4 December 2018
Hyderabad
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన చిత్రం `కవచం`. డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ...
- ప్రతి సినిమాలో మన పాత్ర కొత్తగా ఉండాలనేం లేదు. ఓ సినిమాను ఒప్పుకోవడంలో చాలా కారణాలుంటాయని నా నమ్మకం. `కవచం` విషయానికి వచ్చేసరికి నా కథ నచ్చింది. మంచి సినిమాల్లో భాగం కావాలనిపించింది. యంగ్ టాలెంటెడ్ దర్శకులతో పనిచేయాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. కవచం థ్రిల్లర్. లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. ఫాస్ట్‌ఫేస్‌డ్ .. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూసే అనుభూతి వస్తుంది. తదుపరి ఏం జరుగుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత సినిమాలో ట్విస్టులు, టర్న్‌లతో సినిమాలోని సబ్ ప్లాట్స్ రివీల్ అవుతూ వస్తాయి.
- నేను మెయిన్‌గా స్క్రిప్ట్‌పైనే ఫోకస్ పెడతాను. `కవచం` కమర్షియల్ సినిమా అయినా నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. మెయిన్ లీడ్‌గా నటించాను. స్టోరీని ముందుకు నడిపించే రోల్స్‌లో నాది ఒక పాత్ర.
-నేను కొత్త పాత్రలు వచ్చినప్పుడు వాటిని అడాప్ట్ చేసుకోగలిగే సిచ్యువేషన్‌లో ఉన్నానా? అని ఆలోచిస్తాను. నా కంఫర్ట్ జోన్‌లో ఉండి బయటకు వచ్చి చాలెంజింగ్, ఎక్స్‌పెరిమెంట్స్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాను. అదే విధంగా మరోవైపు దర్శకులు కూడా నాకు కొత్త కొత్త పాత్రలను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి పాత్రలో నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. జయాజయాలనేవి మన చేతిలో ఉండదు కదా.
- 50 సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నానంటే అందుకు కారణం హార్డ్ వర్క్. ఇంతకు ముందు చెప్పినట్లు నా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాను. మనం చేసే పనిపై మనం ఎంత కమిటెడ్‌గా, ప్యాషనేట్‌గా ఉన్నామనేది కూడా మన సక్సెస్‌కు కారణమవుతుంది.
- `క్వీన్` చిత్రాన్ని హిందీలో ఐదేళ్ల క్రితం చూశాను. దక్షిణాదిన రీమేక్ చేయడానికి చర్చలు జరిగాయి. కొన్నిసార్లు నాలుగు భాషల్లో నేనే హీరోయిన్ అని.. కొన్నిసార్లు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా చేయమని .. ఇలా చర్చలు జరిగాయి. ఇప్పుడు తమిళ వెర్షన్ పారిస్ పారిస్‌లో టైటిల్ పాత్రలో నటించాను. నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్స్ చేయడమనేది చాలా గొప్ప విషయం. ఇక క్వీన్ విషయానికి వస్తే కంగనా అద్భుతంగా నటించారు. పాత్రలోని అమాయకత్వాన్ని క్యారీ చేస్తూనే సెన్సిబిలిటీస్‌ను క్యారీ చేశాను. రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.
- `ఇండియన్ 2`లో నటించనుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఆ సినిమా వివరాలను త్వరలోనే ప్రకటిస్తాను.
- 2018 నాకు కాస్త ఇబ్బందికరంగానే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో నాకు మూడు నెలలు ఆరోగ్యం సరిగ్గా లేకుంటే గ్యాప్ తీసుకుందామనే అనుకున్నాను. చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఈ ఏడాది బిజీ ఇయర్‌గా మారింది. బ్రేక్ తీసుకోవడానికి కుదరలేదు. నాకు వృత్తిపరంగా ఇది అమేజింగ్ ఇయర్ అని చెప్పొచ్చు.
- బెల్లంకొండ శ్రీనివాస్ నైస్ కోస్టార్. తనని నేను ఎన్తూ కట్‌లెట్ అని పిలిచేదాన్ని. ప్రతి విషయం పట్ల చాలా ఆసక్తిగా ఉంటాడు. చాలా హార్డ్‌వర్క్..ఏదో సాధించాలని తపన పడుతుంటాడు. నేను తనలాగానే ఉంటాను. మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. ఫ్యామిలీలో తండ్రి పేరు ఉపయోగించాలనుకోడు. తనకు తానుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు.
- 2018లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఓ దశలో నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదు.
- అరకు వ్యాలీలో ట్రైబల్ పిల్లలకు చదువు చెప్పించే ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తున్నాను. అక్కడి పిల్లల కోసం ఓ స్కూల్ కట్టించాను. దాన్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను.