నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు చిరంతన్ భట్ పాత్రికేయులతో ముచ్చటించారు.
గౌతమిపుత్ర శాతకర్ణి అవకాశం...
- గౌతమిపుత్ర శాతకర్ణికి ముందు దేవిశ్రీప్రసాద్ సంగీతం అనుకున్నది తర్వాత నేను బోర్డ్‌లోకి రావడం అనే విషయాలు నాకు తెలియవు. అయితే నేను నాసిక్‌లో ఉన్నప్పుడు ఓరోజు దర్శకుడు క్రిష్ నాకు ఫోన్ చేసి ఇలా బాలకృష్ణగారి మూవీకి సంగీతం అందించమన్నారు. నేను కూడా సరేనన్నాను. అలా గౌతమిపుత్ర శాతకర్ణి జర్నీ స్టార్టయ్యింది.
ఫోన్‌లో చెప్పేవారు...
- దర్శకుడు క్రిష్ షూటింగ్‌లో ఉండటం వల్ల నేను ఆయన్ను కలవకపోయాను. అయితే ఆయన నాకు ఫోన్‌లో సిచ్యువేషన్స్ చెప్పేవారు. ఆయన చెప్పిన సిచ్యువేషన్స్‌కు తగిన విధంగా నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను.
Chirantan Bhattinterviewgallery
అదే గోల్‌గా మ్యూజిక్ చేశాను...
- బాలకృష్ణగారికి ఇది 100వ చిత్రమైనా నేను ఎలాంటి ఈక్వేషన్స్, ప్రెషర్స్ పెట్టుకోలేదు. బాలయ్యగారి ఫ్యాన్స్, ఆయన వందవ సినిమా గురించిన ప్రెషర్ అంతా డైరెక్టర్ క్రిష్‌కు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో తనకే బాగా తెలుసుననది నా నమ్మకం. అందుకే క్రిష్ నా మ్యూజిక్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తే చాలు, అదే లక్ష్యం అనుకుని పనిచేశాను. అదే మైండ్‌లో పెట్టుకుని పనిచేశాను. అయితే ఇది రెగ్యులర్ సినిమా కాదు. అదీ కాకుండా ఇలాంటి హిస్టారికల్ సినిమాను 75 రోజుల్లో చిత్రీకరించారు. ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చే సమయంలో అన్ని విభాగాలకు సంబంధించిన వర్క్ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. వర్క్‌కు సంబంధించిన ప్రెషర్ ఉండేది. నేను ట్యూన్ ఇవ్వడం దాన్ని షూటింగ్ చేయడం చేస్తూ వచ్చారు. నాకు తెలుగు రాకపోయినా డిస్కషన్స్‌లో ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలా కావాలో తెలుసుకుని సన్నివేశానికి తగిన విధంగా సంగీతాన్ని అందించాను.
ఆ జాగ్రత్తలు తీసుకున్నాను...
- హిస్టారికల్ మూవీ, ఎంతో ప్రెస్టీజియస్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతి సీన్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అలాగే రీరికార్డింగ్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వాలో కూడా తెలుసు. అందువల్ల ఎక్కువగా మోడ్రన్ సంగీత పరికరాలను ఎక్కువగా వాడకుండా హిస్టారికల్ సినిమాకు ఒకప్పుడు ఎలాంటి పరికరాలను ఉపయోగించారో వాటినే ఎక్కువగా వాడాం. ప్రస్తుతం మిక్సింగ్ జరుగుతుంది. రెండు, మూడు రోజుల్లో సంగీతానికి సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుంది.
సినిమాలో హైలైట్స్..
- రైటర్ సాయిమాధవ్ బుర్రాగారు రాసిన డైలాగ్స్‌కు ఆడియెన్స్ క్లాప్స్ కొట్టకుండా ఉండలేరు. అంత అద్భుతమైన డైలాగ్స్‌ను రాశారు సాయిమాధవ్‌గారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఏదో నార్మల్ సినిమా అయితే కాదని కచ్చితంగా చెప్పగలను. ప్రతి సీన్‌ను విజువల్ వండర్‌లా అనిపిస్తుంది. మంచి ఎమోషన్స్ క్యారీ అవుతాయి.
తదుపరి చిత్రాలు...
- అక్షయ్ కుమార్ జాలీ ఎల్.ఎల్.బి చేస్తున్నాను. తెలుగులో వేరే సినిమాలు చేయడం లేదు..