
25 December
Hyderabad
శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక క ష్ణప్రసాద్ సమర్పణలో, అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాతగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'చతురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని గోపీ గణేష్ పట్టాబి దర్శకత్వంలో.. తెలుగులో రూపొందిన చిత్రం 'బ్లఫ్ మాస్టర్'. 'జ్యోతిలక్ష్మీ', 'ఘాజి' చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేతతో ఇంటర్వ్యూ.
నేపథ్యం..
పుట్టింది మైసూరు...కానీ పెరిగింది స్కూలింగ్ అంతా బెంగుళూరు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నేను పదవతరగతి చదువుతున్నప్పుడు పా. రంజిత్‌గారు నాకు 'అట్టకత్తి' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నా నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని చదువుపై దృష్టి పెట్టి ఎంబిఎ పూర్తి చేశాను. తర్వాత వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా నందితాగా నటించాను. అలా తెలుగులో తొలిసారిగా అవకాశం వచ్చింది.
అవకాశం ఎలా వచ్చిందంటే..
- దర్శకుడు గోపీ గణేష్ నా సినిమాలు చూసి నాకు కాల్ చేసి అవకాశం ఇచ్చారు. తెలుగులో ఇది నా మూడో సినిమా. రీమేక్ పరంగా నా తొలి సినిమా. 'బ్లఫ్ మాస్టర్' రీమేక్‌లో అవకాశం రాకముందు ఒక సాధారణమైన ప్రేక్షకురాలిగా సినిమా చూసి ఎంజాయ్ చేశాను. హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదృష్టవశాతు ఆ పాత్రను నేను చేయడం చాలా హ్యాపీగా అన్పించింది. తెలుగులో సినిమా సైన్ చేసిన తర్వాత పాత్రపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని తమిళ వెర్షన్‌ను చూడలేదు.
సినిమాలో పాత్ర గురించి...
- కంటెంట్‌ని నమ్మి సినిమాలు చేస్తూ వస్తున్నాను. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో నా పాత్ర పేరు అవని. అమాయకమైన చాలా పాజిటివ్ మనస్తత్వంతో ఉండే అమ్మాయిగా కనబడతాను. అలాగే సినిమా చివరిలో ప్రగ్నెంట్ లేడీగా కనిబడతాను. ఒక పాత్రలోనే చాలా వేరియేషన్స్ కనబడతాయి.
హీరో సత్యదేవ్ గురించి...
- సినిమా అంగీకరించే సమయంలో హీరో ఎవరు అని అడిగాను. గోపీ గణేష్‌గారు అప్పటికే ఒక చిన్న డెమో వెర్షన్ షూట్ చేసి ఉన్నారు. అది నాకు చూపించారు. నాకు బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్‌కి సత్యనే పర్‌ఫెక్ట్ అన్పించింది. మా ఇద్దరి మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంది.
దర్శక నిర్మాతల గురించి...
- గోపీ గణేష్‌గారు, నేను తెలుగులో నటించిన సినిమాలేవీ చూడలేదు. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు మార్పులు చేసి కమర్షియల్ హంగులతో సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌గారు, రమేష్ పిళ్ళైగారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతినిస్తుంది.
తదుపరి చిత్రాలు...
- ఇప్పటివరకూ నేను అన్ని భాషల్లో కలిపి 22 సినిమాలు చేశాను. 2018లో 11 తెలుగు సినిమాలకు సైన్ చేశాను. ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'కల్కి', 'అభినేత్రి2', 'ప్రేమకథా చిత్రమ్2', '7', 'అక్షర', 'దేవి2' తదితర చిత్రాలతో 2019లో ప్రేక్షకుల ముందుకు వస్తాను.