pizza
Nidhhi Agerwal interview (Telugu) about Savyasaachi
తెలుగులో మంచి ఎంట్రీ అవుతుంది - నిధి అగ‌ర్వాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2018
Hyderabad

యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఇంట‌ర్వ్యూ...

నేప‌థ్యం..
-నేను బెంగ‌ళూరుకి చెందిన అమ్మాయిని. హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగాను. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల కూడా కాస్త తెలుసు. నేను అన్ని ర‌కాల సినిమాలు చూస్తుంటాను. క‌న్న‌డం కంటే తెలుగు, త‌మిళ భాష‌లే నాకు బాగా వ‌చ్చు.

`స‌వ్య‌సాచి`లో అవకాశం...
- నేను న‌టించిన మున్నా మైకేల్ సినిమా చూసి ద‌ర్శ‌కుడు చందు మొండేటిగారు నన్ను క‌లిసి స్క్రిప్ట్ చెప్పారు. నేను అలాంటి స్క్రిప్ట్ విన‌లేదు. నాకు చాలా కొత్త‌గా అనిపించింది. అందుక‌నే ఒప్పుకున్నాను.

క్యారెక్ట‌ర్ గురించి..
-సినిమాలో డైరెక్ట‌ర్‌గారు నా పాత్ర‌ను చాలా చ‌క్క‌గా డిజైన్ చేశారు. అన్ని ర‌కాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో నా పాత్ర త‌క్కువ‌గా ఉంటుంద‌ని నేను అనుకోవ‌డం లేదు. ఎందుకంటే నా పాత్ర వ‌ల్ల‌నే సినిమాలో ట‌ర్న్ ఉంటుంది. నేను ఇండిపెండెంట్ గ‌ర్ల్‌గా న‌టించాను. పాత్ర నిడివితో సంబంధం లేకుండా డైరెక్ట‌ర్‌గారు చ‌క్క‌గా డిజైన్ చేశారు. నా పాత్ర పేరు చిత్ర‌. నాతో పాటు మాధ‌వ‌న్‌గారు, భూమిక‌, వెన్నెల కిశోర్‌, స‌త్య ఇలా అందరి పాత్ర‌లు చ‌క్క‌గా కుదిరాయి.

interview gallery



మంచి స‌పోర్ట్‌....
- ఒక‌ప్పుడు నేను హిందీ సినిమాలనే ఎక్కువ‌గా చూసేదాన్ని.. తెలుగులో న‌టించ‌డానికి ఒప్పుకున్న త‌ర్వాత మ‌రో కొత్త ప్ర‌పంచంలోకి వ‌చ్చిన‌ట్లుంది. తెలుగు సాంగ్స్ వింటున్నాను. సినిమాలు చూస్తున్నాను. ఇక్క‌డ చాలా టాలెంటెడ్ వ‌క్తులు ఉన్నారు. అంద‌ర‌రూ చాలా బాగా స‌పోర్ట్ చేశారు.

చైత‌న్య గురించి..
- నాగచైత‌న్య చాలా మంచి వ్య‌క్తి. న‌టుడిగా మంచి టాలెంటెడ్‌. ఒక వ్య‌క్తిలో ఓ చేయి కంట్రోల్‌లో ఉండ‌దు అనే క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క‌ష్టం. అలాంటి క్యారెక్ట‌ర్‌ను చాలా చ‌క్క‌గా పొట్రేట్ చేశారు.

తుద‌ప‌రి చిత్రం...
- జ‌న‌వ‌రిలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో అఖిల్‌తో `మిస్ట‌ర్ మ‌జ్ను`లో న‌టిస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved