Krish (Radhakrishna Jagarlamudi) interview about Gautamiputra Satakarni
`గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా చేస్తున్నప్పుడు నాకు అదే చాలెంజింగ్‌గా అనిపించింది - జాగర్లమూడి క్రిష్
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌తో ఇంటర్వ్యూ...
అవే బెస్ట్ కాంప్లిమెంట్స్....
- సినిమాను చూసిన వారందరూ సినిమా సక్సెస్ కోసం తమ వంతుగా సపోర్ట్ చేసినందుకు థాంక్స్. ఫస్ట్ కాంప్లిమెంట్‌ను బాలకృష్ణగారు ఇచ్చారు. బాలకృష్ణగారితో ప్రీమియర్ షో చూస్తున్నప్పుడే తెలిసింది. సినిమా చివర్లో నా చేతిని నొక్కి బావుంది క్రిష్ అన్నారు. బాలకృష్ణగారు ప్రతిష్టాత్మక చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి చేసినప్పుడు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనిపించింది. అలాగే తర్వాత మా అమ్మగారు, భార్యతో కలిసి సినిమా చూసినప్పుడు ఇంటర్వెల్ సమయానికి నా భార్య ఎగ్జయిట్ అయ్యింది. చివరి క్లైమాక్స్ వచ్చినప్పుడు నా వైపు తిరిగి ఈ సినిమా కోసం కేటాయించిన ఈ సమయం చాలా విలువైందని అనడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే తనతో పెళ్ళైన తర్వాత భార్యతో ఎక్కువ సమయం గడపలేదు.
బాలకృష్ణ తప్ప మరెవరూ చేయలేరు....
- కథ రాసుకుంటున్నప్పుడే బాలకృష్ణగారు మాత్రమే హీరోగా అనుకున్నాను. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరరూ బాలకృష్ణగారు తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక కథను చేస్తున్నప్పుడు భయం కలగలేదు. బాధ్యతగా ఫీలైయ్యాను.ఈ సినిమాలో అప్పట్లో ఏం జరిగిందో అని చూపించడం కంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే క్యారెక్టర్‌ను ఎంత బాగా ఆడియెన్స్‌ను చూపించామనేదే చాలెంజింగ్‌గా అనిపించింది.
చాలా తక్కువ తెలుసు....
- సినిమా కథ రాసుకునేటప్పుడు ఐదు పుస్తకాలు చదివితే శాతకర్ణి గురించి పది డిఫరెంట్ వెర్షన్స్ తెలిసింది. అంటే మనకు తెలిసింది చాలా తక్కువ. ఈ మేటర్స్‌ను తీసుకుని, రాజసూయ యాగం చేశాడు. తల్లి పేరుని ముందు పెట్టుకున్నాడు. అనే విషయాలు తీసుకుని నాకున్న చారిత్రక ఆధారంగా తీసుకుని సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేశాను.
పక్కా ప్రణాళితోనే సాధ్యమైంది....
- సినిమాను నాలుగు భాగాలుగా విడగొట్టాం. మొరాకోలో జరిగేదంతా ఒక సెటప్ అయితే, అమరావతిలో జరిగేది ఒక సెటప్. కళ్యాణదుర్గం, సౌరాష్ట్రలో జరిగేది ఒక సెటప్. గ్రీకులతో జరిగే యుద్ధం ఒక సెటప్ ఇలా నాలుగు భాగాలను క్రోడికరించి సినిమా చేయాలనుకున్నాం. మళ్ళీ వీటిలో ప్రతి భాగాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాం. అందులో రాజసూయ యాగం, 32 కత్తులను తీసుకుని రావడం ఇలా చిన్న చిన్న పార్టులుగా విడగొట్టాం. దుస్తులు ఎలా ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. మొరాకోలో షెడ్యూల్ పూర్తి కాకముందే చిలుకూరి వద్ద ఓడ సెట్ వేశాం. నేను ఇక్కడకు రాగానే మూడు రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఓడ ఫైట్ జరుగుతున్నప్పుడే ఓ యూనిట్ జార్జియా వెళ్లింది. మరో యూనిట్ మహేశ్వరం వెళ్లింది. అందుకే నా టీం అంతటినీ మూడు యూనిట్స్‌గా విడగొట్టాను. షూటింగ్ అయినప్పటి నుండి ఎడిటింగ్ కూడా చేయించుకుంటూ వచ్చాను. నా దగ్గరున్న రిసోర్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నాను. ఈ ప్లానింగ్ వల్లే సినిమాను 79 రోజుల్లో పూర్తి చేశాం. సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి ముందే చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగింది.
పంచభూతాల సహకారం అనుకోవచ్చు...
- ఈ సినిమా ఇంత త్వరగా ప్రేక్షకులు ముందుకు రావడానికి పంచభూతాలు కూడా సపోర్ట్ చేశాయని బాలకృష్ణగారు ఓ సందర్భంలో అన్నార. అది వంద శాతం నిజం. ఎందుకంటే దైవ కృప లేకుంటే మేం అనుకున్నది అనుకున్నట్లు పూర్తయ్యేది కాదు. సినిమాకు ముందు రైతు అనౌన్స్‌మెంట్ జరగబోతుందని తెలిసింది. అయితే బాలకృష్ణగారితో ఈ కథను సినిమాగా చేయాలని అప్పటి నుండి అనుకున్నాను. మా నాన్నగారు ఈ కథను చెప్పడానికి బాలకృష్ణగారితో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ సయమంలో నేను కొమ్మినేని వెంకటేశ్వరరావుగారితో మాట్లాడటం జరిగింది. ఆయనకు టైటిల్ చెప్పగానే ఆయన నువ్వు ఫోన్ పెట్టెయ్, నేను కాల్ చేస్తానని అన్నారు. అన్నట్లుగానే పన్నెండు గంటల వ్యవధిలోనే బాలకృష్ణగారి నుండి అపాయింట్‌మెంట్ వచ్చింది. అంతా అలా జరిగింది
దేవి బిజీగా ఉన్నాడు....
- ఈ సినిమా షూటింగ్ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తన వర్క్‌తో బిజీగా ఉన్నారు. నాతో పాటు ఉండే ఓ మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకున్నాను. నాకేమో కొత్తగా పెళ్ళైంది. నేను చెన్నైకు వస్తూ పోతూ ఉండలేను. అందుకే చిరంతన్‌కు ఫోన్ చేశాను. తను బాలీవుడ్‌లో జాలీ ఎల్.ఎల్.బి సినిమా చేస్తున్నా నా కోసం ఒప్పుకున్నాను.
తదుపరి చిత్రం....
- తదుపరి చిత్రంగా వెంకటేష్‌గారి 75వ సినిమా చేస్తున్నాను. వెంకటేష్ మూవీ తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నాను.