pizza
Naveen Polishetty interview (Telugu) about Agent Sai Srinivasa Athreya
ఆ జ‌ర్నీ సినిమా ప‌రిశ్ర‌మ‌ను అర్థం చేసుకోవ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది - న‌వీన్ పొలిశెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2019
Hyderabad

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శకుడు. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో న‌వీన్ పొలిశెట్టి ఇంటర్వ్యూ.

`ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` గురించి చెప్పండి ?
- ఒక కేసు కూడా రాని డిక్టేటివ్ కి ఒక పెద్ద మిస్టరీ కిల్లర్ గురించిన కేసు వస్తే.. దాన్ని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే సినిమా. తెలుగులో డిక్టేటివ్ జోనర్ లో సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. అందులోనూ ఈ సినిమాలో ఫన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మీకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
- చిన్నప్పటినుండి సినిమాలంటే బాగా ఇంట్రస్ట్. అయితే స్కూల్ లో ఉన్నప్పుడు మా ఉపాధ్యాయులందరూ ఒకరి నాటకం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో మా టీచర్ నన్ను పిలిచి నాటకంలో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఏంటంటే.. ఒకసారి నవ్వటం. ఆమె కూడా అలాగే నవ్వమని కోరింది. నేను అలాగే చేసాను. అందరూ మెచ్చుకున్నారు. అలా నటన పై ఆసక్తి ఏర్పడింది. మా నాన్నగారి బలవంతం మీద నేను ఐఐటి రాసి భోపాల్‌ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ ఆరు నెలలు ఉండేసరికి నాకు అర్ధం అయింది. ఇక ఫ్రెండ్స్ తో థియేటర్ క్లబ్‌ లో యాక్ట్ చేశాను. కాకపోతే చిన్న చిన్న పాత్రలే. అలా నా కాలేజీలో ఆ నాలుగు సంవత్సరాలు నన్ను నటనకు దగ్గర చేసింది.

interview gallery



మీరు ఎందుకు టాలీవుడ్‌ లో మీ నటన ప్రస్థానం ప్రారంభించలేదు ?
- సినిమాల్లోకి రావడానికి చాలా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చింది. బొమ్మరిల్లు క్లైమాక్స్ గుర్తుందా ? సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నాకు మరియు మా నాన్నగారి మధ్య ఇది పునరావృతమైంది. అయితే తెలుగులో డైరెక్ట్ గా హీరోగా ఎంటర్ అవ్వడం నాకు ఆ టైంలో అసాధ్యం అనిపించింది. ఆ తర్వాత నేను ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముంబైలో నాటకాలతో నా కెరీర్ ప్రారంభించాను.

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె మిమ్మల్ని ఫేస్ బుక్ లో అప్రోచ్ అయ్యారా?
- అవును. స్వ‌రూప్ నాకు కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. నిజానికి కొంతమంది హీరోలు ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిన తను నా కోసమే వెయిట్ చేసి నాతొ ఈ సినిమా చేశాడు. అలా మేమిద్దరం సుమారు ఏడు ఎనిమిది నెలలు ట్రావెల్ అయ్యాం. ఆ తరువాతే నిర్మాతను కలిసాము.

మీ సినిమా కెరీర్ కి ముంబై జర్నీ ఏమైనా ఉపయోగపడిందా ?
- ఖచ్చితంగా ఉపయోగపడింది. నాకు పరిశ్రమను అర్థం చేసుకోవడానికి అది చాల సహాయపడింది.

విజయ్ దేవరకొండ తో మీకెలా పరిచయం?
- నేను థియేటర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు ఒకసారి వర్క్ షాప్ లో నేను విజయ్ దేవరకొండ కలుసుకోవడం జరిగింది. మేము ఇద్దరం కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి ఆడిషన్స్ లో పాల్గొనడం జరిగింది. మేము హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ కి వెళ్తే మమ్మల్ని అపోజిట్ గ్యాంగ్ లో వేశారు. అలాగే మా సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ని విజయ్ రీట్వీట్ చేయడం కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అందుకు మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?
- ప్రస్తుతం హిందీ లో దంగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితేష్ తివారి దర్శకత్వంలో 'చిచోరి' సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాను. అలాగే తెలుగులో రెండు మూడు స్టోరీస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. తరువాత మిగతా వివరాలు తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో న‌వీన్ పొలిశెట్టి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved