pizza
Dil Raju interview (Telugu) about Jaanu
`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

3 February 2020
Hyderabad

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ...

రీమేక్‌ల‌కు మీరు వ్య‌తిరేక‌మా?
- రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని. అలా ట్రావెల్ చేస్తే ఆ మేజిక్ బావుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఆలోచించ‌లేదు. మ‌ధ్య‌లో `ప్రేమ‌మ్‌`, `బెంగ‌ళూర్ డేస్` చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా `బెంగళూరు డేస్` సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా వ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, శ‌ర్వా ఇద్ద‌రూ ఆ సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. త‌ర్వాత `ప్రేమ‌మ్` చేద్దామ‌ని అనుకుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ అన్నా! నేను రీమేక్ చేసుకుంటా అన్నాడు. స‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి. ఈ సినిమాను మ‌నం మిస్ అవ‌కూడ‌ద‌నే ఫీలింగ్ వ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా ఈ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నాం. త‌మిళ `96` చిత్రాన్ని తెలుగులో `జాను`గా రీమేక్ చేస్తుంటే..తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ మూడు హార్ట్ ట‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా. `జాను` విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్రం `96` టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌టి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, హ‌రి సినిమా చూశాం. నాకు త‌మిళంలో పెద్ద‌గా అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌గా ఎక్కేసింది. థియేటర్ బ‌య‌ట‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది.

సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమైనా ఉందా?
- ప్ర‌త్యేక‌మైన కార‌ణమేమీ లేదు. సినిమాలో ఫ్లో ఉంది. అద్భుత‌మైన సన్నివేశాలున్నాయి. అంతే కాకుండా.. చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్‌, రీ యూనియ‌న్ అన‌గానే మ‌నం పాత రోజుల‌కు వెళ్లిపోతాం. సాధార‌ణంగా ల‌వ్, క్ర‌ష్ ఉంటుంది. అది బ్రేక‌ప్ అయిపోతుంది. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప్రేమ అనేది ఎప్పుడూ స‌క్సెస్ కాదు. అలాంటి ప్యూరిటీ ఉన్న ప్రేమ‌క‌థ 96. అలాంటి ప్రేమ‌క‌థ ఉన్న‌వారంద‌రూ క‌నెక్ట్ అవుతారు. అదే చూసే ఎగ్జ‌యిట్ అవుతారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంద‌ని సినిమా చూస్తున్న‌ప్పుడే అనిపించింది.

రీమేక్ చేసేట‌ప్పుడు మాతృక‌లోని మేజిక్ క్రియేట్ అవుతుందో కాదోన‌నే టెన్ష‌న్ ఫీల‌య్యారా?
- నేను చేసిన మంచి పనేంటంటే త‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌నే ఈ సినిమాకు తీసుకురావ‌డం. హ‌లోగురు ప్రేమ‌కోస‌మే కెమెరామెన్ విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి నేను 96 సినిమా చూడ‌టానికి చెన్నై వెళుతున్నాన‌ని తెలియ‌గానే.. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు? మ‌న ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేశాడ‌ని చెప్పాడు. ప్రివ్యూ చూసిన‌ప్పుడు నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్‌తోనూ మాట్లాడాను. మీకు ఆస‌క్తి ఉంటే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌తో క‌లిసి చూశాను. ఆ స‌మ‌యంలో డైరెక్ట‌ర్‌తో నువ్వు సినిమా చెయ్యాల‌ని అన్నాను.

రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది?
- నేను `96` రీమేక్ గురించి అనౌన్స్ చేయ‌గానే అదొక క్లాసిక్ ఎందుకు చెడ‌గొడుతున్నారంటూ చాలా మంది అన్నారు. హీరోల్లో నాని సినిమా చూసి సూప‌ర్బ్ మూవీ అన్నాడు. త‌ర్వాత సినిమాను బ‌న్నీకి చూపించాను. అప్ప‌టికి త‌మిళంలోనూ సినిమా రిలీజ్ కాలేదు. త‌ను సినిమా చూసొచ్చిన త‌ర్వాత క్లాసిక్ మూవీ అన్నాడు. అప్పుడు నాకు న‌మ్మ‌కం పెరిగింది.

రీమేక్ చేసే సంద‌ర్భాల్లో మీరెలాంటి టెన్ష‌న్ ప‌డ్డారు?
- త‌మిళంలో `96` సినిమాకు అప్రిషియేష‌న్‌తో పాటు అద్భుత‌మైన కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. సినిమా ఆడియెన్స్‌కు ఎంత క‌నెక్ట్ అయ్యిందంటే చాలా మంది తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా రింగ్ టోన్‌ను పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప్రేమ్‌తో డిస్క‌ష‌న్ చేస్తున్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు ఐదారు పాయింట్స్ చేంజ్ చేస్తే బావుంద‌నుకున్నాం. అలాగే చేంజ‌స్ చేశాం. కంపేరిజ‌న్ వ‌స్తాయ‌ని.. స‌మంత అయితే భ‌య‌ప‌డింది. అలాగే శ‌ర్వాను కూడా ఒప్పించాను. ఈ సినిమాకు ఒక మీట‌ర్ ఉంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌ను మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా తొంద‌ర‌పెట్టలేదు. సినిమాను ఓ హృద‌యంతో చూశాను. రేపు త‌మిళంలో సినిమాను చూసిన ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతారు.

