pizza
Nagarjuna interview (Telugu) about Devadas
ఆద్యంతం నవ్వులే నవ్వులు... ‘దేవదాస్‌’ - నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

24 September 2018
Hyderabad

‘దేవదాస్‌’ అనే పేరు వినగానే తెలుగువారికి అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకొస్తారు. కానీ ఇకపై ఆయనతో పాటు నాగార్జున, నాని కూడా గుర్తుకొస్తారు. ఈ సినిమాలో దేవగా నటించారు నాగార్జున. ఆయన డాన్‌గా నటించిన సినిమా ఇది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి సోమవారం నాగార్జున హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాల సమాహారం...

* చాలా రోజుల తర్వాత డాన్‌గా నటించారు?
- అవును. కానీ ఈ సినిమాలో డాన్‌ చేసే పనులేమీ ఉండవు. నాకూ, నానీకి మధ్య ఫ్రెండ్‌షిప్‌, మేమిద్దరం ఎలా కలుసుకున్నది ఉంటుంది. రొమాన్స్‌ కూడా తక్కువే. ఆకాంక్ష అందంగా ఉంది. సినిమాలో ఓ యంగ్‌ ఏజ్‌ నుంచి ఆ అమ్మాయికి ఫ్యాన్‌. ఆమె న్యూస్‌ రీడర్‌. అయినా అమ్మాయిని ఎప్పుడూ కలిసుండడు. అలాంటిది వాళ్లిద్దరినీ నాని కలుపుతాడు. ఎవరికీ భయపడని డాన్‌ అయినా, అమ్మాయి కనిపించగానే తడబడతాడు. నోట మాటరాదు. మేనరిజమ్‌ మారిపోతుంది.

* మీరు పేషెంటా?
- అవును. నేను పేషెంట్‌నే. దాస్‌ డాక్టర్‌. అతన్ని వెళ్లి కలుస్తాను. అప్పటిదాకా సినిమాలో నాకు ఫ్రెండ్స్‌ ఉండరు. తొలిసారి దాస్‌ ఫ్రెండ్‌ అవుతాడు. దేవకి డ్రింకింగ్‌ ఇష్టం. దాస్‌ తాగడు. బెదిరించి తాగిస్తాడు. రెండూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేరక్టర్లే. రాజు హిరానీ స్టైల్‌లో మున్నాభాయ్‌ తరహాలో సాగుతుంది ఈ సినిమా. మున్నాభాయ్‌లోనూ అతను డాన్‌ అయినా, వెనుక జరిగేవి ఏమీ చూపించరు.

*నానితో కెమిసీ్ట్ర ఎలా ఉంది?
- చాలా బావుంది. పర్సనల్‌గా నాని నాకు తెలియదు. కానీ ఆన్‌స్ర్కీన్‌ చాలా బాగా చేశారు.

* మెసేజ్‌ ఏమైనా ఉంటుందా?
- అలాంటిదేమీ లేదు. మెసేజ్‌లు లేవు. ఒన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఫ్యాన్స్‌కి నచ్చే ఫైట్లు, డాన్సులు, కామెడీ అన్నీ ఉంటాయి.

* మల్టీస్టారర్లే చేద్దామని అనుకుంటున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. ఇండసీ్ట్రలో ఇప్పటికే 32 ఏళ్లున్నా. డిఫరెంట్‌ పాత్రలు చేయాలని ఉంది. ఈ ఏజ్‌లో ఒన్లీ సోలో మీద స్టోరీలు చేయడం అంత ఈజీ కాదు. 20,30,40లో చాలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం లేదనో, ప్రేమనో సినిమాలు చేయలేం. మదర్‌, ఫాదర్‌ స్టోరీస్‌ కూడా చేయలేం. అలాంటప్పుడు మల్టీస్టారర్‌ గురించి అనుకోవచ్చు. అందుకే ఈ సినిమా చేశా. తమిళ్‌లోనూ ధనుష్‌తో, హిందీ బ్రహ్మాస్త్ర కూడా అలాంటిదే.

* మల్టీస్టారర్‌ సేఫ్‌ అని అనుకుంటున్నారా?
- మల్టీస్టారర్‌ సేఫ్‌ అని ఎక్కడా ఎవరూ పుస్తకం రాయలేదు. అందులో ఉండేవి అందులోనూ ఉంటాయి. కాకపోతే కథ రాసుకునేటప్పుడు చాలా పాత్రలుంటాయి. వాటి గురించి రాసుకోవచ్చు. ఇంట్రస్టింగ్‌గా తీసుకురావచ్చు.

* మల్టీస్టారర్స్‌ అనగానే ప్రెజర్‌ తక్కువగా ఉంటుందా?
- అలాంటిదేమీ ఉండదు. సినిమా బాగా రాకపోతే ఇంకా ఇబ్బందే. ఇద్దరుండి హిట్‌ కొట్టలేకపోయారని అంటారు. ఆ మాటకొస్తే ప్రెజర్‌ ఎక్కువగానే ఉంటుంది. నేను, నాని చేశాం. ఇప్పుడు ప్రెజర్‌ ఎక్కువగా ఉంది. నిన్న నేను, నానీ మాట్లాడుకుంటుంటే ‘ప్రెజర్‌ ఎక్కువగా ఉంది’ అనే అనుకున్నాం. ఇండివిజువల్‌ ప్రెజర్‌ తగ్గుతుంది. కానీ కంబైన్డ్‌ ప్రెజర్‌ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి. నానికి తనదైన మార్కెట్‌ ఉంది. తను స్టార్‌. నేనూ చాన్నాళ్లుగా ఇదే పరిశ్రమలో ఉన్నాను. కాబట్టి అవన్నీ ఉంటాయి.

* కొత్త దర్శకుడిని సెలక్ట్‌ చేసుకోవడానికి కారణం ఏంటి? మీరే డైరక్టర్‌ని సెలక్ట్‌ చేశారని అన్నారు..?
- ఈ దర్శకుడిని సెలక్ట్‌ చేసింది వైజయంతీ మూవీస్‌, నాని. రెండేళ్ల క్రితం శ్రీధర్‌ రాఘవన్‌ అని ముంబై రైటర్‌ కథ చెప్పారు. ముందు నా దగ్గరికి వచ్చింది ఈ కథ. ‘కథ బావుందండీ. కోస్టార్‌ చక్కగా కుదరాలి’ అని అన్నా. ఈ రెండేళ్లలో ఈ కథ రకరకాల దర్శకుల దగ్గరకు వెళ్లింది. చాలా మంది చేసుకొచ్చారు. ఓకే అనిపించింది. ఫైనల్‌గా శ్రీరామ్‌ ఆదిత్య పేరును నానిని సజెస్ట్‌ చేసినట్టున్నాడు. నాక్కూడా కరెక్ట్‌గా తెలియదు. శ్రీరామ్‌ పేరు చెప్పగానే నేను ‘శమంతకమణి’ అనే సినిమా చూశా. అది కూడా స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ సినిమానే. దానికి తోడు కథ బాగా నచ్చింది. భూపతిరాజాగారు, సత్యానంద్‌గారు, కృష్ణ అని ఇంకొక రైటర్‌ ఉన్నారు... వాళ్లందరూ మంచి రైటర్స్‌. ఈ సినిమా టీమ్‌ వర్క్‌.

* మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు ఉంది?
- కథ నచ్చాక నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ తర్వాత నాని, దత్తుగారి అమ్మాయి స్వప్న వంటివారందరూ చూసుకున్నారు. ఎందుకంటే స్వప్న ఈ మధ్యనే మహానటి తీసింది. వాళ్లకి సినిమా అంటే ప్రేమ ఉంది. అందుకే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎక్కువ మంది దీన్ని కెలికినా కూడా బావుండదు.

* మీకు బాగా నచ్చిన అంశమేంటి?
- రాజు హిరానీ సినిమాలో ఉంటే ఎక్కడో మెసేజ్‌ టచ్‌ అనేది ఉంటుంది. నేను ఫుల్‌ ఎనర్జీతో చేశాను. దేవ ప్రాబ్లమ్స్‌, సె్ట్రస్‌.. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తుంటా. అది చాలా బావుంటుంది.

* హాలీవుడ్‌, బాలీవుడ్‌లో సేమ్‌ ఏజ్‌ ఉన్నవాళ్లతో చేస్తుంటారు.. మీరు అలాంటివి చేయరా?
- (నవ్వుతూ) ఇప్పుడు నానితో నేను సేమ్‌ ఏజ్‌తో చేస్తున్నాగా. అయినా సేమ్‌ ఏజ్‌ వాళ్లతో చేస్తే బోర్‌ కొట్టేస్తుంది. ఆటోమేటిగ్గా విమర్శకులే ‘ఇది ముసలివాళ్ల సినిమా’ అని రాస్తారు. అలా రాయించుకోవడం అవసరమా? అయినా నేను ఇంతకు ముందు శ్రీకాంతతో చేశా. విష్ణుతో చేశా. హరికృష్ణగారితోనూ చేశా. ఆ మధ్య కార్తీతో చేశా.

* మీరంటే ఛార్మ్‌ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తండ్రిగా అలా చేస్తారా?
- నాకు పిల్లలు లేరయ్యా బాబూ.. (నవ్వుతూ). ఇప్పుడున్న వాళ్లు కూడా నా బ్రదర్సే. హిందీ పాపనాశనం లాంటి సినిమాలు చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. అయినా నేను మానసికంగా 25ని ఎప్పుడూ దాటలేదు. ఎప్పుడూ అలాగే ఆలోచిస్తా. నిద్ర లేచినప్పుడు అలాగే లేస్తా. *నువ్వింకా పాతికేళ్ల కుర్రాడివి అనుకుంటున్నావ్‌’ అని అంటుంటుంది అమల. ‘నిజమే. అలా ఆలోచిస్తున్నాను కాబట్టే అఖిల్‌ని, చైతూని డీల్‌ చేస్తున్నా’ అని అంటాను. నిజమే. నేను పాతికేళ్ల కుర్రాడిలాగానే ఆలోచిస్తా.

* దీనికోసం ప్రతిరోజూ ఏమైనా చేస్తున్నారా?
నాకిప్పుడు 59 ఏళ్లు. గత 30 ఏళ్లుగా ఏమేం వ్యాయామాలు చేస్తున్నానో, అదే ఇప్పుడు కూడా చేస్తున్నా. ఉదయాన్నే ఒక్కసారి వ్యాయామాలు చేశానంటే బ్యాటరీ ఫుల్‌ చార్జింగ్‌లో ఉన్నట్టే. ఎక్కడా నీరసపడను. ఆ మధ్య ఒకరోజు నా ఫ్రెండ్‌ ఒకతను ఏమన్నాడంటే ‘మనిద్దరం కలిసే పెరిగాం. అయినా బెటర్‌... నువ్వు నీకన్నా వయసులో చిన్నవారితో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యి. ఇంకో 20 ఏళ్ల తర్వాత వాళ్లు నీకు ఫ్రెండ్స్‌గా ఉంటారు. లేకుంటే ఎవరూ ఉండరు’ అని సీరియస్‌గా కూర్చోబెట్టి సలహా ఇచ్చాడు.

* వయసు అనేది మీ దృష్టిలో కేవలం సంఖ్యేనా?
- అసలు సంఖ్యే అని కాదు. నాకు నా వయసు తెలుసు. దాని గురించి అవగాహన ఉంది. అంతేగానీ పదే పదే వయసు గురించి ఆలోచించను. నమ్మండి... నేను చైతన్య కన్నా యంగ్‌గా ఆలోచిస్తా. వాడే నన్ను కూర్చోబెట్టి సలహాలు ఇస్తుంటాడు.

* బిగ్‌బాస్‌లో గట్టిగా ప్రమోషన్లు చేస్తారనుకున్నాం. కానీ చేయలేదు..
- బిగ్‌బాస్‌ నానిది కదా.

* వైజయంతీలో ‘ఆఖరి పోరాటం’ నుంచి ‘దేవదాస్‌’ వరకు చెప్పండి...
- ఆఖరి పోరాటం గురించి దత్తుగారు, రాఘవేంద్రరావుగారు చెప్తే ‘చాలా బావుంటుంది’ అని అన్నా. వెంటనే ‘శ్రీదేవి’ అన్నారు. ‘అమ్మా.. ఇంక నాకేముంటుంది’ అని అన్నా. అప్పుడే శ్రీదేవికి ‘మిస్టర్‌ ఇండియా’ విడుదలైంది. ఆ సినిమాను అప్పుడు ‘మిస్టర్‌ ఇండియా’ అని కాదు.. మిస్‌ ఇండియా అని అన్నారు. అంత క్రేజ్‌ ఉంది ఆమెకు. అలాంటి సమయంలో దత్తుగారు తెలివిగా నాన్నగారి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి ‘ఆమె చాలా పాపులర్‌. ఆమెతో కలిసి పనిచేస్తే, నీ పాపులారిటీ కూడా పెరుగుతుంది. ఈ అవకాశాన్ని అందుకో. తెలుగు సినిమాలో హీరో అనగానే ఏం చేయాలో, ఏం ఉంటే బావుంటుందో దత్తుగారికి, రాఘవేంద్రరావుగారికి అన్నీ తెలుసు. వాళ్లు చేస్తారు. నువ్వు ఒప్పుకో ’ అని అన్నారు.

* మీకు అసలు ఇష్టం లేదా?
- ఇష్టం లేక కాదు. అందులో నాకు చేసేది పెద్దగా లేదనిపించింది. నాకు శ్రీదేవిగారంటే చాలా ఇష్టం. అయినా ఆమె పాపులారిటీ నాకు బాగా తెలుసు. నాకు ‘శివ’, ‘గీతాంజలి’ తర్వాత స్టార్‌డమ్‌ వచ్చింది. అంతుకు ముందు లేదు. ‘ఇతనికి డైలాగులు సరిగా రావు. చూడ్డానికి సన్నగా ఉన్నాడు’ ఇలా చాలా కామెంట్లు నా మనసును ఇబ్బంది పెడుతూ ఉండేవి ఆ టైమ్‌లో. అది 6,7 సినిమా అనుకుంటా.

* ఆయన అప్పట్లో హీరోలాగానే ఉండేవారుగానీ, ఇప్పుడు నిర్మాతలాగా ప్రతిదీ చూసుకుంటున్నారు అని అన్నారు... అశ్వనీదతగారు. దాని గురించి మీరేమంటారు?
- ఆయనతో లాస్ట్‌ సినిమా ‘రావోయి చందమామ’. చాలా రోజులైంది కదా నేను సినిమా చేసి. దాదాపు 18 ఏళ్లయింది. అశ్వనీదతకి సినిమా చాలా పెద్ద ప్యాషన్‌. ఆయన తీసిన సినిమాలను చూస్తే, ఇంకే తెలుగు సినిమా నిర్మాతకూ అన్ని వైవిధ్యమైన సినిమాలు లేవు. ఇటీవల ‘మహానటి’ చేశారు. అందులో చైతూ నాన్నగారిలాగా కనిపించారు. అయితే ఆ సినిమాను ఆయన ఇద్దరమ్మాయిలు, అల్లుడు చేశారని ఆయనే చెబుతారు. ఆయన కంబ్యాక్‌ సినిమాగా ‘దేవదాస్‌’ను పీలయ్యారు. ‘మా వైజయంతీ మూవీస్‌కి మీరు చేసి పెట్టాలి. ఇది నా కమ్‌బ్యాక్‌ సినిమా’ అని అన్నారు. ఆయన అడగ్గానే నేను కూడా నా సొంత సినిమాలాగానే అనుకున్నా. అశ్వనీదతగారు ‘నా కమ్‌బ్యాక్‌’ సినిమా అని అనగానే ‘మీకు కమ్‌బ్యాక్‌ ఏంటండీ.. ఎప్పుడూ కమ్‌ ఫార్వర్డేగానే’ అని అన్నా.

* శ్రీరామ్‌ ఆదిత్య ఎలా చేశారు?
- హ్యాండిల్డ్‌ వెరీ వెల్‌. మా అందరం అనుకున్నది ‘ఇది ఆది సినిమా. అతను చేయాలి’ అని అనుకున్నాం. ఇది టీమ్‌ వర్క్‌. అందువల్ల తనకు ప్లస్‌ అయింది. తన ఏజ్‌కి చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సిననిమాలో స్టార్స్‌ ఉన్నారు, మంచి బడ్జెట్‌ ఉంది.. ఇవన్నీ తనకు బాగా ప్లస్‌ అవుతాయి.

* నాని సినిమాలు చూశారా?
- చూశాను. అలా మొదలైంది, ఎవడే సుబ్రమణ్యం, మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ, ఈగ... ఇవన్నీ చూశా. నాకు నాని అంటే ఇష్టం. తన సినిమాలు చూడ్డానికి ఇష్టపడతా. చాలా నేచురల్‌గా ఉంటాయి అతని సినిమాలు. పైగా అందులో మేజిక్‌ కూడా ఉంటుంది. నాకు రియల్‌గా ఉండే సినిమాలు ఇష్టం ఉండవు. ఎందుకంటే రియాలిటీని చూడాలంటే నాకు కారులో వెళ్తుంటే ఆ రియాలిటీ కనిపిస్తుంది. అందుకే నాకు అలాంటి సినిమాలు నచ్చవు. నాకు సినిమాల్లో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కనిపించాలి. అలాంటివే ఇష్టం. నేను చూసిన నాని సినిమాల్లో ఆ మేజిక్‌ ఉంటుంది. రియల్‌గా ఉంటూ మేజిక్‌ కూడా కనిపిస్తుంది. ఆ బ్యాలన్స్‌ చేసుకోవడం నాకు తెలుసు.

* కేరాఫ్‌ కంచరపాళెం చూశారా? నచ్చిందా?
- ఇంకా చూడలేదండీ. చూడాలనుకుంటున్నా.

*నాని ఎప్పుడూ ఫోన్‌ మాట్లాడుతూనే ఉంటాడని మీరు ట్వీట్‌ చేశారు..?
- నిజమే. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. రాత్రుళ్లు కూడా చెవికి ఫోన్‌ తగిలించుకుని నిద్రపోతాడేమో. సెట్లో అతను హీరో కాబట్టి ఏమీ అనలేదు. ఇంకొకళ్లయితే ఫోన్‌ తీసుకుని ఇరగ్గొట్టేసేవాళ్లేమో. ఇది డిజీజ్‌ అయింది సార్‌.. ఎలా బయటికి రావాలి అని తనే అంటాడు. నన్నడిగితే ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటం అనేది డిసీస్‌. పక్కన ఏం జరుగుతుంది? ఏంటి? వంటివన్నీ వాళ్లకు తెలియవు.

* మీరేమైనా సజెషన్‌ ఇచ్చారా?
- లేదండీ. దాన్ని దాటేశాడు.

* అఖిల్‌కిగానీ, చైతూకి గానీ ఇలాంటి అడిక్షన్స్‌ ఉంటాయా?
- లేవండీ. అలాంటివేమీ లేవు.

* ఇటీవల సుమంతగారి గెటప్‌ చూశారా?
- చూశా. కాసేపు నేనే గుర్తుపట్టలేదు. నాన్నకి, సుమంతకి చాలా పోలికలుంటాయి. తను చిన్నప్పటి నుంచి నాన్నగారితో కలిసి పెరగడం వల్లనోఏమో తనకి నాన్న మేనరిజమ్స్‌ చాలా తెలుసు. మాట్లాడేవిధానం, నడిచే విధానం వంటివన్నీ.

*శైలజారెడ్డిలో నాగచైతన్యకి యువ సామ్రాట్‌ అని వేశారు?
- పోన్లెండి. నా మీద ఆ బాధ్యత లేదు. అయినా నా పేరుకు ముందు దాన్ని తీసేయమని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పటికి చేశారు.

interview gallery*బంగార్రాజు, రాహుల్‌ దర్శకత్వంలో సినిమా ఎంత వరకు వచ్చింది?
- రెండూ స్ర్కిప్ట్‌లు జరుగుతున్నాయి. ఏది ముందుకొస్తుందో చూడాలి. రాహుల్‌ దర్శకత్వంలో చేసే సినిమా మన్మథుడు2 అనేది కాదు. ఆ టైటిల్‌ బావుంటుందని రిజిస్టర్‌ చేశాం. అది నాకు కావచ్చు, చైతూకి కావచ్చు, అఖిల్‌కి కావచ్చు. ఎవరి స్ర్కిప్ట్‌కి సూట్‌ అయితే వాళ్లు పెట్టుకుంటాం.

* దేవదాస్‌ సినిమా చూశారా?
- కంప్లీట్‌ వెర్షన్‌ కాదు కానీ, సినిమా చూశా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

* ఈ సినిమాకీ, పాత సినిమాకీ ఏమైనా పోలికలుంటాయా?
- ఒక్క బాటిల్‌ తప్పితే ఏ సంబంధమూ లేదు. పాతది ప్రేమ దేవదాస్‌. ఇది నవ్వుల దేవదాస్‌. తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా నచ్చిన, తెలిసిన టైటిల్‌. ఆ బేసిస్‌ మీద సినిమా చేశాం. స్ర్కిప్ట్‌ రాసుకున్నప్పుడే నా పేరును దేవ అని పెట్టారు. దాస్‌ను మాత్రం ఈ టైటిల్‌ కోసమే పెట్టాం.

* బాలీవుడ్‌లో చాన్నాళ్ల తర్వాత చేస్తున్నారు?
- దాదాపు 15 ఏళ్ల తర్వాత నేను బాలీవుడ్‌లో చేస్తున్నా. మధ్యలోనూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను చేయలేదు. ఇప్పుడు నచ్చి చేస్తున్నా. నా రోల్‌ 600 ఏళ్లకు ముందు రోల్‌. ఇంకా షూటింగ్‌ కాలేదు. రామోజీ ఫిల్మ్‌సిటీలో చేస్తారు. నా జీవితంలో నేను చేసిన పొరపాట్లకు నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. 95 శాతం స్టార్టప్‌లు ఫ్లాపుల్లో ముగుస్తాయి. నా విషయంలో అలాంటిదేమీ కాలేదు. కొన్నిసార్లు తప్పు కూడా అవుతాయి.

* మణిశర్మ సంగీతం గురించి చెప్పండి?
- ఏమో ఏమో అని ఒక పాట ఉంది. ఆ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాటను నానికి పెట్టారు. వారూ వీరూ వంటివన్నీ బావున్నా నాకు సిద్‌శీర్రామ్‌ పాడిన పాట మాత్రమే నచ్చింది. అసలు ఆ వాయిస్‌ ఎంత బావుందండీ. ‘ఏమాయ చేశావే’లో ‘ఆరుమోళే’ అని ఓ పాట ఉంది. అక్కడి నుంచి అతని సాహసం శ్వాసగా సాగిపోలో ‘వెళ్లిపోమాకే’ అని ఓ పాట పాడాడు. ఆ తర్వాత ‘గీత గోవిందం’.. చేశాడు. శ్యామ్‌ మా సినిమాకు చాలా పెద్ద అసెట్‌. ఫొటోగ్రఫీ మాత్రమే కాదు, శ్రీరామ్‌ ఆదిత్యను కూడా చాలా హెల్ప్‌ చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన వారిలో నాకు శ్యామ్‌తో మళ్లీ చేయాలని ఉంది. అంత సైలెంట్‌గా ఉంటాడు. మంచి మనిషి. ఆల్‌ రౌండర్‌ అతను.

* బయోపిక్‌లకు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్‌ అయ్యారా?
- అవును. అయితే అది నాన్నగారిది కాదు. అంబేద్కర్‌ విషయానికి అయ్యారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి పర్సనల్‌ సెక్రటీ కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు. అది నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సీరీస్‌ చేస్తున్నారు. చాలా బ్యూటీఫుల్‌గా చేశారు. కానీ నాకు సమయం లేక చేయలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు అన్ని విభాగాల రాజులను కలిసి వాళ్ల చేత పేపర్ల మీద సంతకాలు పెట్టించిన వ్యక్తి పాత్ర అది. చాలా బావుంటుంది.

* కరణ్‌జోహార్‌తో అఖిల్‌ సినిమా..?
- ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితమే కరణ్‌జోహార్‌ అఖిల్‌కి ఆఫర్‌ ఇచ్చాడు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్‌. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేను కరణ్‌కి సింపుల్‌గా చెప్పింది ఏంటంటే ‘తెలుగులో మేం ఓ సినిమా చేస్తాం’, తర్వాత నువ్వు హిందీలో చెయి్‌ అని అన్నా. అంతకు మించి ఇంకేమీ మాట్లాడుకోలేదు. కరణ్‌కి అఖిల్‌ అంటే చాలా ఇష్టం. అఖిల్‌ని హిందీలో నేను చేస్తానని రెండుసార్లు చెప్పాడు. అందుకు నేనేమీ చెప్పానంటే ‘తొందరపడొద్దు. అఖిల్‌ ఇప్పటికే తెలుగులో ఓ సారి తొందరపడ్డాడు. పెద్దోళ్లు చెప్పేది కొన్నిసార్లు వినాలి’ అని అన్న.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved