచ్చాను. ఆయనకు నచ్చింది. యాక్ట్‌ చేయడానికి ఒప్పుకున్నారు. 'ఇది తీసి పారేసే కథ కాదు'.. అనే నమ్మకం ఆయన ఒప్పుకోగానే కలిగింది. తర్వాత కీరవాణిగారిని మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుకుని వెళ్లి కలిసినప్పుడు ఆయన కూడా కథ విని ఒద్దికగా కథ నుండే మ్యూజిక్‌ను మొదలు పెడదామని ఆయన అనడం మరో మెట్టు. అలాగే ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావుగారు కూడా కథ వినడమే కాకుండా ఎడిటింగ్‌ టేబుల్‌పై ఏది బావుందనే విషయాన్ని చెప్పి చాలా కేర్‌ తీసుకున్నారు. అలాంటి అనుభవమున్న వ్యక్తులు కథ బావుందని చెప్పడంతో నాలో నమ్మకం పెరిగింది. ఓ దర్శకుడిగా అదే నాకు సంతృప్తి ఇచ్చింది. ఇప్పుడూ అదే నమ్మకంతో ఉన్నాం.

నాగార్జున సాంగ్‌ రీమిక్స్‌ చేయాలనే ఆలోచన ఎవరిది?
- నాదేనండి!...మా సినిమా ఫస్టాఫ్‌ అంతా క్యారెక్టర్స్‌ ఎష్టాబ్లిష్‌మెంట్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మెయిన్‌ ప్లాట్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత సెకండాఫ్‌ రన్‌ అవుతుంది. ఇది కాస్త సీరియస్‌గా ఉంటుంది. ఈ మోడ్‌లో ఎవరికైనా రిలీఫ్‌ కావాలంటే బావుటుందనిపించి అల్లరి అల్లుడులో లగాయిత్తు పాటను రీమిక్స్‌ చేయాలనుకున్నాం. సెకండాఫ్‌ మధ్యలో కథానుగుణంగా ఈ పాటను బ్లెండ్‌ చేశాం. ఇప్పటి తరానికి చెందినట్లుగా కీరవాణిగారు ఈ పాటను బ్లెండ్‌ చేశారు. రేపు థియేటర్‌లో పాటను చూస్తే ఆ ఎనర్జీ కనపడుతుంది.

డిఫరెంట్‌ పాయింట్‌ను యాక్షన్‌కు బ్లెండ్‌ చేయడం కష్టమనిపించిందా?
- కష్టమేమీ అనిపించలేదండి.. ఇది కొత్తగా కనిపెట్టిన పాయింట్‌ ఏమీ కాదు. ఉన్న విషయాలే. అలాంటి విషయాలను మన కథకు తగ్గట్లు బ్లెండ్‌ చేస్తే బావుటుందనిపించింది. దీన్ని కరెక్ట్‌ వేలో పెట్టడానికి తర్జన భర్జనలైతే జరిగాయి.

చైతన్యను ఇలాంటి యాంగిల్‌లో చూపించాలని ఎందుకు అనిపించింది?
- బేసిక్‌గా నేను ఇలాంటి పాయింట్స్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. నా తొలి చిత్రం కార్తికేయకానీ.. ఇప్పుడు సవ్యసాచి.. ఇలాంటి కథలు రాసేటప్పుడు నాకు నేనే బాగా మోటివేట్‌ అవుతాను. ఒకటికి పదిసీన్స్‌ రాసుకుంటాను. ప్రేమమ్‌ సినిమా విషయానికి వస్తే.. లవ్‌స్టోరీ చైతన్యలాంటి హీరోకి వర్కవుట్‌ అవుతుందనుకుని చేసిన సినిమా. అయితే బేసిక్‌గా థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ ఎగ్జయిట్‌మెంట్‌ మూవీస్‌ అంటే ఇష్టం.

నిధి అగర్వాల్‌ గురించి...?
- ఈ సినిమాలో కాస్టింగ్‌ అనుకున్నప్పుడు భూమికగారి పాత్ర నిడివి తక్కువే అయినా మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఉండే క్యారెక్టర్‌ చేశారు. అలాగే మాధవన్‌ గారు, రావు రమేష్‌ గారు, వెన్నెల కిషోర్‌గారు మంచి రోల్స్‌ చేశారు. హీరోయిన్‌గా అయితే కొత్త అమ్మాయినే అనుకున్నాం. తరువాత 'మున్నా మైకేల్‌' చూసి నిధి అగర్వాల్‌ని ఓకే అనుకున్నాం. తన డాన్స్‌ మూమెంట్స్‌ చాలా బావుంటాయి.

మీ సినిమాల్లో స్క్రీన్‌ప్లే, మాటలు బావుంటాయి. ఈ ప్రాసెస్‌లో దేన్ని ఎంజాయ్‌ చేశారు?
- కథను బాగా ఎంజాయ్‌ చేశాను.

'కార్తికేయ' సినిమా సీక్వెల్‌ ఎప్పుడు?
- స్టోరీ ఐడియా అయితే ఉంది. అలాంటి ఐడియా కథ చేయాలంటే డైరెక్టర్‌గా ఇంకా కొంత అనుభవం రావాలి. పదిహేను నిమిషాల కథ సిద్ధంగా ఉంది.

నాగార్జునతో సినిమా ఎప్పుడు ఉండొచ్చు?
- స్క్రిప్ట్‌ అయితే ఉంది ,కానీ ఎలా ముందుకు వెళ్తుందో అనేది ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి చూడాలండి.

తమన్నాతో స్పెషల్‌ సాంగ్‌ అనుకున్నారు కదా?
- ముందుగా అనుకున్న మాట నిజమే!.. అయితే తనను తీసుకొచ్చే పర్‌పస్‌ అంతగా లేదనిపించింది. మేం ఏదైతే సాంగ్‌ను డిజైన్‌ చేసుకున్నామో దాంట్లో తను ఫిట్‌ కాదు. తను ఫిట్‌ అయ్యుంటే వేరే లెవెల్‌ లో ఉండేది. కానీ నిధి కూడా టెర్రిఫిక్‌ డాన్సరేనండి. హీరో, హీరోయిన్‌తో వెళ్లిపోయాం.

డైరెక్టర్‌గానే కాక.. వేరే సినిమాకు డైలాగ్స్‌ రాసారు కదా?
- అవునండి. 'కిరాక్‌ పార్టీ' సినిమాకు రాశాను. డైరెక్టర్‌,హీరో నాకు మంచి ఫ్రెండ్స్‌ అందుకే ఈ సినిమా గ్యాప్‌ లో డైలాగ్స్‌ రాశాను.

మైత్రి మూవీస్‌ గురించి ..?
- నేను హీరోగారు కలిసి సినిమా చేయాలనుకున్నప్పుడు సింపుల్‌గా చేసేద్దామనే అనుకున్నాం. అయితే మాధవన్‌గారు, భూమికగారు, చంటిగారు, కీరవాణిగారు.. ఇలా పెద్ద పెద్ద పేర్లు యాడ్‌ అయ్యి వెయిటేజీ పెరిగిందంటే అందుకు కారణం మైత్రీ మూవీ మేకర్సే. నన్ను అంత కంఫర్ట్‌ జోనర్‌లో పెట్టారు. ఇలాంటి బ్యానర్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
రెండు ప్రొడక్షన్‌ హౌస్సెస్‌ తో కమిట్మెంట్‌ ఉంది.ఇంకా ఏది ఫైనలైజ్‌ కాలేదు







Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved