|
31 July 2019
Hyderabad
‘ఆర్.ఎక్స్.100’తో సాలిడ్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ. రెండో ప్రయత్నంగా చేసిన ‘హిప్పి’ ఆయనకు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం మీద హోప్స్ పెట్టుకున్నారు. ‘గుణ 369’ తన మనసుకు దగ్గరైన సినిమా అని అంటున్నారు. ఆగస్టు2న విడుదల కానున్న ఈ చిత్రానికి అర్జున జంధ్యాల దర్శకుడు. ప్రవీణ కడియాల సమర్పిస్తున్నారు. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు కార్తికేయ. ఆ విశేషాలు...
* గుణ369లో మీ పాత్ర గురించి చెప్పండి?
- బోయ్ నెక్స్ట్ డోర్ అని అంటుంటారు కదా. అలా కాదండీ. బోయ్ ఇనడోర్ అన్నమాట. అంటే మనింట్లో అబ్బాయిలాంటి పాత్రనే ఇందులో నేను పోషించాను. ఒంగోలులో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడిగా కనిపిస్తాను. మంచి అమ్మ, సపోర్ట్ చేసే నాన్న, ముద్దుల చెల్లెలు, గ్రానైట్ ప్యాక్టరీలో ఉద్యోగం... పూర్తయ్యీ కానీ బీటెక్... వీటన్నిటికి మధ్య, వీధి చివర ఉన్న సెల్‌ఫోన షాప్‌లో పనిచేసే గర్ల్ ఫ్రెండ్... ఇదన్నమాట నా పరిస్థితి. అలాంటి మధ్య తరగతి కుర్రాడు ఎందుకు తిరగబడ్డాడు? అతన్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టేసిన అంశాలేంటి? వంటివన్నీ ఆసక్తికరం.
* టైటిల్ జస్టిపికేషన ఏంటి?
- అంటే హీరో గుణవంతుడు. మంచి అబ్బాయి అన్నమాట. ఇందులో ఓ సందర్భంలో నేను జైలుకు వెళ్తాను. అక్కడ నా నెంబర్ 369. మామూలుగా గుణ అనే అనుకున్నాం. కానీ కమల్‌హాసనగారి చిత్రంతో పోలిక వస్తుందేమోనని ఆలోచించి, కొనసాగింపుగా 369ను పెట్టాం.
* హిప్పీ ఫెయిల్యూర్ గురించి...?
- ఆ సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అది అదే... ఇది ఇదే. అది బాగా ఆడినంత మాత్రాన ఈ సినిమా బాగోలేకపోతే దీన్ని చూడరు. ఇది బాగా ఆడనంతమాత్రాన, ఈ సినిమా బావుంటే, దీన్ని చూడకుండా మానరన్నమాట. అంతెందుకు రామ్‌గారికి, పూరిగారికి కొన్నాళ్లుగా హిట్లు లేవు. వాటి ప్రభావం ‘ఇస్మార్ట్ శంకర్’ మీద పడలేదు కదా. ఈ సినిమా చాలా బాగా ఆడింది కదా. నేను ఆ సూత్రాన్ని నమ్ముతాను.
* అంటే హిప్పీ ఫ్లాప్ అయిందని.. ఈ సినిమాకు జాగ్రత్తలు తీసుకున్నారా?
- నేను హిప్పీని కూడా జాగ్రత్తలు లేకుండా చేయలేదు. నా పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకునే చేస్తా. కానీ సినిమా అంటే హీరో ఒక్కడే కాదు. వెనుక 100 మంది ఉంటారు. వాళ్లందరి కష్టాన్ని హీరో పోట్రెయిట్ చేస్తాడు. కథ అంగీకరించి, సినిమాకు కావాల్సిన గెటప్ వేసుకుని, దానికి తగ్గట్టు షూటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, ప్రమోషన్లు చేస్తే హీరో పని పూర్తయినట్టే. అంటే టోటల్ సినిమాలో 10 శాతం పని అన్నమాట. అదే సినిమా హిట్ అయితే హీరోకు చాలా మంది పేరు వస్తుంది.
* ‘గుణ369’ నిర్మాణంలో నేను కూడా భాగమై ఉంటే బావుండేదని అన్నారు కదా?
- అవునండీ. అంటే ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. నా ‘ఆర్.ఎక్స్.100’కి ఎంత కనెక్ట్ అయ్యానో, ఈ సినిమాకు అలా కనెక్ట్ అయ్యా. అంతేగానీ, సినిమా హిట్ అయితే, ఆ డబ్బులు కూడా తీసుకుని ఆస్వాదించాలని అలా అనలేదు. నా ఎమోషనల్ బాండింగ్‌ని చెప్పడానికి అలా అన్నానంతే.
* దర్శకుడు అర్జున జంధ్యాలతో మంచి కెమిసీ్ట్ర ఉన్నట్టుంది?
- అవునండీ. అతని వేవ్‌లెంగ్త్, నా వేవ్‌లెంగ్త్ కలిశాను. ఒక సందర్భానికి అతనెలా రియాక్ట్ అవుతాడో, నేనూ అంతే రియాక్ట్ అవుతాను. మన వేవ్‌లెంగ్త్‌కి కనెక్ట్ అయిన వాళ్లతో పనిచేస్తున్నప్పుడు ఓ మజా వస్తుంది. ఈ సినిమాలో నాకు అది అనిపించింది. పైగా అతనిలో జెన్యూనిటీ బాగా నచ్చింది. సినిమాలో ఏదో కమర్షియల్ వేల్యూస్ జోడించాలని ‘కొట్టేయాలి.. స్టార్ హీరో కావాలి.. ఏలేయాలి’ అని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మంచిగా నటించాలి. 100 శాతం జెన్యూనగా చేయాలి అనే అనుకుంటా. అదే జెన్యూనిటీ అతనిలోనూ చూశాను.
* మూడు సినిమాల హీరోగా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు?
- నా ప్రతి చిత్రంతోనూ నేను ఎదగాలని భావిస్తాను. నా ఆఖరి కోరిక మాత్రం చిరంజీవిగారి స్థాయిని చేరుకోవడమే. స్కై ఈజ్ ద లిమిట్ అని అనుకుంటే, నా దృష్టిలో ఆ స్కై చిరంజీవిగారే.
* సినిమా ఇండసీ్ట్రకి వచ్చిన తక్కువ కాలంలోనే విలనగా నటిస్తున్నారు?
- వచ్చిన కొత్తల్లో కాబట్టే చేయగలుగుతున్నానేమో. అలా కాకుండా ఓ ఇమేజ్ వచ్చేసిన తర్వాత అయితే చేసేవాడినో, కాదో! పైగా ‘గ్యాంగ్‌లీడర్’లో నేను చేస్తున్నది రొటీన విలన కాదు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘బాహుబలి’లో రానా కూడా విలనగా నటించారు. అలాగని ఆయనేం విలనగా కంటిన్యూ కావడం లేదు కదా. అయినా నేను ‘గ్యాంగ్‌లీడర్’ అంగీకరించడం వల్ల నా స్పాన పెరుగుతుందని భావిస్తున్నా. ఆ సినిమాలో పెద్ద హీరో, పెద్ద దర్శకుడు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఓపెనింగ్స్ బాగా వస్తాయి. లోపలికి వచ్చినవాళ్లు తప్పకుండా నా గురించి మాట్లాడుకుంటారు. నా కెరీర్‌లో ఇలాంటి అవకాశం, ఇలాంటి పాత్ర మళ్లీ వస్తుందో రాదోగానీ, నాకు మాత్రం మంచి ఎక్స్‌పీరియన్సని ఇచ్చింది.
* కొత్త దర్శకులతో చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్డతో చేస్తున్నారు? ఎలా అనిపిస్తోంది?
- కొత్త వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటాను. నా మనసులోని మాటలను యథేచ్ఛగా చెప్పేస్తుంటా. కానీ ఎక్స్‌పీరియన్స్డ వాళ్లతోనూ ఈ విషయాలను చెబుతాను. కానీ దానికంటూ స్పెషల్‌గా చెబుతా. పైగా నేను ఏదైనా సన్నివేశంలో బాగా చేసినప్పుడు వాళ్లు మెచ్చుకుంటే, ఆ హై నాలో ఇంకో విధంగా ఉంటుంది.
* హీరోయిన గురించి చెప్పండి?
- ఈ సినిమాకు అనఘ వంద శాతం యాప్ట్. ఇమేజ్, గొప్ప గ్లామర్ ఉన్న హీరోయిన్లు ఈ సినిమాకు పనికిరారు. ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ యాప్ట్. సెకండ్ హాఫ్‌లో ఆమె నటనతో ఇరగదీసేసింది.
* ఇమేజ్ కీ రోల్ ప్లే చేస్తుందని భావిస్తారా?
- తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. కానీ నా స్థాయిలో కాదు. నా పై స్థాయి ఉన్న హీరోలకు మాత్రం అది వర్తిస్తుంది. రవితేజలాంటి హీరోలు ఆర్ట్ సినిమా చేస్తే నేనైతే చూడలేను. మరి అలాంటి ఇమేజ్ నాకు వచ్చిందని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలు నన్ను ఇంకా నన్నుగా అంగీకరిస్తున్నారో లేదో తెలియదు. ‘ఆర్.ఎక్స్.100’ హీరోగానే నన్ను గుర్తుపడుతున్నారు. సెల్ఫీలు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఆ సినిమాకు చాలా పేరు వచ్చింది. అంత పేరు వస్తుందని ముందు నేను ప్రిపేర్ కాలేదు. తీరా వచ్చాక నాకు భయమేసింది. దాంతోనే నేను ‘హిప్పి’ చేశా. ఇప్పుడు అందులోనుంచి మెల్లిగా బయటకు వస్తున్నా. అందువల్ల ఆర్.ఎక్స్.100కి ఇమేజ్ వచ్చింది కానీ, ఆ సినిమా హీరోగా నాకు కాదు.
* ఆ సినిమా పొరుగు భాషల్లోకి రీమేక్ అవుతుంటే ఎలా అనిపిస్తుంది?
- చాలా గర్వంగా ఉంటుంది. నా సినిమా అనే ఫీల్ ఉంటుంది. ఎవరైనా నా దగ్గరకు రీమేక్ కథలు తీసుకొచ్చినా, వెంటనే ఇది గుర్తుకొస్తుంది.
* ఈ ఏడాది 90ఎం.ఎల్.కూడా విడుదలవుతుందా?
- ఆ పేరు ఇంకా బయటకు చెప్పడం లేదు. అక్టోబర్‌లో రిలీజ్ ఉంటుంది. దాంతో నాలుగు రిలీజ్‌లున్నట్టు లెక్క. ఆ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. సగం పూర్తయింది. మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.
* మీ కథలు ఎవరు వింటారు?
- నేనే వింటా. హిట్టయినా, ఫ్లాప్ అయినా క్రెడిట్ నాదేనంటా. ఒకవేళ వేరే జోనర్ వింటున్నప్పుడు మాత్రం దానికి తగ్గ వయసులో ఉన్నవారికి వినిపిస్తా. ఉదాహరణకు ‘గుణ369’ కాస్త ఫ్యామిలీలకు సరిపోయే చిత్రం. అందుకే మా నాన్నను, బాబాయ్‌ను కూర్చోపెట్టి వినిపించా. వాళ్లకు పిచ్చగా నచ్చింది. నాకు హ్యాపీ.
* ఇటీవల అల్లు అరవింద్‌గారు గీతా ఆర్ట్స్‌కు మిమ్మల్ని స్వాగతించినట్టున్నారు?
- ఆ రోజు స్టేజీమీద బోయపాటిగారు-అల్లు అరవింద్‌గారు సినిమా అనౌన్స చేస్తే ‘సార్.. నాక్కూడా సార్’ అని అన్నా. వెంటనే ఆయన వెల్‌కమ్ అన్నారు. నిజంగా ఆయన వెల్‌కమ్‌చెబితే చాలా సంతోషిస్తా.
* మీకు పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు రాలేదా?
- పెద్దగా రాలేదన్నదే నిజం. చూద్దాం అయినా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కదా. నాకు నచ్చిన నటన చేసుకుంటూ ఇదే రంగంలో కొనసాగుతా.
* తర్వాత ప్రాజెక్టులేంటి?
- వినాయక్‌గారి అసిస్టెంట్ శ్రీ అనే అబ్బాయి దగ్గర ఓ స్ర్కిప్ట్ విన్నా. తను ఆ పనుల్లో ఉన్నాడు.
|
|
|
|
|