8 February 2018
                            Hyderabad
                          రాశీ ఖన్నా ఈ మధ్య చాలా సన్నగా కనిపిస్తున్నారు. `చాలా తగ్గినట్టున్నారు..` అని అడిగితే `అబ్బే అదేం లేదండీ.. జస్ట్ ఐదు కిలోలే.. అది కూడా `తొలిప్రేమ` సినిమా కోసం` అని చిరునవ్వుతో సమాధానమిస్తున్నారు. ఆమె మూడు వైవిధ్యమైన గెటప్పుల్లో కనిపించిన `తొలి ప్రేమ` ఈ శనివారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు..
                          * `తొలిప్రేమ` టైటిల్ గురించి తెలుసా మీకు?
                            - ఓ.. తెలుసండీ. దాదాపు ఎనిమిది నెలల క్రితం. ఈ సినిమాకు సంతకం చేసే సమయంలో ఆ సినిమా గురించి చాలా విన్నాను. చూశాను. చాలా నచ్చింది. అందులో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఆసమ్.
                          * మీకు ఈ సినిమా ఎందుకు చేయాలనిపించింది?
                            - నన్ను ప్రేమ కథల్లో చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. `ఊహలు గుసగుసలాడే` తర్వాత నేను ప్రాపర్ సినిమా లవ్ స్టోరీ చేయలేకపోయాను. సో ఈ సినిమాలో నాకు ఆ ఫీల్ కనిపించింది. అందులోనూ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలో నటించాను.
                          * మూడు గెటప్పులు ఉంటాయా?
                            - అవునండీ. ఒకటి కాలేజీ ఎపిసోడ్. ఆ తర్వాత లండన్ ఎపిసోడ్. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మరొక ఎపిసోడ్. ఈ మూడు పాత్రల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
                          * సోషల్ మీడియాలో మీ స్పెక్స్ ఫొటో హల్ చల్ చేస్తున్నట్టుంది?
                            - చేస్తోంది. మామూలుగా కాదు. ఒకవైపు నా ఫొటో. మరోవైపు హ్యారీపోటర్ ఫొటో. ఈ రెండూ కలిసి హల్‌చల్ చేస్తున్నాయి. హ్యారీ పోట్టర్ ఫీమేల్ వర్షన్ అని ఒకరంటే, మరొకరు హ్యారీ పోట్టర్ సిస్టర్ అని పిలుస్తున్నారు. చాలా సరదాగా ఉంది.
                          * సోషల్ ప్లాట్‌ఫార్మ్ వల్ల టైమ్ వేస్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా?
                            - ఇందులోకి రాకపూర్వం ఆ అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు సంపూర్ణంగా మారిపోయింది. ఎందుకంటే నేను నా ఫ్యాన్స్ మనసుల్లోని విషయాలను చాలా ఆనందంగా స్వీకరించగలిగిన ప్రదేశం అదొక్కటే. అందుకే అసలు ఆలోచించకుండా సరదాగా పోస్టులు చేస్తుంటాను.
                          
                                  
                                  
                          * ఈ సినిమాలో మీ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది?
                            - `తొలి ప్రేమ`లో కీర్తిరెడ్డిలాగా కాదులెండి. అయినా బానే ఉంటుంది.
                          * ఇప్పటిదాకా మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన ఇంట్రడక్షన్ సీన్ ఏది?
                            - జిల్‌లో. అందులో చాలా బాగా అనిపిస్తుంది.
                          * `తొలిప్రేమ` అంటున్నారు. రొమాంటిక్  సన్నివేశాలను ఎదురుచూడొచ్చా?
                            - ఇందులో నాకు నచ్చిన సన్నివేశం కూడా అలాంటిదే. కారులో ఒక క్యూట్ రొమాంటిక్ సీన్ ఉంటుంది. చాలా బావుంటుంది.
                          * ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టున్నారు?
                            - నిజమేనండీ. బాగానే కష్టపడ్డా. ప్రతి రోజూ గంట జిమ్ చేస్తే ఈ సినిమా కోసం రెండు గంటల పాటు జిమ్ చేశా. వరుణ్, నేను కలిసి 15 రోజులు డైట్ కూడా చేశాం. తను ఎందుకో చెప్పుకోవడం లేదు కానీ యంగ్‌గా కనిపించడానికి తను కూడా చాలా కష్టపడ్డాడు.
                          * దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశారు?
                            - చాలా బాగా చేశారండీ. అతను స్క్రిప్ట్ ని ప్రేమించి రాసుకున్నారు. ప్రతి సీను వింటున్నప్పుడు నాకు తెలిసిపోయింది.
                          * మీ జీవితంలో తొలి ప్రేమ ఉందా?
                            - ఉందండీ. నా 17ఏళ్లప్పుడు నా సీనియర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఒక లెటర్, ఒక రోజ్ ఇచ్చాడు. 
                          * ఇప్పటికీ అతను టచ్‌లో ఉన్నాడా?
                            - లేదండీ. అదంతా ఇన్ ఫాక్చువేషన్ అంతే. 
                          * ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?
                            - తెలుగులో ఓ మంచి ప్రాజెక్ట్ ఇంకో రెండు మూడు రోజుల్లో అనౌన్స్ అవుతుంది. తమిళంలో మూడు సినిమాలున్నాయి. మలయాళంలో ఆల్రెడీ ఒక సినిమా చేశా. అమ్మో.. మలయాళం భాష చాలా కష్టంగా ఉందండీ. తెలుగు, తమిళ్ కాసింత కలిసినట్టుగా సులభంగానే ఉన్నాయి. మలయాళంలో విలన్ కోసం ఓ పాట కూడా పాడా. చాలా కష్టమనిపించింది.
                          * తెలుగులో మరి డబ్బింగ్ చెప్పట్లేదు..
                          - చెప్పాలనే ఉంది. కానీ కుదరడం లేదు. `తొలిప్రేమ`కు చెప్దామనుకున్నా. అంతలో జయం రవి సరసన చేస్తున్న తమిళ సినిమాకు షెడ్యూల్ మొదలైంది. అందుకే చేయలేకపోయా. ఫ్యూచర్‌లో తప్పకుండా చేస్తాను.