29 January 2018
Hyderabad
రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `టచ్ చేసి చూడు`. విక్రమ్ సిరికొండ దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మాతలు. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నాతో ఇంటర్వ్యూ...
మీ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుంది?
- సినిమాలో నా క్యారెక్టర్ పేరు పుష్ప. సాధారణంగా హీరోయిన్స్‌కు ప్రస్తుతం ఉన్న సినిమాల్లో పెర్ఫామెన్స్ రోల్స్, కామెడీ చేసే రోల్స్ రావడం అనేది చాలా కష్టం. కానీ నాకు మంచి కామిక్ టచ్ ఉండే క్యారెక్టర్ దొరికింది. నాకు, రవితేజగారికి మధ్య మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. `సుప్రీమ్` సినిమాలో కూడా నా పాత్రకు మంచి కామెడీ టచ్ ఉంటుంది. అయితే ఆ బెల్లం శ్రీదేవికి, పుష్పకు మధ్య చాలా వ్యత్యాసం కనపడుతుంది. కామెడీ చేయడాన్ని ఇష్టపడే నేను... పుష్ప క్యారెక్టర్‌లో నటించడానికి ఆసక్తి చూపాను.
డబ్బింగ్ తర్వాత మీ పాత్ర ఎలా అనిపించింది?
- చాలా బాగా వచ్చిందండీ.. ముఖ్యంగా రవితేజగారు నాకు ఫోన్ చేసి చాలా మంచి రోల్ చేశావని అప్రిసియేట్ చేశారు. అదే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.
రవితేజతో వరుస సినిమాల్లో నటిస్తున్నట్లున్నారు కదా?
- నేను రవితేజగారితో సమయం గడపడాన్ని చాలా బాగా ఆస్వాదిస్తాను. ఆయన చాలా ఎనర్జిటిక్. అయితే ఆయన చాలా పాజిటివ్, జోవియల్ పర్సన్. మరోసారి ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.
రవితేజ సెట్స్‌లో ఏమైనా సలహాలిచ్చారా?
- రవితేజగారి కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. ఆయన సన్నివేశాలను ఎలివేట్ చేసే సమయంలో నాకు కొన్ని సూచనలు కూడా చేశారు.
తొలిప్రేమలో మీ రోల్ ఏంటి?
- తొలి ప్రేమ గురించి ఇప్పుడే చెప్పడం సరికాదు కానీ.. అందులో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశాను
`టచ్ చేసి చూడు` ఎలాంటి సినిమా?
- ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆయన పోలీస్ ఆఫీసర్ అయినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కుటుంబ కథా చిత్రం. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఇందులో డ్యాన్స్ టీచర్‌గా చేసినట్లున్నారు కదా?
-అవునండీ.. వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ పాత్రలో కనపడతాను. ఓ సీన్‌లో వెస్ట్రన్ డ్యాన్స్ చేయాల్సి ఉండటంతో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసి, ఆ సీన్లో నటించాను. పాత్ర పరంగా బాగానే కష్టపడ్డాను. మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.
తెలుగు డబ్బింగ్ చెప్పుకోలేదా?
- టచ్ చేసి చూడు, తొలిప్రేమ.. ఈ రెండు చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నాను. అయితే డబ్బింగ్ చెప్పడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం సమయం లేదు. అందువల్ల డబ్బింగ్ చెప్పడం లేదు. అయితే తప్పకుండా డబ్బింగ్ చెబుతాను.
నటిగా మీ జర్నీ ఎలా ఉంది?
- గ్లామర్. పెర్ఫామెన్స్ పాత్రలతో కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
బరువు తగ్గుతున్నారు?
- చాలా వరకు సన్నబడ్డాను. అయితే ప్రస్తుతం తమిళం కాస్త బొద్దుగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అందరూ అంటున్నారు. తెలుగువాళ్లు కూడా మరి సన్నబడ్డావు కాస్త లావైతే బావుంటుందని అన్నారు. కానీ నేను స్లిమ్‌గా ఉంటేనే బావుందనిపిస్తుంది.
కాంపీటీషన్ ఎలా ఉంది?
- రకుల్, లావణ్య సహా ప్రస్తుతం రాణిస్తున్న హీరోయిన్స్ అందరూ నాకు మంచి స్నేహితులే. కాబట్టి నేనేం కాంపీటీషన్ ఫీల్ కావడం లేదు. ప్రస్తుతం ఉన్న పోజిషన్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను.