8 January 2018
Hyderabad
మెగాపవర్‌స్టార్ రాంచరణ్, కియరా అద్వాని హీరో హీరోయిన్‌గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వినయవిధేయరామ'. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాంచరణ్ సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ....
- సినిమాలో కేవలం యాక్షనే కాదు.. అన్నీ అంశాలుంటాయి. బోయపాటిగారు టైటిల్స్‌లో నాకు 'జయజానకినాయక' అంటే చాలా ఇష్టం. ఈ సినిమా టైటిల్‌ను 'వినయవిధేయరామ' అని చెప్పగానే ఆ టైటిల్‌కు దగ్గరగా ఉందనిపించింది. అంతే కాకుండా కథకు దగ్గరగా ఉండే టైటిల్ ఇది.
- క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఉంటే బావుంటుంది అనిపించేలా డిజైన్ చేశారు. రాముడిలాంటి క్యారెక్టర్‌లో ప్రతి ఆయనలో వినయం, విధ్వంసం ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ వినయం, విధ్వంసం ఉంటాయి.
- ఒక ఆర్టిస్ట్‌గా చేయాలనేదే నా ఆర్టిస్ట్‌గా నా భావన. 80 దశకంలో నాన్నగారు అన్నీ జోనర్ మూవీస్ చేస్తూ వచ్చారు. అలా ఒక జోనర్‌కే పరిమితం కాకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా జోనర్ కంటే సెన్సిబుల్ సినిమాలను కన్విక్షన్ ఉన్న డైరెక్టర్స్‌తో చేయాలనుకుంటున్నాను. బోయపాటిగారిలో ఉన్న కన్విక్షన్, క్లారిటీ ఎంతగానో నచ్చుతుంది.
- మార్చిలో రంగస్థలం విడుదలైన తర్వాత 25 రోజుల్లోనే ఈ సినిమాను స్టార్ట్ చేసేశాం. ఎందుకంటే ఇద్దరికీ వేర్వేరు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ సమయం లేదు.
- ప్రతి సినిమా రంగస్థలంలాగానే రావాలనుకుంటే కష్టమే. కథ విన్నప్పుడు మంచి ఫీల్ కలిగితే.. దర్శకుడు క్లారిటీతో ఉన్నారనిపిస్తే, కచ్చితంగా సినిమా చేయడానికి రెడీ అయిపోతాను.
- భద్ర నుండి ఇప్పటి వరకు బోయపాటిగారి సినిమాలను చూస్తే.. ఆయన సినిమాల్లో ప్రేమ, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. యాక్షన్ ఎలిమెంట్స్ ఆయన బలం. అవి లేకుంటే ఆయన సినిమాలు చూడటం చాలా కష్టం. యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ అంత ఎక్కువగా కనపడదు. సినిమాలోని యాక్షన్ పార్ట్ కూడా కన్విసింగ్‌గా ఉంటుంది. సినిమాలో అన్నీ అంశాలున్నాయి కాబట్టే సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాలో రాంబో లుక్ గురించి రెండేళ్ల క్రితమే బోయపాటిగారు నాకు చెప్పారు. వేరే వాళ్ల ఫేస్‌తో ఆ టాటూస్ ఉన్న ఆ లుక్‌ను డిజైన్ చేసి నాకు చూపించారు. ఆ లుక్ విషయంలో ఆయన పట్టు బట్టి కూర్చున్నారు.
- అజర్ బైజాన్‌లో యాక్షన్ పార్ట్‌ను వేసవిలోనే చేద్దామని అనుకున్నాం కానీ ఆ షెడ్యూల్ వెనక్కి జరిగి జనవరిలో చేయాల్సి వచ్చింది. అంత తక్కువ టెంపరేచర్‌లో షూట్ చేయడం చాలా కష్టమైనా, ఆ జోష్ చేసేశాం.
- ప్రతి సినిమా చేసేటప్పుడు ప్రెజర్ ఉంటుంది. కానీ అదే ఆలోచిస్తూ కూర్చుంటే అందరి డైరెక్టర్స్‌తో సినిమాలను చేయలేం. ప్రస్తుతం బోయపాటిగారు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. ఆయన కష్టపడి రాసుకున్న సబ్జెక్ట్. ఫ్యామిలీ సహా చూడదగ్గ చిత్రంగా భావిస్తున్నాను.
- గ్యాంగ్ లీడర్‌లాంటి సినిమా చేయాలనుకున్నాను కానీ.. ఇది ఆ సినిమా అని నేను అనుకోవడం లేదు.
- సాధారణంగా నేను హీరోగా నటించే సినిమాలకు సంబంధించి విదేశాలకు వెళ్లినప్పుడు నా పర్సనల్ టీంకు ప్యాకెట్‌మనీ ఇస్తుంటాను. ఇక నిర్మాతగా కాబట్టి యూనిట్ అందరికీ ఇవ్వాలి. ఖైదీ నంబర్ 150 సినిమాకు కూడా యూనిట్‌కి ప్యాకెట్ మనీ ఇచ్చాను. అలాగే సైరా సినిమా షూటింగ్‌ను విదేశాల్లో చేస్తున్నప్పుడు ప్యాకెట్ మనీ ఇచ్చాను. ఎందుకంటే అది నా ప్రొడక్షన్ నేను యూనిట్‌ను బాగా చూసుకుంటే అవుట్ పుట్ బాగా వస్తుందనే నమ్మకం.
- అందరం హ్యాపీగా సినిమాలు చేశాం. అన్నీ మంచి సినిమాలు.. నిర్మాతలకు బాగా డబ్బులు వచ్చాయి. అలాంటి సమయంలో కలెక్షన్స్‌ను పెడితే బావుండదనిపించింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు వచ్చి ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవడం అనిపించింది. కలెక్షన్స్‌ను చెప్పడం అనేది చిన్న విషయం దాంట్లో కాంపిటీషన్ ఎందుకు? కాంపీటీషన్ ఉంటే చేసే క్యారెక్టర్స్‌లో, చేసే విధానంలో ఉండాలి. నా సినిమాలకు నిర్మాతలకైతే కలెక్షన్స్ గురించి ఎక్కడా చెప్పకండి అని చెప్పాను. ఒకవేళ్ల వాళ్లు పెడితే వాళ్ల ఇష్టం.. వాళ్ల సినిమా.
- సందర్భాన్ని బట్టి మేం రియాక్ట్ అవుతుంటాం. అలాంటి సందర్భాలేవీ రాకపోతే రియాక్ట్ కాము. నేను, తారక్ ఎప్పటి నుండో కలిసే ఉన్నాం. సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి తెలుస్తుందంతే. మహేష్‌తో ఇప్పుడిప్పుడే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇలా అందరినీ కలుపుకుని పోయే విధానాన్ని నాన్నగారు చెన్నైలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను.
- బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకూ ఉంటుంది. అయితే అది అంత పబ్లిక్‌గా ఉండకూడదని అనుకుంటాను. అందుకనే ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ అకౌంట్‌ను ఓపెన్ చేశాను.
- పెద్ద పెద్ద సినిమాలు చేసేటప్పుడు షెడ్యూల్స్ మారుతుంటాయి. అలా మారడానికి బోలెడు కారణాలుంటాయి. సైరా విషయానికి వస్తే అంతా హ్యాపీగా బడ్జెట్‌లో జరుగుతుంది. టీం అందరూ బాగా కష్టపడుతున్నారు. చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మంచి డేట్ చూసి సినిమాను రిలీజ్ చేస్తాం. ఈ సమ్మర్‌కు విడుదల అనుకున్నాం కానీ కొన్ని కారణాలతో సినిమా ఆలస్యమైంది. కుదిరితే దసరాకు విడుదల చేయవచ్చు.
- చాలా రోజుల తర్వాత మనందరికీ ఇష్టమైన ప్రశాంత్‌గారు మంచి రోల్ చేశారు. అలాగే ఆర్యన్ రాజేష్‌ను ఇన్ని రోజులు మిస్ చేశాం. ఆయన్ను ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇక స్నేహగారితో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. 'రక్తచరిత్ర' చేసిన వివేక్ ఒబెరాయ్‌గారైతే మా సినిమాకు పక్కా సరిపోతారనిపించి ఆయన్ను అడిగితే ఆయన చేశారు. ఇలా ఒక మంచి టీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది.
- దానయ్యగారు పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. డైరెక్టర్స్‌తో డిస్కస్ చేసి రంగంలోకి దిగి తర్వాత ఏమైనా బడ్జెట్‌ను దాటి అవసరమైనా ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తారు. గట్సీ ప్రొడ్యూసర్ ఆయన. కొరటాల శివగారి సినిమా తర్వాత త్రివిక్రమ్‌గారి సినిమా ఉంటుంది. వినయవిధేయరామ తర్వాత నేను, కొరటాలగారితో చేయాల్సింది. అయితే 'ఆర్ ఆర్ ఆర్' వల్ల కొరటాలగారు నాన్నగారితో చేస్తున్నారు.
- 'ఆర్ ఆర్ ఆర్' తొలి షెడ్యూల్ అయిపోయింది. అంతా బావుంది. నాకు, తారక్‌కు బయట మంచి స్నేహం ఉండటం వల్ల సెట్‌లో ఈజీగా అనిపించింది. సంక్రాంతి తర్వాత సెకండ్ షెడ్యూల్ ఉంటుంది. ఇలాంటి ఓ మంచి ఆఫర్ వచ్చినందుకు నేను, తారక్ షాకయ్యాం. రాజమౌళిగారు తప్పకుండా జస్టిఫికేషన్ ఇస్తారనుకుంటున్నాను. నాకు, తారక్ కంటే ఆయనకే ఎక్కువ పని. మా ఇద్దరి ఫ్యాన్స్, రాజమౌళిగారి సినిమాలకున్న ఫ్యాన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేస్తారని అనుకుంటున్నాను. కథను బట్టే రాజమౌళిగారు నన్ను, తారక్‌ను ఈ సినిమా కోసం కలిసి కథ చెప్పారు. అంతే తప్ప ఆయన స్టార్స్ దొరికారు కదా అని ఆ తర్వాత కథ అల్లే టైప్ కాదు. అలాగే రాజమౌళిగారి సినిమాకు టైం లిమిట్ పెట్టుకోలేం. అలా ఉంటే ఆయన పనిచేయలేరు. పూర్తి న్యాయం చేయకుండా మేం ఉండలేం.
- 'మిర్చి' తర్వాత నుండి శివగారితో సినిమా చేయాలనుకుంటున్నాను. నాతో పనిచేస్తామని వచ్చిన ఆయనకు నాన్నగారు దొరికారు. నాన్నగారి సినిమా తర్వాత కొరటాలగారితో నా సినిమా డెఫనెట్‌గా ఉంటుంది.
- నేను డైట్ చేస్తే పనిచేయలేను. ఏదో డైరెక్టర్స్ అడిగితే ఆ సీన్ కోసం కాస్త అగుతాను. కానీ ఆ సీన్ పూర్తి కాగానే శుభ్రంగా తింటాను.
- ప్రస్తుతం తెలుగుతో హ్యాపీగా ఉన్నాను. బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. నా నిర్మాణంలో చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని కూడా దక్షిణాదినే విడుదల చేయాలనకుంటున్నాను. బాలీవుడ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఎక్కువ ఆశ పడటం లేదు.
|