pizza
Divyansha Kaushik interview (Telugu) about Majili
కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధం - దివ్యాంశ కౌశిక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 March 2019
Hyderabad

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌ హీరో హీరోయిన్స్‌గా శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం `మ‌జిలీ`. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా దివ్యాంశ కౌశిక్‌తో ఇంట‌ర్వ్యూ....

నేప‌థ్యం...
- మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాత పోర్ట్ ఫోలియో సిద్ధం చేసుకుని అవ‌కాశాల కోసం చూస్తున్నాను. ఆడిష‌న్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిష‌న్స్‌లో `మ‌జిలీ` సినిమాకు ఎంపిక అయ్యాను. నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. తెలుగులో `మ‌జిలీ` నా తొలి చిత్రం. ముంబైలో శిక్ష‌ణ స‌మ‌యంలో వ‌ర్క్‌షాప్స్‌లో పాల్గొన్నాను. ఫెయిర్ అండ్ ల‌వ్ లీ, పాన్‌టీన్ షాంపు, హీరో హోండా బైక్ వంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించాను.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- `మ‌జిలీ` చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైత‌న్య‌ను ప్రేమించే అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇంత కంటే నా పాత్ర గురించి ఏమీ చెప్ప‌లేను.

చైత‌న్య‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?
- చైత‌న్య‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్య‌పీ. డౌన్ టు ఎర్స్ ప‌ర్స‌న్‌. అమేజింగ్ కోస్టార్‌.

తెలుగులో న‌టించ‌డం క‌ష్టంగా అనిపించిందా?
- ఇష్ట‌ప‌డే న‌టించాను. ప్ర‌స్తుతానికి తెలుగు కాస్త‌ అర్థం చేసుకోగ‌ల‌ను. కానీ... మాట్లాడ‌లేను. త‌మిళ్‌లో న‌టించ‌డం తెలుగుతో పోల్చితే కొంచెం క‌ష్టంగా అనిపించింది. ఇక్కడ యూనిట్ బాగా స‌పోర్ట్ చేశారు.

స‌మంత‌తో క‌లిసి న‌టించారా?
- న‌టిగా స‌మంత అంటే ఇష్టం. ఆమెతో క‌లిసి న‌టించ‌లేదు.

ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ గురించి?
- డైరెక్ట‌ర్ శివగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ఆయ‌న ఇచ్చిన స్వేచ్ఛ‌తోనే బాగా న‌టించాను. డైరెక్ట‌ర్‌గా న‌న్ను గైడ్ చేయ‌డ‌మే కాకుండా నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచారు.

interview gallery



చై, సామ్‌తో కలిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?
- తెలుగులో చైత‌న్య‌, స‌మంత‌తో క‌లిసి న‌టించ‌డం ప్రీవిలేజ్‌గా ఫీల‌య్యాను. ఎందుకంటే వారు పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. నేను తెలుగులోకి ఎంట్రీ కాక‌ముందు `ఏమాయ చేసావె` సినిమా చూశాను. వారి పెయిర్‌ను బాగా ఇష్ట‌ప‌డ్డాను.

తెలుగులో మీరింకా ఏ సినిమాలు చూశారు?
- అర్జున్ రెడ్డి, నిన్నుకోరి చిత్రాలు చూశాను. `రంగ‌స్థ‌లం` చూడాలి. అలాగే `ఆర్‌.ఎక్స్ 100` సినిమా చూడాలి. స‌మంత‌గారు న‌టించిన `ఈగ` సినిమా హిందీ అనువాదం కూడా రెండు, మూడు వేల సార్లు చూశాను.

ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?
- నా పాత్ర తీరు తెన్నులు, పాత్ర గ్రాఫ్ నాకు న‌చ్చింది. అందుక‌నే న‌టించాను. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

మ‌జిలీ సినిమా ఎలా ఉండ‌బోతుంది?
- మ‌జిలీ ఫ్యామిలీ డ్రామా. ద‌ర్శ‌కుడు సినిమాను అద్భుతంగా మ‌లిచారు. చిన్న చిన్న స‌న్నివేశాల‌ను కూడా అద్భుతంగా మ‌లిచారు. ప్ర‌తిరోజూ మ‌నం ఫేస్ చేసే విష‌యాల‌ను కూడా చ‌క్క‌గా ఎలివేట్ చేశారు.

మీ పాత్ర ప‌రిధి త‌గ్గిపోతుంద‌ని ఆలోచించారా?
- లేదండి.. డైరెక్ట‌ర్ శివ‌గారు నా పాత్ర ప్రాముఖ్య‌త‌ను ముందుగానే నెరేట్ చేశారు.

మీకు న‌చ్చిన పాట‌లు?
- `ప్రియ‌త‌మా..`......... ` నా గుండెలో... ` సాంగ్స్ నాకు ఇష్ట‌మైన‌వి.

మీ ఇన్‌స్పిరేష‌న్ ఎవ‌రు?
- బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్, క‌రీనా క‌పూర్‌, అనుష్క శ‌ర్మ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. ఇక్క‌డ స‌మంత న‌ట‌నంటే ఇష్టం.

త‌దుప‌రి చిత్రాలు?
- కొన్ని చిత్రాలు డిస్క‌ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved