pizza
Naga Chaitanya interview about Shailaja Reddy Alludu
'శైలజారెడ్డి అల్లుడు'లో నా బాడీ లాంగ్వేజ్‌కి భిన్నమైన పాత్ర చేశాను - నాగచైతన్య అక్కినేని
You are at idlebrain.com > news today >
Follow Us

12 September 2018
Hyderabad

నాగచైతన్య అక్కినేని, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ నిర్మాతలుగా మారుతి తెరకెక్కించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో ఇంటర్వ్యూ...

పూర్తి భిన్నమైన పాత్ర...
- ఇప్పటి వరకు నా బాడీ లాంగ్వేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్రను 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో చేశాను. మారుతిగారి సినిమాలో పాత్రలు ఎక్స్‌ప్రెసివ్‌గా, ఎనర్జిటిక్‌గా ..మారుతిగారి స్టయిల్లో ఉంటాయి. కాబట్టి శైలజారెడ్డి అల్లుడు సినిమాలోని పాత్రను చేయడం మొదటిసారి. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాతో ప్రేక్షకులు మరింత దగ్గరయ్యాను. అలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతామనుకునే సమయంలో మారుతిగారు ఈ కథను చెప్పారు. నా బాడీ లాంగ్వేజ్‌తో పాటు.. మారుతిగారి స్టయిల్‌లో క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు.

క్యారెక్టర్‌ గురించి...
- మారుతిగారి సినిమాలు చూస్తే.. హీరోకి ఏదో ఒక డిజార్డర్‌ ఉంటుంది. కానీ మా సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నా క్యారెక్టర్‌ కూల్‌గా ఉంటుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో.. చిన్న మెసేజ్‌...
- ఇగో అందరికీ ఉంటుంది. అయితే అది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. లేకుంటే మన చుట్టూ ఉండేవారు చాలా ఇబ్బంది పడతారు. ఈ సినిమా విషయానికి వస్తే.. నా చుట్టూ ఉండే పాత్రలు ఇగోయిస్టిక్‌గా ఉంటాయి. వాటి మధ్య హీరో ఎలా సస్టేయిన్‌ అయ్యారనేదే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే.. ఇగోలు వల్ల మనుషులు ఎలా దూరమవుతున్నారు? ఎలాంటి సమస్యలు వస్తున్నాయనేది చిన్న మెసేజ్‌లా చెప్పాం.

ఎమోషనల్‌గా ...
- టైటిల్‌ గురించి ఆలోచించలేదు. కథ డిమాండ్‌ మేరకే 'శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్‌ పెట్టాం. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన కథలన్నీ అత్త, అల్లుడు మధ్య పోటీగా సాగుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా ఎమోషనల్‌గా సాగే చిత్రం.

రమ్యకృష్ణతో నటించడం...
- నాన్న, రమ్యగారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా హలో బ్రదర్‌ సినిమా అయితే ముప్పై నలభై సార్లు చూసుంటా!. ఆమెతో నేను నటించాలంటే ముందు నెర్వస్‌గా అనిపించినా! ఆమె చాలా సపోర్ట్‌తో చక్కగా నటించాను. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. రమ్యగారితో సెకండాఫ్‌లో భారీ డైలాగ్‌ సన్నివేశం కూడా ఉంటుంది. అది చాలా చాలా బాగా వచ్చింది. చివరి 30-40 నిమిషాల సినిమా అందరికీ చాలా బాగా నచ్చుతుందనుకుంటున్నాను.

అప్పటి నుండే ర్యాపో ఉంది..
- నేను ప్రేమమ్‌ సినిమా చేసే సమయంలో.. అదే బ్యానర్‌లోనే మారుతిగారు బాబు బంగారం సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయనతో మంచి ర్యాపో ఏర్పడింది. బాబు బంగారం తర్వాత మారుతిగారు కమిట్‌మెంట్‌ ప్రకారం శర్వాతో మహానుభావుడు సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత చేద్దామనుకున్నాం. వర్కవుట్‌ అయింది.

నిర్మాత గురించి...
- నిర్మాతగా చినబాబుగారికి మంచి జడ్జ్‌మెంట్‌ ఉంది. ఆయనకు సినిమా నచ్చకపోతే రీషూట్‌ చేయమంటారు. సక్సెస్‌ అనేది దర్శకుడు ఒక్కడి వల్లే కాదు.. ఇతర టీమ్‌ మెంబర్స్‌తో పాటు నిర్మాత సపోర్ట్‌ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా సక్సెస్‌ అవుతుంది.

ఆ విషయంలో ఇద్దరికీ నమ్మకం ఉంది...
- నిజానికి సామ్‌ సినిమాను ముందు నుండి సెప్టెంబర్‌ 13నే విడుదల చేయాలనుకున్నారు. కానీ మా సినిమానే కాస్త ఆలస్యం కావడంతో అదే తేదికి రావాల్సి వచ్చింది. అయితే ఇద్దరి కాన్ఫిడెన్స్‌ ఏంటంటే.. రెండు సినిమాల జోనర్స్‌ డిఫరెంట్‌ .. వినాయక చవితి సెలవు కాబట్టి.. రెండు సినిమాలను ఆడియెన్స్‌ చూస్తారనే అనుకుంటున్నాం. ఇద్దరం సక్సెస్‌ కొడుతున్నామనే అనుకుంటున్నాం.

కంటెంట్‌ ఉండాలి..
- కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. కాబట్టి మంచి కంటెంట్‌తో నెటివిటీ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో సెకండాఫ్‌ మన నెటివిటీతో ఉంటుంది.

త్రెట్‌ అందరికీ ఉంటుంది..
- విజయ్‌ దేవరకొండ అర్జున్‌రెడ్డి, గీత గోవిందం సినిమాలతో తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకున్నారు. అందరూ కొత్తగా చేయాలని చూస్తున్నారు. ఇలా చూస్తే ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్‌కి మరో యాక్టర్‌ నుండి త్రెెట్‌ ఉంటుంది. అందుకోసం బాగా హార్డ్‌ వర్క్‌ చేసుకుంటూ పోవాలి.

ప్రొడక్షన్‌ గురించి.. ...
- చి||ల||సౌ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సుశాంత్‌ విషయంలో మేం అంతా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి మంచి కథలున్న సినిమాలు వస్తే.. అది మా ఫ్యామిలీ హీరోలు కాకపోయినా నేను మా ప్రొడక్షన్‌ సైడ్‌ నుండి సపోర్ట్‌ చేస్తాను

అందుకు సమయం ఉంది..
- 'అర్జున్‌రెడ్డి, ఆర్‌.ఎక్స్‌ 100' వంటి సినిమాలకు నేను చేయాలంటే సమయం పడుతుంది.

తదుపరి చిత్రాలు...
- సవ్యసాచిలో ఓ సాంగ్‌ చిత్రీకరించాల్సి ఉంటుంది. ఈ నెల 15, 16లో ఆ సాంగ్‌ను చిత్రీకరిస్తాం. నవంబర్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. శివ నిర్వాణ సినిమా అక్టోబర్‌ మొదటి వారంలో స్టార్ట్‌ అవుతుంది. ఇది మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరి. పెళ్లైన జంట మధ్య జరిగే ప్రేమకథ. వెంకీ మామ సినిమా కూడా అక్టోబర్‌లోనే స్టార్ట్‌ చేస్తాం. ఇక ప్రొడక్షన్‌ విషయానికి వస్తే రాహుల్‌ రవీంద్రన్‌ నాన్నకు ఓ కథను రెడీ చేస్తున్నారు. ఆయన విని ఏమంటారో చూడాలి. అలాగే నేను, నాన్న.. నాన్న, అఖిల్‌ ప్లాన్‌ చేస్తున్నాం.. అన్ని అనుకున్నట్లు అయితే మా ఫ్యామిలీ హీరోల సినిమాలు రూపొందుతాయి.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved