pizza
Nag Ashwin interview (Telugu) about Mahanati
సావిత్రిగారి గురించి పూర్తి స్థాయి సినిమా 'మహానటి' - నాగ్‌ అశ్విన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 May 2018
Hyderabad

కీర్తి సురేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'మహానటి'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో స్వప్న సినిమాస్‌, వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రియాంక దత్‌ ఈ సినిమాను నిర్మించారు. మే 9న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో ఇంటర్వ్యూ....

ఈ సినిమా ఎలా మొద‌లైంది?
- ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత వేరే కొన్ని స్క్రిప్టులు అనుకున్నా. కానీ ఏ స్క్రిప్ట్ ఎప్పుడు స్క్రీన్ మీద‌కు రావాలో అప్పుడే వ‌స్తుంది. అలాగే ఈ సినిమాను మొద‌లుపెట్టాం.

* సావిత్రిగారి గురించి అస‌లు ఎలా తెలుసుకున్నారు?
- ఆమె గురించిన పుస్త‌కాలు ఎవ‌రో చ‌దువుతుంటే తీసుకుని చ‌దివాను. కిర‌ణ్‌ప్ర‌భ‌గారి టాక్స్ విన్నాను. దాదాపు ఆరు గంట‌లపాటు సాగే టాక్స్ అవి. అన్నీ విన్నా. దానికి ముందు ఆమె సినిమా న‌టి, గొప్ప అభినేత్రి అని మాత్ర‌మే తెలుసు. కానీ ఆ త‌ర్వాత చాలా తెలుసుకున్నా.

* ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత గ్యాప్ ఎందుకు వ‌చ్చింది?
- ఆ సినిమా త‌ర్వాత ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే నేను గ్యాప్ తీసుకున్నా.

* సావిత్రిగారి రీల్ లైఫ్‌ని, రియ‌ల్ లైఫ్‌ని ఎలా బ్యాల‌న్స్ చేశారు?
- ఆవిడ రియ‌ల్ లైఫ్‌, రీల్ లైఫ్ రెండూ చాలా ప్యార‌ల‌ల్‌గానే న‌డిచాయి. దేవ‌దాసు, మాయాబ‌జార్ వంటివ‌న్నిటినీ ప‌ర్స‌న‌ల్‌, సినిమా లైఫ్స్ ని అల్లుకున్నాం.

* దీన్ని సీక్వెల్ చేద్దామ‌నుకున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. ఒక‌టే సినిమా అనుకున్నాం. కానీ నిజంగా ఒక లెజండ‌రీ ఆర్టిస్ట్ గురించి సినిమా తీయాలంటే అది సినిమాలా కాదు, నెట్‌ఫ్లిక్స్ లాంటివాటిలో వ‌చ్చేవిధంగా సీరీస్ లాగా చేయాలి. సావిత్రిగారి జీవితంలోనూ హానెస్ట్ గా అంత కంటెంట్ ఉంది. ఎన్టీఆర్‌గారిది, ఏఎన్నార్‌గారిది, ఎస్వీఆర్‌గారి జీవితాలు తెర‌పైకి తీసుకురావాలంటే అలా సీరీస్‌లాగా కుదురుతాయి కానీ, పార్ట్స్ గా సెట్ కావు.

* సావిత్రిగారు న‌టించిన అన్ని సినిమాలు చూశారా మీరు?
- అన్ని క‌ష్ట‌మండీ. ఆవిడ 300 సినిమాలు చేశారు. కొన్ని మిస్ అయి ఉంటాను. కానీ ఆ సినిమాల్లోనూ పాట‌ల‌ను చూశాం.

* కీర్తి సురేశ్‌ని ఎందుకు తీసుకున్నారు?
- కీర్తిని త‌మిళ్ సినిమా `తొడ‌రి` చూశా. అందులో ఆమె ఫేస్‌లో ఇన్నొసెన్స్ క‌నిపించింది. ద‌ట్ టు సావిత్రిగారి చిన్న వ‌య‌సును కూడా చూపిస్తున్నాం. అందుకోసం యంగ్ హీరోయిన్ మాత్ర‌మే కావాలి. 16 టు 40 ఏళ్ల వయ‌సున్న‌వారిగా న‌టించాలంటే అంద‌రూ స‌రిపోరు. కానీ మాకు కీర్తి బెస్ట్ ఆప్ష‌న్ అని అనిపించింది.

* కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి సాహ‌సం ఎందుకు చేయాల‌నిపించింది?
- త‌ర్వాత చేయ‌లేనేమో అని అనిపించింది. ఎందుకంటే కెరీర్‌లో సెటిల్ అయిన త‌ర్వాత ఒక మైండ్‌సెట్ ఉంటుంది. పెద్ద హిట్ నో, పెద్ద ఫెయిల్యూర్‌నో చ‌విచూశాక ఉన్న మైండ్‌సెట్ వేరుగా ఉంటుంది. అలాంటిది లేక‌ముందే చేసేద్దామ‌నిపించింది.

* పెద్ద‌గా అనుభ‌వం కూడా లేని మీరు ఈ సినిమా చేసేట‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు?
- నాకు అనుభ‌వం లేదు కానీ చేయాల‌ని దిగిన‌ప్పుడు చేసేయాల‌ని చేశాను. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంలో వేరే చాలెంజ‌స్ ఉంటాయి. ఈ సినిమాలో తీయ‌డంలో చాలెంజ‌స్ ఎక్కువే. అంద‌రూ అమ్మా అని పిలిచే వ్య‌క్తి మీద సినిమా అన్న‌ప్పుడు నాకు గౌర‌వం దొరికింది.

* స్క్రిప్ట్ రాసేట‌ప్పుడు చాలా మందిని సంప్ర‌దించ‌లేద‌ట కదా?
- అంటే సావిత్రిగారిని తెలియ‌నివారు ఎవ‌రూ లేరు. ఆమె ఫ్యామిలీ నుంచే నాకు చాలా రీసెర్చ్ వ‌చ్చింది. వాళ్ల పిల్ల‌లు చాలా రీసెర్చ్ చేశారు. తెలుగు, ఇంగ్లిష్ లో చాలా మంది రీసెర్చ్ చేశారు. నేను లిట‌రెర్‌గా వాళ్లంత రీసెర్చ్ చేయ‌లేదు. కానీ వాళ్ల‌వి చ‌దివి తెలుసుకున్నా. ఇప్పుడు నాకు సినిమా చూస్తే ఏదీ మిస్ అయిన‌ట్టు అనిపించ‌లేదు. స‌మాచారం బోలెడంత ఉంది.

* సావిత్రిగారి సినిమా ఎక్క‌డి నుంచి మొద‌ల‌వుతుంది?
- ఆమె సొంత ఊరు, ఎక్క‌డి నుంచి మొద‌ల‌య్యారు వంటి విష‌యాల‌న్నీ చెప్పాం. ఇందులో చాలా విష‌యాలు ఫ్యాన్స్ కి ట్రీట్‌లాగా ఉంటుంది.

* కాస్టింగ్ చేయ‌డంలో మీకు సిద్ధ‌హ‌స్తులులాగా ఉన్నారు?
- అది శేఖ‌ర్ క‌మ్ముల ద‌గ్గ‌ర నేర్చుకున్నానండీ. ఆయ‌న కాస్టింగ్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను.

* చాలా మంది స్టార్స్‌తో చేయడం కష్టమనిపించలేదా?
- లేదండి..ఈ సినిమాలో మోహన్‌బాబుగారు, చైతన్య, సమంత, దుల్కర్‌, విజయ్‌ దేవరకొండ ఇలా ఇంత మంది నటీనటులు నటించారంటే కారణం సావిత్రిగారే. అంతే తప్ప మా కోసం అయితే కాదు. మోహన్‌బాబుగారు వంటి సీనియర్‌ యాక్టర్‌ పాత్ర నిడివి చిన్నదే అయినా చేయడానికి కారణం కూడా సావిత్రిగారే. ఇంత మంది స్టార్స్‌తో సినిమా తీయడం కష్టమనిపించలేదు. ఎందుకంటే నేనేదో ఎక్స్‌ట్రాగా చెప్పడానికి ప్రయత్నించలేదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆన్‌ టైమ్‌లో వచ్చేసేవారు.

interview gallery



* ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్‌ మైండ్‌లో ఉండేదా?
- ఎంత పెద్ద సినిమా చేస్తున్నా.. బడ్జెట్‌ అనేది నా మైండ్‌లో రన్‌ అవుతుంటుంది. సినిమా డాక్యుమెంటరీ తరహాలో కాకుండా పక్కా ఫీచర్‌ ఫిలింలా ఉంటుంది. నేచురల్‌ ఫ్లోలో సినిమా ఉంటుంది.

* సావిత్రి గురించి ఏమైనా కొత్త విషయాలున్నాయా?
- సావిత్రిగారి గురించి కొత్తగా చెప్పదేమీ లేదు. అందరికీ తెలిసిన కథే. అయితే ఇందులో కీర్తిని ఎలా చూపిస్తాను. సినిమాను ఎలా తెరకెక్కిస్తాననేదే అసలు పాయింట్‌.

* సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేశ్‌ మీ ఫస్ట్‌ ఛాయిస్సా?
- సావిత్రిగారి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. కానీ కీర్తిసురేశ్‌గారైతే సరిపోతారని నేను ఆమెను ఫాలో అప్‌ పెట్టి ఒప్పించాను.

* సావిత్రిగారి స్నేహితురాలిని కలిశారా?
- సావిత్రిగారి గురించి పూర్తి స్థాయి సినిమా ఇది. ఆమె పుట్టుక నుండి మరణం వరకు ఉంటుంది. అయితే ఆమె చనిపోయిందని తెలుస్తుంది. ఆ యాంగిల్‌లో సినిమా ఎండింగ్‌ ఉంటుంది. సినిమాను 99 శాతం రియాలిటీకి దగ్గరగానే తీశాను. సావిత్రిగారి స్నేహితురాలు సుశీలగారిని కలిసి వివరాలు సేకరించాను. సుశీలగారి గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పి ఉంటారు. ఆ విషయాలన్నీ ఒక్క దగ్గర కూర్చినట్లు సినిమాలో ఉంటాయి.

*మిక్కినే సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి కారణం?
- మిక్కీ ఇండస్ట్రీలో 12-13 ఏళ్లుగా ఉంటున్నారు. తనకు బ్లాక్‌బస్టర్‌ సినిమాలున్నాయి. తనైదే బావుంటుందనిపించింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved