12 August 2019
Hyderabad
శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్స్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుధీర్ వర్మ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం `రణరంగం`. ఆగస్ట్ 15న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌తో ఇంటర్వ్యూ.....
అందుకే సినిమా చేయడానికి ఓకే చెప్పా...
`రణరంగం` కోసం దర్శకుడు సుధీర్ వర్మగారు నన్ను కలిసినప్పుడు అద్భుతమైన నెరేషన్ ఇచ్చారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే.. సాధారణంగా ఫ్లాష్ బ్యాక్.. ప్రెజెంట్ సమయాలను వేర్వేరుగా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో రెండు ఒకేసారి కనపడతాయి. రేపు సినిమా చూస్తే చాలా మీకే అర్థమవుతుంది. ఇది భూత, వర్తమాన కాలాల్లో జరిగే సినిమాల కాకుండా ఓ మనిషి జీవితాన్ని చూపిస్తుంది.
మీ పాత్ర గురించి?
- ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే శర్వానంద్ పాత్ర గురించి ముందుగా చెప్పాలి. సినిమా అంతా తన క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని రన్ అవుతుంది. తన పాత్ర చాలా ఇన్‌టెన్స్‌గా ఉంటుంది. అయితే తన పాత్రలో లవ్ చేసే మరో కోణం ఉంటుంది. అది నా పాత్రతోనే ఉంటుంది. నా పాత్ర లేకుంటే.. హీరోలో లవ్ అనే కోణం కనపడదు కదా!. సినిమాలో నేను విలేజ్ అమ్మాయి పాత్రలో కనపడతాను. అప్పటి తరంలో వర్క్ చేసిన హీరోయిన్స్ మా అమ్మగారైనా, శోభన మేడమ్ చేసిన పాత్రలను గమనించాను. తొలిసారి నేను లంగా ఓణీ ధరించాను.
20 ఏళ్ల ప్రయాణం...
- ఓ వ్యక్తి 20 ఏళ్ల ప్రయాణమే ఈ చిత్రం. ఓ సాధారణ యువకుడు డాన్‌గా ఎలా ఎదిగాడనేదే సినిమా. గాడ్ ఫాదర్ సినిమాలా ఉంటుందని కాదు.. ఓ డాన్ జీవతం అనేది సుధీర్ వర్మ కోణంలో ఉంటుంది. రెండు షేడ్స్‌లో చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ మార్పు చూపించడానికి సమయం పట్టింది. నేను గ్యాంగ్‌స్టర్స్ సినిమాలను బాగా ఇష్టపడతాను.
చాలా ఆసక్తిగా అనిపించింది..
- నేను 1980-90 సినిమాలను టీవీలోనే చూశాను. వాటిని చూసినప్పుడంతా నేను ఆ సమయంలో పుట్టి ఉంటే బావుండేది కదా.. అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ పాత్రను ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది.
తెలుగు నేర్చుకుంటున్నా...
- నేను మలయాళ అమ్మాయిని. చెన్నైలో పెరిగాను. నాకు మలయాళం, తమిళం వచ్చు. కానీ తెలుగులో హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నాను. నిజానికి నేను హీరోయిన్ అవుదామనుకోలేదు. కానీ హీరోయిన్‌గా టర్న్ అయ్యాను. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పగానే అమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ తొలి చిత్రం తర్వాత ఇక్కడ మనుషులు ఎంత మంచివారో, ఇండస్ట్రీ ఎంత ప్యాషనేటో అర్థం చేసుకున్నాను. అదే విషయాన్ని అమ్మతో కూడా చెప్పాను
అదెప్పుడో తెలియదు..
- నేను కచ్చితంగా డైరెక్ట్ చేస్తాను. అయితే అదెప్పుడో నాకు తెలియడం లేదు. నా మైండ్‌లో ఐడియాలున్నాయి. అవి కథలుగా మారిన తర్వాత తప్పకుండా డైరెక్ట్ చేస్తాను.
-`మరక్కార్` సినిమాలో నాన్నగారి దర్శకత్వంలో నటించడం చాలా కష్టంగా అనిపించింది. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాన్న నా గురించి ఏమీ అనలేదు. అయితే సినిమా పూర్తయిన తర్వాత ఓ దర్శకుడికి నటిగా ఏం కావాలో అలాంటి ఔట్ పుట్ ఇచ్చావ్ అని అన్నారు. ఈ సినిమాలో నటిస్తానని నేనే నాన్నను అడిగాను.