pizza
Mahesh Babu interview (Telugu) about Maharshi
`మ‌హ‌ర్షి` ఇంపాక్ట్ స‌మాజంపై చాలా ఉంటుంది - మ‌హేష్ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

4 May 2019
Hyderabad

మ‌హేష్‌, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌, మీనాక్షి దీక్షిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `మ‌హ‌ర్షి`. ఈ సినిమా మే 9న విడుద‌ల కానుంది. టాలీవుడ్‌లోని మూడు ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమా గురించి మ‌హేష్ శ‌నివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఇందులో మూడు గెట‌ప్పులు వేశారు. వ్య‌క్తిగ‌తంగా మీకు బాగా న‌చ్చింది?
- నాకు కాలేజ్ ఎపిసోడ్ ఇష్ట‌మండీ. క‌థ విన్న‌ప్పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యా. వంశీతోనూ కాలేజ్ ఎపిసోడ్ బాగా రావాల‌ని చెప్పా. ఎందుకంటే నా కెరీర్‌లో 25 సినిమాలు అయ్యాయి. రెండు ద‌శాబ్దాల‌య్యాయి. ఈ స‌మ‌యంలో కాలేజ్ అంటే.. అదేదో ఐదు నిమిషాలు వ‌చ్చి వెళ్లేది కాదు. పూర్తిగా 45 నిమిషాల పాటు సాగే బ్లాక్ అన్న‌మాట‌. దాన్ని క‌న్విన్సింగ్‌గా చెప్ప‌గ‌లిగామంటే, మేం సాధించిన‌ట్టే. నిజంగా ఇవాళ సినిమా చూస్తున్న‌ప్పుడు సాధించామ‌నే ఫీలింగ్ క‌లిగింది. గ‌ర్వంగానూ ఉంది.

* యువ‌రాజు టైప్‌లో ఉంటుందా?
- మీరు చూడండి. కానీ క‌చ్చితంగా చాలా బావుంటుంది.

* ఈ క‌థ విన‌గానే క‌చ్చితంగా చేయాలి అని అనిపించిన పాయింట్ ఏంటి?
- అదేనండీ. నేను ఫంక్ష‌న్‌లోనూ చెప్పా. ఓ 20 నిమిషాలు విని వంశీని పంపించేద్దామ‌ని అనుకున్నా. కానీ అత‌ను చెప్పిన క‌థ వింటే నాకు చాలా బాగా న‌చ్చింది. వెంట‌నే అత‌నితో `నేను ఇంకా రెండు సినిమాలు చేయాలి. ఆ త‌ర్వాతే దీన్ని చేయాల్సి ఉంటుంది` అని చెప్పా. అందుకు అత‌ను వెంట‌నే `ఏం ఫ‌ర్వాలేదు సార్‌. ఇంకా రాసుకుంటాను. ఎందుకంటే మీరు త‌ప్ప మ‌హ‌ర్షి ఇంకెవ‌రూ చేయ‌లేరు. మీరే క‌నిపిస్తున్నారు నాకు` అని చెప్పాడు. ఆ మాట‌ల‌న్నందుకు అత‌నికి కృత‌జ్ఞ‌త‌లు.

* ఇది 25వ సినిమాగా అనుకోకుండా వ‌చ్చిందా?
- అనుకోకుండానే వ‌చ్చిందండీ. మేమేం ప్లానింగ్ చేసుకోలేదు. కంటెంట్ రిచ్ సినిమా ఇది. జెన్యుయ‌న్ సినిమా ఇది. అన్ని యాంగిల్స్ క‌వ‌ర్ చేశాం. అన్ని ఎమోష‌న్స్ వ‌చ్చి, క్లాస్‌గానీ, మాస్‌గానీ అంద‌రికీ న‌చ్చేలా ఉంటూనే, హీరో ఫ్యాన్స్ ని కూడా మెప్పించేలా కుదిరింది. అన్ని యాంగిల్స్ క‌వ‌ర్ చేశాడు వంశీ. హ్యాట్సాఫ్ టు హిమ్ అండ్ హిస్ టీమ్‌.

* ఈ మ‌ధ్య సోష‌ల్ కాజ్ ఉన్న సినిమాల మీద ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. `శ్రీమంతుడు`,`భ‌ర‌త్ అనే నేను`, ఇప్పుడు `మ‌హ‌ర్షి`గానీ... స్పెష‌ల్ ఇంట్రెస్ట్ ఏమైనా?
- అలాంటిదేమీ లేదండీ. అవ‌న్నీ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీస్‌, ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్‌లున్న సినిమాలు. వాటిలో నేను భాగం కావ‌డం ఆనందంగా ఉంది. అలాగే `మ‌హ‌ర్షి` కూడా చాలా మంచి సినిమా. ప‌వ‌ర్‌ఫుల్‌మెసేజ్ ఉన్న సినిమా.

`శ్రీమంతుడు`లో విలేజ్ అడాప్ష‌న్ అనేది మంచి పాయింట్‌. ఇందులోనూ అలాంటివి ఏమైనా ఉంటాయా?
- ఉందండీ. ఇందులో గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవ‌డం కాదు కానీ, ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఇప్పుడే చెప్పేస్తే ప్రేక్ష‌కుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది. అందుకే మే 9న ప్రేక్ష‌కులు థియేట‌ర్లో చూసి తెలుసుకుంటారు.

రైతుల స‌మ‌స్య‌ల గురించి ఎక్కువ ఫోక‌స్ చేశార‌ని..
- అదేనండీ. మీరు చూడండి. సినిమాలో చూడండి.

త‌ల‌కు గుడ్డ‌క‌ట్టి, ప్యాంట్‌ను పైకి లాగి న‌టించ‌డం ప‌ట్ల‌..?
- వంశీ క‌థ చెప్పేట‌ప్పుడే లుక్స్ గురించి వివ‌రంగా చెప్పాడు. స్టూడెంట్ లుక్‌, బిజినెస్‌మేన్ లుక్‌, ఫార్మ‌ర్ లుక్‌... అన్నిటి గురించీ చెప్పాడు.

ఇంత‌కు ముందు అంద‌రూ `ఒకే లుక్‌లో చేస్తున్నావు` అని అనేవారు. మ‌రి దీనిలో మూడు లుక్స్ ఉంటాయి. అవ‌న్నీనూ కేర‌క్ట‌ర్ ప‌రంగా ఉంటాయి. నా దృష్టిలో ఎవ‌రు ఏం చేసినా... హెయిర్ స్టైల్ మార్చ‌డం, గ‌డ్డం పెంచ‌డం మిన‌హా మ‌రేమీ ఉండ‌దు. ఎప్పుడైనా కేర‌క్ట‌రైజేష‌న్‌కు త‌గ్గ‌ట్టే లుక్స్ చూసుకోవాలి.

* స‌క్సెస్ డ్రైవ‌న్ కేర‌క్ట‌ర్ అనేది.. బేసిగ్గా మీక్కూడా సూట్ అవుతుందా? మీరు కూడా స‌క్సెస్ కోసం ఎక్కువ ప్ర‌య‌త్నిస్తుంటారు?
- అలా కాదండీ. `మ‌హ‌ర్షి` నాకే కాదు. మ‌నంద‌రికీ ఎక్క‌డో రిలేజ్ అవుతుంది. ఈ ఎమోష‌న‌ల్ స్క్రిప్ట్ బ్యూటీ అదే. జ‌న‌ర‌ల్‌గా ఆడియ‌న్స్ అంద‌రూ `అరే మ‌న‌కు జీవితంలో ఇది జ‌రిగిందే` అని అనుకుంటారు. ఎక్క‌డో ఒక చోట కనెక్ట్ అవుతారు.

* నిర్మాత‌లు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాల‌నుకుంటారు. కానీ మీరు మ‌ల్టీ నిర్మాత‌ల సినిమా చేశారు?
- ఫ‌స్ట‌ఫాల్ నేను వాళ్ల‌కు థాంక్ చెప్పాలి. ఎందుకంటే `మ‌హ‌ర్షి` అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ముగ్గురు నిర్మాత‌లు చాలా స‌పోర్ట్ చేశారు. మూడు ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ల‌లో చేయ‌డం ఆనందంగా ఉంది.

* సీత‌మ్మ వాకిట్లో, బిజినెస్ మేన్ స‌మ‌యంలో క‌నీసం ఏడాదికి రెండు సినిమాలైనా వ‌చ్చేవి. ఇప్పుడు మ‌రీ ఒక్క సినిమానే అవుతోంది?
- నేను నెల మాత్ర‌మే గ్యాప్ తీసుకున్నా. మిగిలిన స‌మ‌యం మొత్తం ప‌నిచేస్తూనే ఉన్నా. ఇప్ప‌ట్లో సినిమా అంటే ట‌ఫ్ టాస్క్ అండీ. నాన్న‌గారు వాళ్లంద‌రూ 350-400 సినిమాలు చేశారు. ఇప్పుడు 25వ సినిమాకే ల్యాండ్ మార్క్ అని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. అందువ‌ల్ల సినిమాల‌కు టైమ్ ప‌డుతోంది. పెద్ద సినిమాలు చేయాలంటే ఎనిమ‌ది నుంచి ప‌ది నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. పైగా అది మ‌న చేతుల్లోనూ ఉండ‌టం లేదు. ప‌ర్ఫెక్ట్ ప్రాడెక్ట్ ఇవ్వాలంటే త‌ప్ప‌డం లేదు.

interview gallery



*ఇంత టెక్నాల‌జీ పెరిగి కూడా అంత టైమ్ ఎందుకు ప‌డుతోందండీ?
- టెక్నాల‌జీ పెర‌గ‌బ‌ట్టే టైమ్ తీసుకుంటోంది.

* మార్కెట్‌ని కూడా చూసుకుంటున్నారా?
- అలాగ‌ని కాదండీ. ఒక పెద్ద సినిమాకు షూట్ చేయ‌డమంటే మ‌రింత కేర్ తీసుకున్న‌ప్పుడు 8-9 నెల‌లు ప‌డుతుంది. 5-6 నెల‌ల్లో ఒక పెద్ద సినిమా వ‌స్తే అది అన్‌బిలీవ‌బుల్‌.

* మీ ప్ర‌తి సినిమాలోనూ ఏదో ఒక చాలెంజ్ ఉంటుంది. ఈ సినిమాలో ఏముంది?
- కాలేజీ స‌న్నివేశాలండీ. డెహ్రాడూన్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్‌కి వెళ్లిన‌ప్పుడు నేను వంశీతో చెప్పా. `ఇది మ‌నం కన్విక్ష‌న‌ల్‌గా చెప్ప‌గ‌లిగితే మ‌నం అచీవ్ చేసిన‌ట్టే` అని చెప్పా. అదే జ‌రిగింది. మేం ఆనందంగా ఉన్నాం.

* మీరు అదే ఈజీగా చేసి ఉంటార‌ని మేం అనుకున్నాం.
- ఒక ట్రావెల్ అయిన త‌ర్వాత, 20 ఏళ్ల కెరీర్ అయిపోయాక ఇప్పుడు మ‌ళ్లీ `నువ్వు కాలేజీ కుర్రాడివి` అని అంటే, దాన్ని అంగీక‌రించ‌డానికి నాకే స‌మ‌యం ప‌డుతుంది. కానీ వంశీ న‌మ్మాడు. స్క్రిప్ట్ లోనూ ఉంది. సినిమాకు క్రూషియ‌ల్ ఎపిసోడ్ అది.

* ట్రైల‌ర్‌లో కాలేజీ సీన్లు చూడ‌గానే `త్రీ ఇడియ‌ట్స్` సీన్స్ గుర్తుకొచ్చాయి?
- లేదండీ. త్రీ ఇడియ‌ట్స్ సినిమాతో సంబంధం అస్స‌లు లేదు.

* వంశీ డైర‌క్ష‌న్ ఎలా అనిపించింది?
- త‌న‌కి క్లారిటీ ఉందండీ. అస‌లు క‌థ‌ను ఎలా చెప్పాడో, అలాగే తీశాడు. పెర్పార్మెన్స్ లు తీసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి.... ప్ర‌తిదీ అత‌నికి ఏం క్లారిటీ ఉందో, దాన్నే చేశాడు. త‌న మ‌న‌సులో ఉన్న విష‌యాల‌ను న‌టీన‌టుల‌కు కూడా చాలా బాగా చెప్ప‌గ‌లిగేవాడు. సినిమా విడుద‌ల‌య్యాక కూడా ఫ‌స్ట్ పేరు వ‌చ్చేది వంశీకే. ఆయ‌న టీమ్‌లో హ‌రి, సాల‌మ‌న్ అంద‌రూ ఎక్స్ ట్రార్డిన‌రీ ప‌ర్స‌న్స్.

* డైలాగులు కూడా పాయింట్ అవుట్ చేసిన‌వి కొన్ని ఉన్నాయి..
- వాళ్లు క‌థ మీద రెండేళ్లు ప‌నిచేశారండీ. స్క్రిప్ట్ మీద ఎంత టైమ్ ప‌నిచేస్తే అంత గ్రేట్ అంటాం క‌దా. ఈ స్క్రిప్ట్ అలా బాగా కుదిరింది.

* ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంద‌రు ద‌ర్శ‌కుల పేర్ల‌ను మ‌ర్చిపోయిన‌ట్టున్నారు.
- ఆ రోజు ఏమైందంటే, నేను ఫారిన్ నుంచి వ‌చ్చాను. యూర‌ప్ నుంచి 16 గంట‌ల విమాన ప్ర‌యాణం చేసి వ‌చ్చా. అప్ప‌టికీ మాట్లాడుతున్నా. కానీ స్టేజీ మీద‌కు కొంద‌రు ఫ్యాన్స్ వ‌చ్చారు. అంద‌రి పేర్లు చెప్ప‌క‌పోవ‌డం నా మిస్టేకే. `పోకిరి` న‌న్ను సూప‌ర్ స్టార్‌ని చేసింది. `1` నా లైఫ్‌లో క‌ల్ట్ సినిమా. అందుకు సుకుమార్‌కు థాంక్స్ చెప్పాలి. ఆయ‌న నా కుమారుడితోనూ ప‌నిచేశారు. ఆయ‌న నాకు చాలా ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు. ఇంకో విష‌యం చెప్పాలంటే అదే స్టేజ్ మీద `వంశీ రెండేళ్లు నాకోసం వెయిట్ చేశాడు. ఈ రోజుల్లో రెండు నెల‌లు ఎవ‌రూ వెయిట్ చేయ‌డం లేదు` అని. ఆ మాట‌ను నేను వంశీని పొగిడే అన్నాను త‌ప్ప‌, సుకుమార్‌గారిని పాయింట్ అవుట్ చేసి అన్న‌ది కాదు. కొంత మంది న్యూస్‌లు రాశారు. అందులో నిజం లేదు. నిజానికి సుకుమార్ నాకు మంచి ఫ్రెండ్‌. ఆయ‌న‌తో భ‌విష్య‌త్తులోనూ క‌లిసి ప‌నిచేస్తాను. ఇలాంటి వార్త‌ల‌న్నీ అన‌వ‌స‌ర‌మైన గంద‌ర‌గోళాన్ని సృష్టించిన‌వి.

* అంటే ఈ జ‌ర్నీలో స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌ని ప‌క్క‌న‌పెట్టినా...
- స‌క్సెస్‌, ఫెయిల్యూర్ అని కాదు, నేను ప్ర‌స్తావించిన ప్ర‌తి సినిమాకూ నా కెరీర్ గ్రాఫ్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. `మురారి` అనే సినిమా `మ‌హేష్ యాక్ట్ చేయ‌గ‌ల‌డు` అని చెప్పిన సినిమా. త‌ర్వాత `ఒక్క‌డు` నన్ను స్టార్ చేసింది. `అత‌డు` నాకు యు.ఎస్‌. మార్కెట్‌ను ఓపెన్ చేసింది. `పోకిరి`తో ఇత‌ను సూప‌ర్ స్టార్ అని అన్నారు. అందువ‌ల్ల ఇవ‌న్నీ నా జ‌ర్నీలో ఇవ‌న్నీ ఇంపార్టెంట్ సినిమాలు. అంతేగానీ హిట్ అయిన సినిమాల‌నే చెప్పాల‌నేం కాదు.

* అంటే మిగిలిన వాళ్ల‌ను చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్ల కావాల‌నే చేశార‌ని..
- ఇప్పుడు నేను చెప్పానుగా. క్లారిటీ ఇచ్చానుగా. ఇంకా ఎంత క్లారిటీ కావాలో చెప్పండి.

* కంట్రీసైడ్ డెవ‌ల‌ప్‌మెంట్ గురించి చెప్పారా?
- అది కాదండీ. మేం చాలా స్ట్రాంగ్ పాయింట్‌ని ట‌చ్ చేశాం.

* ఈ సినిమాకు క్లైమాక్స్ హైలైట్ అవుతుందని రాజుగార‌న్నారు. మీ ఫీలింగ్ ఏంటి?
- క‌థ విన్న‌ప్పుడే నాకు ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. డ‌బ్బింగ్ చెబుతున్నప్పుడు నాకే క‌ళ్లెమ్మ‌ట నీళ్లు తిరిగాయి.

* అల్ల‌రి న‌రేష్‌గారి పాత్ర ఏంటి?

- అది మీరు చూడండి. న‌న్న‌డుగుతారేంటి? నేను ఒక‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను. నాకు వంశీ క‌థ చెప్పేట‌ప్పుడే `అల్ల‌రి` న‌రేష్ అనే పేరు చెప్పే చెప్పాడు. `చాలా బావుంటుందండీ. ఒక‌సారి ఆయ‌న్ని క‌నుక్కోండి.. చేస్తారో, లేదో ` అని అన్నా. న‌రేష్ విన‌గానే ఓకే చెప్పాడు. చేశాడు.

* ఇందులో నాయిక పాత్ర ఎలా ఉంటుంది?
- చాలా కొత్త‌గా ఉంటుంది. సినిమాలో నాతో ట్రావెల్ అవుతుందా? లేదా? అనేది మాత్రం నేను చెప్ప‌లేను.

* మీ కెరీర్‌లో మోస్ట్ మెమ‌ర‌బుల్ ఇన్సిడెంట్ ఏంటి?
- నాన్న‌గారితో మార్నింగ్ షో చూసిన‌ప్పుడు ఒక‌టి ఉంది. సుద‌ర్శ‌న్ లో `మురారి` అయిపోయాక నా భుజం మీద ఆయ‌న చెయ్యి పెట్టాడు. ఇంకేమీ చెప్ప‌లేదు. అది చాలా ట‌చింగ్‌గా అనిపించింది.

* విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నాన్న‌గారు చాలా సినిమాలు చేశారు.. ఈ సినిమాలో మీరూ చేశారు?
- మే 9న నాన్న‌గారు సినిమా చూసి ఏమంటారో వినాల‌ని ఉంది. ఆయ‌న ట్రైల‌ర్ చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. నా వ‌ర‌కు మే 9 అనేది చాలా మ్యాజిక‌ల్ డేట్. మా ఫ్యాన్స్ ఇక‌పై `మేలోనే రిలీజ్ చేయండి` అని అంటారు.

* మీకు ఫార్మింగ్ ఐడియా ఉందా?
- కాస్త ఉంది. కానీ ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా నేర్చుకున్నా. ఎందుకంటే క‌థ చేస్తున్న‌ప్పుడు కేర‌క్ట‌ర్‌తో స‌హా ట్రావెల్ అవుతాం క‌దా. అలా నేర్చుకున్నా.

* రిషి... మ‌హ‌ర్షిగా ఎందుకు మారాల్సి వ‌చ్చింది?
- 9న చూడండి. ఇందాకే అన్నానుగా.

* ఈ సినిమాలో మ‌రీ యంగ్‌గా క‌నిపిస్తున్నారు?
- కాలేజ్ లుక్ కోసం మ‌రింత కేర్ తీసుకున్నా. అందువ‌ల్ల అలా క‌నిపిస్తోంది. పైగా మోహ‌న‌న్‌గారు న‌న్ను చాలా అందంగా చూపించారు.

* హీరోలు రిలీజ్ ముందు టెన్ష‌న్‌గా ఉంటారు. రిలీజ్ త‌ర్వాత ట్రిప్పులు వేస్తుంటారు. మీరేమో సినిమా ముందు వెకేష‌న్‌కి వెళ్లొచ్చారు?
- నాకు నా టీమ్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందండీ. వాళ్లు చాలా కేర్ తీసుకున్నారు. వాళ్ల ప‌ని వాళ్లు చేస్తున్నారు. నేను కూడా 8 నెల‌లు నాన్‌స్టాప్‌గా ప‌నిచేశా. అందుకే ఎందుకు టెన్ష‌న్ అని వెళ్లా. వెళ్లానేగానీ, మ‌న‌సంతా ఇక్క‌డే ఉంది. అందుకే గంట‌కొక‌సారి డైర‌క్ట‌ర్‌కి ఫోన్ చేసి మాట్లాడేవాడిని.

* సుకుమార్‌గారి క‌థ విష‌యంలో అస‌లు ఏం జ‌రిగింది?
- మేం సినిమా అనుకున్నాం కానీ, ఆ స‌మ‌యంలో నాకు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ క‌రెక్ట్ అనిపించింది. అన్నీ సోష‌ల్ మెసేజ్ సినిమాలే అవుతున్నాయి. ఇవ‌న్నీ ఇంటెన్స్ ప్రాజెక్టులు అవుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో `దూకుడు` లాంటి స్క్రిప్ట్ కావాల‌నిపించింది. ఎందుకంటే నా కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి నేనూ ఒక‌టి చేయాలిగా. ఆ విష‌యాన్నే సుకుమార్‌గారితో చెప్పాను. ఆయన ఒక సినిమా చేసుకుని వ‌స్తాన‌న్నారు. నేనూ ఈ సినిమా చేసుకుని వ‌స్తాన‌ని చెప్పా.

* విజ‌య‌శాంతిగారు ఆ సినిమాలో చేస్తున్నారా?
- ఇప్పుడు ఆ సినిమా టాపిక్ ఎందుకండీ?

* క‌థ‌ల విష‌యంలో చాలా ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉంటున్న‌ట్టున్నారు?
- ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉండ‌టం కాదండీ. నా ద‌గ్గ‌ర బౌండ్ స్క్రిప్ట్ ఉంటే నేను గో ఎహెడ్ అంతే. ఎందుకంటే గ‌తంలో 20 నిమిషాలు క‌థ విని ఎగ్జ‌యిట్ అయిపోయి దిగ‌డం క‌న్నా, మూడు గంట‌ల నెరేష‌న్ విన్న త‌ర్వాత నాకు న‌చ్చితే నేను షూటింగ్‌కి వెళ్తా. ఎందుకంటే ఇవాళ్రేపు అదే క‌రెక్ట్ కూడా.

* అనిల్ రావిపూడిగారి త‌ర్వాత సుకుమార్‌గారితో ఉంటుందా?
- అవునండీ. ఉంటుంది.

* బౌండ్ స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వ‌చ్చిందండీ?
- రావాలండీ. ఎవ‌రైనా బౌండ్ స్క్రిప్ట్ తోనే చేయాలి. అదే రూల్‌. ఏదో పాయింట్ అనుకుని, ఆ త‌ర్వాత కొంచెం షూటింగ్ చేసి. ఆపి, ఆ త‌ర్వాత ఓ షెడ్యూల్ చేసి.. అది క‌రెక్ట్ కాదు. దిగామంటే ఇక షూటింగే. స్క్రిప్ట్ చేతిలో ఉండ‌టం చాలా మంచిది.

* `స్పైడ‌ర్‌` వ‌ల్ల మీరు నేర్చుకున్న పాఠ‌మా ఇది?
- `స్పైడ‌ర్‌` అని కాదండీ. నా ప్ర‌తి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న‌ది. ఎందుకంటే నేను చాలా ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్నాను. గ‌తంలో నా మిస్టేక్స్ వ‌ల్ల నేను ఎగ్జ‌యిట్ అయ్యా. `స్పైడ‌ర్‌`, `బ్ర‌హ్మోత్స‌వం` వంటివ‌న్నీ 20 నిమిషాల నెరేష‌న్ విన్న‌ప్పుడు చాలా బాగా అనిపించాయి. కానీ షూటింగ్‌లో దిగిన‌ప్పుడే నాకు తెలిసిపోయింది. అప్పుడే నాలో భ‌యం నాకు చెప్పేసింది.

* కొత్త ద‌ర్శ‌కులు చాలా మంది వ‌స్తున్నారు.. సందీప్ వంగాతో సినిమా చేస్తార‌ని..
- నేనింకా క‌థ‌లు విన‌లేదండీ. చాలా మంది కొత్త‌వాళ్లు వ‌స్తున్న మాట నిజ‌మే. కానీ నాకు అలాంటి వాళ్లు ఇంకా తార‌స‌ప‌డ‌లేదు. నేను ఎంక‌రేజ్ చేయ‌డం లేద‌నేది త‌ప్పు మాట‌.

* త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి, రాజ‌మౌళిగారితో మీ సినిమాలున్నాయా?
- రాజ‌మౌళిగారు, నేను క‌లిసి ప‌నిచేద్దామ‌నుకున్నాం. కె.ఎల్‌.నారాయ‌ణ‌గారు నిర్మాత‌. ఆయ‌న క‌మిట్‌మెంట్స్, నా క‌మిట్ మెంట్స్ అయ్యాక క‌లిసి చేస్తాం. త్రివిక్ర‌మ్ గారితోనూ స్క్రిప్ట్ డిస్క‌స్ చేశాం. పాజిటివ్‌గా ఉంది.

* చాలా మంది మిమ్మ‌ల్ని హిస్టారిక‌ల్ పాత్ర‌ల్లో చూడాల‌ని అనుకుంటున్నారు..
- నాకు భ‌య‌మండి అలాంటి పాత్ర‌లంటే. ఒక‌వేళ రాజ‌మౌళిగారిలాంటి ద‌ర్శ‌కులు క‌నుక ముందుకొస్తే, నేను క‌న్విన్స్ అవుతానేమో.

* మిమ్మ‌ల్ని బాండ్‌గా చూడాల‌ని హాలీవుడ్ వ్య‌క్తి ట్వీట్ చేశారు..
- ఆయ‌న‌కు అంత ప‌నిలేదేమో. ప‌ని ఉంటే, హాలీవుడ్ వాళ్లు మ‌న గురించి ఎందుకు రాస్తారు.

* డైలాగులు బావున్నాయి. ఏమ‌నిపిస్తోంది?
- నాకు తెలుగు చ‌ద‌వ‌డం రాదు. ద‌ర్శ‌కులు వ‌చ్చి నాకు డైలాగులు చెబితే, నేను వాటిని కంఠ‌తా ప‌డ‌తాను. అలాంట‌ప్పుడు మంచి డైలాగులు వింటే చాలా బావుంటుంది.

* సినిమాల‌తో ఎమోష‌న‌ల్‌గా అటాచ్ అవుతాన‌ని అన్నారు.
- చిన్న‌ప్ప‌టి నుంచీ అంతేనండీ. సినిమాలుంటే నా లోకం అదే. ఇప్పుడు సినిమా షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్లి పిల్ల‌లు, భార్య‌తో ఉంటాను. నేను జీవితాన్ని అలాగే డిజైన్ చేసుకున్నాను. వ‌ర్క్ ప‌ట్ల నా అప్రోచ్ అలాగే ఉంటుంది.

* బాలీవుడ్‌లో ప్రొడ‌క్ష‌న్‌లో వెంచ‌ర్ అవుతున్నార‌ట క‌దా?
- బాలీవుడ్‌లో అని కాదు. కానీ మంచి టాలెంట్‌ని ఎంక‌రేజ్ చేయాల‌న్న ఉద్దేశంతో చేస్తున్నాం. అడివి శేష్ సినిమా చేస్తున్నాం. సోనీ పిక్చ‌ర్స్ తో క‌లిసి చేయ‌డం ఆనందంగా ఉంది.

* నిర్మాణం కంటిన్యూ అవుతుందా?
- త‌ప్ప‌కుండా ఉంటుంది. నాకు న‌చ్చి, నేను చేయ‌లేని ప్రాజెక్ట్ ల‌ను నేను నిర్మించాల‌నుకుంటా. క‌థ‌లు, డైర‌క్ట‌ర్లు కుదిరితే బాలీవుడ్‌లోనూ పెద్ద హీరోల‌తో చేయ‌వ‌చ్చు. ఇప్పుడే ఏదీ చెప్ప‌లేం.

* మీ ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది?
- అది ఆరేళ్ల క‌ల అండీ. 1 నేనొక్క‌డినే సినిమా చేస్తున్న‌ప్పుడు ఏషియ‌న్ ఫిల్మ్స్ సునీల్‌గారి నాన్న‌, నారంగ్‌గారితో మాట్లాడా. ఓ మ‌ల్టీప్లెక్స్ అనుకున్నాం. కానీ నా క‌ల ఏంటంటే చేస్తే ఇండియాలోనే బెస్ట్ గా ఉండాలి, సౌండ్‌లోగానీ, క్వాలిటీలోగానీ, ఎందులోనైనా అలాగే ఉండాలి అనేది. ఫైవ్ స్టార్ హోట‌ల్‌లా ఉండాల‌నుకున్నా. ఇప్పుడు ఏఎంబీ సినిమాను చూస్తే అలాగే ఉంది.

* అందులో మీ ఇన్‌పుట్స్ గానీ, మీ శ్రీమ‌త‌గారి ఇన్‌పుట్స్ గానీ..
- ఏమీ లేవండీ. కాక‌పోతే వాళ్ల‌ను క‌లిసిన‌ప్పుడ‌ల్లా `బెస్ట్ గా ఉండాలి` అని మాత్రం చెబుతూనే ఉన్నా. ఫైన‌ల్‌గా `చూడు బాబూ ఎలా ఉందో` అని చూపించారు. ఫైన‌ల్‌గా నేను హ్యాపీ.

* జ‌గ‌న్‌గారు కూడా ఎవెంజ‌ర్స్ చూశారు?
- అదేనండీ. సెల‌బ్రిటీలు చాలా మంది చూస్తున్నారు.

* మీ థియేట‌ర్లో మీరు చూశారా?
- నేను చూద్దామ‌ని అడిగానండీ. ఏడు గంట‌ల షోకు టిక్కెట్లు లేవ‌న్నారు. రెండు రోజుల్లో మూడుగంట‌ల‌ప్పుడో, ఎప్పుడో చూస్తా.

* అనిల్ రావిపూడి సినిమా ఎప్ప‌టి నుంచి సెట్స్ మీద‌కు వెళ్తుందండీ?
- జూన్ ఎండ్ నుంచి చేస్తా. ఫ్యాన్స్ కి చాలా న‌చ్చుతుంది. పూర్తి స్థాయి వినోదాత్మ‌క సినిమా అవుతుంది.

* టీవీ క‌మ‌ర్షియ‌ల్ చేసేట‌ప్పుడు మీ ప్ర‌యారిటీస్ ఏంటి?
- బ్రాండ్ వేల్యూ చూస్తా. మిగిలిన యాస్పెక్ట్ మొత్తం మా ఆవిడ చూసుకుంటుంది.

* మీ స్టాట్యూ ప‌క్క‌న మీ పాప నిల‌బ‌డిన తీరు..
- మా సితార పాప రియాక్ష‌న్‌ని మ‌ర్చిపోలేను.

* దేవీ గురించి చెప్పండి?
- చాలా బాగా చేస్తాడండీ. త‌ను క‌థ‌లో నుంచి వ‌చ్చే ట్యూన్స్ ఇచ్చాడు ఈ సినిమా కోసం. సినిమా విడుద‌ల‌య్యాక `మ‌హ‌ర్షి`లో ఉన్న ప్ర‌తి పాటా హిట్ అవుతుంది. శ్రీమ‌ణి బాగా రాస్తాడ‌ని వంశీ చెబుతూనే ఉన్నాడు. ప్ర‌తి రోజూ సెట్స్ మీద‌కు వ‌చ్చి ఓ ప‌క్క‌కు వ‌చ్చి కూర్చుని రాశాడు.

* పూజా హెగ్డే గురించి చెప్పండి?
- చాలా బావుంటుంది మా సినిమాలో. ఆమెను ఆరాధించే వారు, ఈ సినిమాలో మ‌రింత ఆరాధిస్తారు.

* మీ సినిమాల బడ్జెట్ ఎందుకు అంత పెరుగుతుంటుంది?
- అది నాక్కూడా అర్థం కాదండీ. నిర్మాత‌లు క‌థ‌ను న‌మ్మి గుడ్డిగా వెళ్తారు. `మ‌హ‌ర్షి` క‌థ లో చాలా పెద్ద స్పాన్ ఉంది. న్యూయార్క్ లో సీఈఓ అంటే సీఈఓలాగానే చూపించాలి. అక్క‌డ చాప్స్, కార్లు.. ప్ర‌తిదీ అక్క‌డిలాగానే ఉండాలి. ఆ క్ర‌మంలో కాస్త ఎక్కువైంది. అలాంట‌ప్పుడు మాకు స‌పోర్ట్ చేసే నిర్మాత‌లున్నారు. విలేజ్‌లో సెట్ చేసిన జ‌నం కోసం ప్ర‌తి రోజూ వెయ్యి మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు కావాల్సి వ‌చ్చేవారు. మేం ఆ ఎపిసోడ్‌ని డిసెంబ‌ర్‌లో స్టార్ట్ చేశాం. సాయంత్రం 5 గంట‌ల‌కు లైట్ పోయేది. దాంతో ప‌ది రోజులు అక్క‌డ షూటింగ్ డేస్ పెరిగాయి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఏదైతేనేం, క‌థను నమ్మి చేసే నిర్మాత‌లు వ‌చ్చారు.

* సోలో హీరోగా 150 కోట్ల మార్కెట్ ఉన్న సినిమా చేయ‌డం ప్రౌడ్ గా అనిపిస్తోందా?
- ప్రౌడ్‌గానూ ఉంటుంది. భ‌యంగానూ ఉంటుంది. ఇప్పుడు 160, 170 చేయాలి. ఎందుకంటే థియేట్రిక‌ల్ 110, 120కి అమ్మిన‌ప్పుడు 150 చేస్తేనే బ్లాక్ బ‌స్ట‌ర్ అంటారు. అప్పుడు జెన్యున్‌గా బ‌య్య‌ర్లు కూడా ఆనందంగా ఉంటారు. సినిమా రిలీజ్ అయితే క‌చ్చితంగా హిట్ కావాలి.

* ఫ్యాన్స్ గురించి చెప్పండి?
- గ‌త 20 ఏళ్లుగా వాళ్లు చూపించిన ప్రేమ‌ను గుండెల్లో పెట్టుకుంటా. ఇలాగే వ‌చ్చే 20-25 ఏళ్లు వాళ్లు న‌న్ను ఆద‌రించాలి.

* భ‌ర‌త్ అనే నేను మీ అమ్మ‌గారి బ‌ర్త్ డే రోజు విడుద‌లైంది. మ‌హ‌ర్షి మ‌ద‌ర్స్ డే నెక్స్ట్ రోజు విడుద‌ల‌వుతోంది.
- చాలా మంది అబ్జ‌ర్వేష‌న్ అండీ. మే 1న అల్లూరి సీతారామ‌రాజు విడుద‌లైంది. ఆ సెంటిమెంట్ కూడా క‌లిసొస్తుందేమో.

* అవెంజ‌ర్స్ అంతంత క‌లెక్ట్ చేస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి?
- మ‌న ఇండియాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే సినిమానే ముందు. మంచి సినిమా ఇవ్వాలేగానీ, చాలా పెద్ద హిట్లు చూడొచ్చు. మనంత అదృష్ట‌వంతులు ఇంకెక్క‌డా ఉండ‌రు. మ‌రీ ముఖ్యంగా మ‌న ఆంధ్రా ఆడియ‌న్స్ గ్రేట్‌. ఏవ‌న్నా సినిమా బావుందంటే, ఎగ‌బ‌డి థియేట‌ర్ల‌లో చూసేది మ‌న ఆడియ‌న్సే.

* మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు మీ ద‌గ్గ‌రకు ఈ మ‌ధ్య ఏమైనా వ‌చ్చాయా?
- నా వ‌ర‌కు ఇప్పుడైతే ఏదీ రాలేదండీ. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డం అంత ఈజీ కాదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved