11 July 2018
Hyderabad
కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'విజేత'. రజని కొర్రపాటి నిర్మాత. ఈ సినిమా జూలై 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌దేవ్ ఇంటర్వ్యూ...
ఎంజాయ్ చేస్తూ చేశాను...
- సినిమాల్లోకి రాకముందు బిజినెస్ చేసేవాడిని. ఇంజనీరింగ్ పూర్తవగానే సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‌లో ట్రై చేశాను. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక విజేత సినిమా విషయానికి వస్తే.. సత్యానంద్‌గారి వద్ద ట్రయినింగ్ పూర్తి చేసుకుని రాగానే..వారంలోపు నాకు రాకేశ్‌గారు ఈ కథను వినిపించారు. కథ అందరికీ నచ్చింది. సినిమా స్టార్టయ్యింది. అలా నా తొలి సినిమా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుండి.. ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ వస్తున్నాను. ఇండస్ట్రీలో ఎలా నిలబడాలి.. ఎదో కావాలని ఆలోచించలేదు. విజేత సినిమా విడుదల గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను.
ఆయన ఇచ్చిన సలహా ప్రకారం...
- అంచనాలుంటాయని తెలుసు. అయితే 'విజేత' నేను విన్న మొదటి కథ. బావుండటంతో సినిమా మొదలైంది. మొదటి సినిమా కదా! మరికొన్ని కథలు వింటే బావుంటుందేమో అనిపించి కూడా. అయితే 'విజేత' కథ గురించి మావయ్య చిరంజీవిగారికి చెప్పాను. లైన్ విన్న ఆయన కథ విన్నారు. ఆయనకు కూడా కథ నచ్చింది. వెంటనే సినిమా చేసేద్దామని అన్నారు. తండ్రి పాత్రలో మురళీశర్మగారిని తీసుకుంటే బావుంటుందని సలహా మాత్రమే ఇచ్చారు. మరో సలహా ఇవ్వలేదు. సినిమాల పరంగా నాకు ఎలాంటి అనుభవం లేదు. అయితే చిరంజీవిగారు చెప్పిన సలహా విని సినిమా ఒప్పుకున్నాను. ఆయనకు సినిమా రంగంలో ఉన్న అనుభవం గురించి తెలుసు. అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు నాకు మరో ఆలోచన కూడా రాలేదు. కథ నాకు బాగా నచ్చింది. ఇంజనీరింగ్ కుర్రాడు ఆకతాయిగా తిరుగుతున్నప్పుడు తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. కొడుకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి... అనేవి ఈ సినిమాలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. స్టోరీలో కొత్తదనం ఏమీ ఉండదు. కానీ ప్రెజెంటేషన్ ఫ్రెష్‌గా ఉంటుంది. మావయ్య సినిమా 'విజేత'తో పోలిక ఉండదు. మావయ్య ఈ సినిమా రషెష్ చూశారు కానీ.. పూర్తి సినిమా చూడలేదు. తొలి ఐదు రోజుల పాటు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. సెట్ కావడానికి సమయం పట్టింది. అయితే సీనియర్ నటుడు నాకు కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. అలాగే రాకేశ్‌గారు కొన్ని టిప్స్ చెప్పారు. వారంలో నాకు భయం పోయింది.
నిర్మాత గురించి...
- వారాహి చలన చిత్రం బ్యానర్ గురించి అందరికీ తెలుసు. సినిమా పరంగా సాయికొర్రపాటిగారు మేం అనుక్ను దానికంటే ఎక్కువే ఇచ్చారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
కథకు యాప్ట్ అనిపించిన తర్వాతే...
- రియలిస్టిక్‌కి దగ్గరగా ఉండే సినిమాలనే భవిష్యత్‌లో చేయాలనుకుంటున్నాను. కాబట్టి అన్ని జోనర్ సినిమాలను చేయడానికి ఇష్టపడుతున్నాను. చిరంజీవిగారి టైటిల్‌కానీ.. సాంగ్స్ కానీ ఈ జనరేషన్ హీరోలు వాడుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఈ సినిమాకు కూడా వర్కింగ్ టైటిల్‌గా వేరే టైటిల్‌ని అనుకున్నాం. 50-60 శాతం సినిమా వరకు టైటిల్ గురించి ఆలోచించలేదు. తర్వాత 'విజేత' టైటిల్ పెడితే ఎలా ఉంటుందని ఐడియా ఇచ్చారు. టైటిల్ పెడితే.. పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ అవుతుందేమో.. ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోతాయేమో అనిపించింది. చివర దశ చేరుకున్న తర్వాత.. కథకు యాప్ట్ అనిపించిన తర్వాతే టైటిల్ అనౌన్స్ చేశాం.
కథ డిమాండ్ చేస్తే..
- కథల పరంగా ఫిజికల్‌గా కష్టపడటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఓ నటుడు ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపిస్తేనే ప్రేక్షకులకు నచ్చుతాడు. ఇక 'విజేత' సినిమా ముందు నాకు మజిల్ ఉండేది. కానీ.. డైరెక్టర్‌గారు సాధారణంగా.. మజిల్ లేకుండా కనపడాలని అనడంతో నేను మజిల్ తగ్గించేశాను. స్క్రిప్ట్ పరంగానే నేను సినిమాలు చేశాను. కథే సినిమాకు ఆత్మ. కథ బావుంటే ఆఫ్ బీట్ సినిమాలైనా చేయడానికి సిద్ధమే.
చరణ్ స్క్రిప్ట్ వినలేదు..
- చరణ్‌గారు ముందు స్క్రిప్ట్ వినలేదు. అయితే మావయ్యతో తను డిస్కస్ చేశారు. సినిమా అయిపోయిన తర్వాత నాకేమైనా డౌట్స్ ఉంటే తను క్లియర్ చేశారు.
అదే సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్...
- శ్రీజ మూవీ లవర్ కాదు.. నాకు అది పెద్ద సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. అయితే నా విషయంలో తను నాకు బాగా సపోర్ట్ చేసింది. చాలా బాగా చేశావని మెచ్చుకుంది.
కథలు వింటున్నా...
- ప్రస్తుతం నేను కథలు వింటున్నాను. ఎవరైనా ఫేస్‌బుక్ ద్వారా అప్రోచ్ అయినా కూడా కథలు వింటున్నాను.