త‌మిళంలో స‌న్నివేశాల‌ను తెలుగు మేకింగ్‌లో ఉప‌యోగించారా?
- లేదు.. ఫ్రెష్ సినిమా చేసిన‌ట్లు చేశాను. త‌మిళంలో చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో.. తెలుగులో చూసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యా

స‌మంత గురించి ?
- ముందు `జాను`లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ్డ స‌మంత‌.. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల త‌ర్వాత ప్ర‌తిరోజూ మేజిక్ జ‌రుగుతుందంటూ నాకు మెసేజ్‌లు పెట్టింది. మీరు న‌న్ను ఒప్పించ‌కుంటే.. నేను చాలా మిస్ అయ్యుండేదాన్ని అని కూడా చెప్పింది. స‌మంత‌, శ‌ర్వానంద్ ఇద్ద‌రూ చిన్న‌వాళ్లేం కాదు.. సినిమాను ఓన్ చేసుకుని అద్భుతంగా న‌టించారు.

ఇప్పుడు రీమేక్ .. స‌్ట్ర‌యిట్ సినిమాల్లో ఏదీ చేయ‌డం సుల‌భ‌మ‌నుకుంటున్నారు?
- స్ట్ర‌యిట్ సినిమా చేయ‌డ‌మే సుల‌భం

డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ గురించి?
- సాధార‌ణంగా ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాను చేసిన త‌ర్వాత అదే సినిమాను మ‌రోసారి చేస్తున్న‌ప్పుడు అక్క‌డేం చేశాడు..ఇక్క‌డేం చేస్తున్నాడ‌ని చూస్తాం. ప్రేమ్ ఆ విష‌యంలో ఎలాంటి డిస‌ప్పాయింట్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామ‌ర్‌. శ‌ర్వానంద్ చాలా హ్యాపీ. స‌మంత ఎలాగూ చేస్తుందని...శ‌ర్వా విష‌యంలో ప్రేమ్ కాస్త టెన్ష‌న్ ప‌డేవారు. విజ‌య్ సేతుప‌తి మ్యాచ్ చేయ‌డం అంత సుల‌భం కాదు.. అయితే శ‌ర్వా క‌థ‌ను ఓన్ చేసుకుని అద్భుతంగా బాలెన్స్ చేశాడు. సినిమా చూసిన త‌ర్వాత త‌ను నాపై న‌మ్మ‌కంతో ఒక‌రోజు మాత్ర‌మే టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పేశాడు.

త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే క‌దా! ఆమెను ఎందుకు తీసుకోలేదు?
- నేను సినిమా చూస్తున్న‌ప్పుడు స‌మంతే గుర్తుకొచ్చింది. ఇక త‌మిళంలో చేసిన త్రిష‌తోనే మ‌ళ్లీ చేస్తే అందులో మేజిక్ ఏముంటుంది?. అందుక‌నే స‌మంత‌ను తీసుకున్నాను.

సంక్రాంతి సినిమాల గురించి చెప్పండి?
- ఈ సంక్రాంతి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గెలిచింది. ఎందుకంటే ఇద్ద‌రు స్టార్స్ క్రేజీ సినిమాలు ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇద్ద‌రు స్టార్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రూ హిట్ అవుతారు లేక‌పోతే యావ‌రేజ్ అవుతారు.. లేదా ఒక‌రే అవుతారు. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలు ఇద్ద‌రు హీరోల‌కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి . రెండు సినిమాల‌కు సెన్సేష‌న‌ల్ ఫిగర్స్ వ‌చ్చాయి. స‌రైన సినిమాలొస్తే ఇలా ఉంటుందా? అని మాకే మైండ్ బ్లాక్ అయ్యాయి.

ప్ర‌భాస్ సినిమాకు `జాన్` అనే టైటిల్ విన‌ప‌డుతుందిగా?
- టైటిల్ విష‌యంలో ప్ర‌భాస్‌, యువీ క్రియేషన్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. నిజానికి మా సినిమాకు జాను అనే టైటిల్ పెట్టాల‌నుకున్న‌ప్పుడు.. వంశీని సంప్ర‌దించాను. తాను కాస్త స‌మ‌యం తీసుకున్నా..`జాను` టైటిల్‌ను పెట్టుకోమ‌ని అన్నాడు. వారి సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంద‌ని వాళ్లు ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం వాళ్ల సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయినా ఇప్పుడు సినిమాకు నాలుగు వారాల లైఫే. ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత జాను సినిమా గురించి ప్రేక్ష‌కులు మ‌రిచిపోతారు. త‌ర్వాత వాళ్లు జాన్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తే ప్రేక్ష‌కులు దాన్నే ఫాలో అవుతారు. ఎందుకంటే అది ప్ర‌భాస్ సినిమా.

`పింక్‌` రీమేక్ గురించి?
- ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటే ఇప్ప‌టికి కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాది టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. `వి` సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను మ‌రో కోణంలో చూపిస్తాం.

మ‌హేష్‌తో సినిమా ఎప్పుడు?
- వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌గారితో సినిమా ఉంటుంది. మ‌హేశ్‌గారు నెక్ట్స్ సినిమా అదే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంతా ఓకే అయిన త‌ర్వాత సినిమా టేకాఫ్ అవుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved