pizza
Rashmika Mandanna interview (Telugu) about Devadas
నాగార్జున‌తో రెండు రోజులు ప‌నిచేశా - ర‌ష్మిక‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 September 2018
Hyderabad

ర‌ష్మిక చూడ్డానికి అమాయ‌కంగా అనిపిస్తుంది. కానీ నిలిచి నిదానంగా ప‌నులు చేస్తుంది. తొలి సినిమా చ‌లో, రెండోసినిమా గీత‌గోవిందం ఆమెకు హిట్లే. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో చిత్రం నాని ప‌క్క‌న చేసింది. `దేవ‌దాస్‌`తో హ్యాట్రిక్ కొట్టాల‌ని అనుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఆమె శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు...

* `దేవ‌దాస్` గురించి చెప్పండి?
- ఈ సినిమాలో నా పేరు పూజ‌. ప‌క్కింట‌మ్మాయిలా క‌నిపిస్తాను. సినిమాను అంద‌రూ చూసిన త‌ర్వాత నేను నా పాత్ర గురించి బాగా చెప్తాను.

* సినిమాను అంగీక‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మేంటి?
- నాకు నా పాత్ర న‌చ్చింది. ఇది మ‌ల్టీస్టార‌ర్ అయిన‌ప్ప‌టికీ ఇందులో నా పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో నాగ్‌సార్‌, నాని సార్ బ్రోమాన్స్ చాలా బావుంటుంది. నేనే దానికి ఫిదా అయ్యా. అంత బావుంది.

* మీ గ‌త చిత్రానికీ, ఈ సినిమాకూ ఉన్న వ్య‌త్యాసం ఏంటి?

- వ్య‌త్యాసం ఉంది. నేను చేసిన అన్ని సినిమాల్లోనూ కామెడీ ఉంది. కానీ ఇందులో స్టోరీ ప్ర‌ధానం. ఇద్ద‌రు హీరోలు, వాళ్ల ప‌ర్స‌న‌ల్ స్టోరీలు, వాళ్ల పేర‌ల‌ల్ స్టోరీలు, దాంతో పాటు వాళ్ల జోడీల‌కు సంబంధించిన స్టోరీలు ఉంటాయి.

* గీతాగోవిందంలో మీ పాత్ర హీరోతో స‌మానంగా ఉంటుంది. మ‌రి ఇందులో..

- ఇందులో దేవ‌కి, దాసుకి ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటుంది. ఇందులో మాది కేర‌క్ట‌ర్‌గానే ఉంటుంది. డిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్‌.

* నాగార్జున‌, నానితో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- నాగ్ సార్‌తో చాలా త‌క్కువ రోజులు ప‌నిచేశా. లెక్కేస్తే రెండే రోజుల‌న్న‌మాట‌. అయితే ఆయ‌న సెట్లో ఉన్నంత సేపు న‌వ్వుతూనే ఉండేవాళ్లం. అంత హ్యాపీ ప‌ర్స‌న్ ఆయ‌న‌. నానిగారితో ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నేర్చుకున్నా. డైలాగుల్లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చ‌ని ఆయ‌న ఆలోచిస్తూనే ఉంటారు. నాకు ఏమైనా సాయం కావాలంటే నేను నానిగారిని అడిగేదాన్ని. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌, కెమెరామేన్ శ్యామ్‌గారిని ప్ర‌తి సీన్ అయ్యాక వెళ్లి క‌లిసి `మీకు న‌చ్చిందా? బాగా చేశానా?` అని అడిగేదాన్ని.

* ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుందా?
- అవునండీ. మీరే చెప్పాలి. సినిమా చూశాక అంద‌రూ చెప్తే చాలా ఆనందంగా స్వీక‌రిస్తా.

* గీత గోవిందం త‌ర్వాత పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకునే ప‌ద్ధ‌తిలో ఏమైనా మార్పులొచ్చాయా?
- పాత్ర విష‌యంలో ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉన్నాను కాబ‌ట్టే నాకు `గీత గోవిందం` వ‌చ్చింది. `ఛ‌లో` త‌ర్వాతే నేను కేర‌క్ట‌ర్ విష‌యంలో ప‌ర్టిక్యుల‌ర్‌గా ఉన్నా. ఎందుకంటే నాకు పాత్ర న‌చ్చాల‌న్న‌ది అప్ప‌టి నుంచే నేను పెట్టుకున్న నియ‌మం. ఎందుకంటే వ‌ర్స‌టైల్గా ఉండాలని నేను ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా.

* డియ‌ర్ కామ్రేడ్‌లో క్రికెట‌ర్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు?
- హైద‌రాబాద్‌లో క్రికెట్ నేర్చుకున్నా. కొన్నాళ్లు షూటింగ్ చేశా. నా కాలికి దెబ్బ‌త‌గిలింది. అలాగే స్కిన్ ఇష్యూస్ కూడా వ‌చ్చాయి. అందులో కాస్త గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు మ‌ర‌లా వెళ్తాను.

* మీ ఎంగేజ్‌మెంట్ గురించి చాలా విష‌యాలు వ‌స్తున్నాయి...
- ఒక్క‌దాన్నే అమ్మాయిని ఉన్నాన‌ని అంద‌రూ అడ‌గాల‌ని అనుకుంటున్నారా? (న‌వ్వులు). నిజంగా చెప్పాలంటే నేను ఫిజిక‌ల్‌గా, మెంట‌ల్‌గా స్ట్రాంగ్‌. ఇదే విష‌యాన్ని రెండు నెల‌లకు ముందు అడిగితే `అయ్యో సార్‌.. అలాంటిదేమీ లేదండీ సార్‌` అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నేను నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడ‌ను. స్వ‌ప్న మేడ‌మ్ న‌న్ను దాని గురించి చెప్తే తిడుతారు.

interview gallery* లేదు.. దాని గురించి క్లారిటీ ఇవ్వండి?
- ఆడియ‌న్స్ తో నేను ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ట్విట్ట‌ర్ ఉంది. ఫేస్‌బుక్ ఉంది. చాలా మంది అభిమానులు న‌న్ను ఫాలో అవుతున్నారు. నాకు అందులో అకౌంట్స్ కూడా ఉన్నాయి. దానిలో చెప్తాను. అలా కాకుండా సినిమా ప్ర‌మోష‌న్‌లో ఉన్న‌ప్పుడు వాటి గురించి ఎందుకు?

* స‌రే.. మీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడ‌టం ఇష్టం లేక‌పోతే వ‌దిలేద్దాం.. వైజ‌యంతీలో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- వైజ‌యంతీ సినిమాలో ప్రాజెక్ట్ వ‌స్తుంద‌ని తెలియ‌గానే అంత పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లోనా అని కాస్త డీ మోటివేట్ అయ్యాను. ఓ మీటింగ్ అయ్యాక స్వ‌ప్నాని, ద‌ర్శ‌కుడు ఆదిని క‌లిశాను. వాళ్లు నా పాత్ర గురించి చెప్పారు. పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి వ‌చ్చే సినిమాలంటే ఆస‌క్తి ఉంటుంది. కాక‌పోతే చిన్న ఆడిష‌న్ జ‌రిగింది. ద‌ర్శ‌కుడు శాటిస్‌ఫై అయి నాకు ఫోన్ చేసి కాల్షీట్ గురించి మాట్లాడారు.

* క‌థంతా చెప్పారా? మీ పాత్ర వ‌ర‌కే చెప్పారా?
- ముందు నా పాత్ర గురించే చెప్పారు. ఆ త‌ర్వాతే నాకు సీన్ల‌న్నీ చెప్పారు.

* ఇందులో నిజంగానే సీక్వెల్‌కి ఛాన్స్ ఉందా?
- న‌వ్వులు

* మీరు డ‌బ్బింగ్ చెప్పారా?
- నేనే చెప్పానండీ.

* గీత గోవిందం అంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అనుకున్నారా?
- అలా అనుకోలేం అండీ. అస‌లు నేను మోనిట‌రే చూడ‌ను. కేవ‌లం వెళ్లి ద‌ర్శ‌కుడిని, హీరోని, కెమెరామేన్‌ని అడుగుతా అంతే. అంతేగానీ మోనిట‌ర్ చూసి ఇంప్ర‌వైజేష‌న్స్ చేయొచ్చు. చేస్తాను. కానీ నాకు మిగిలిన‌వి న‌చ్చ‌వు.

* నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నార‌ట క‌దా?
- ఇంకా డిస్క‌ష‌న్స్ లోనే ఉంది. అలాంటివ‌న్నీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ అనౌన్స్ చేస్తే బావుంటుంది.

* త‌మిళ్‌లో రోల్స్ వ‌చ్చాయా?
- వ‌చ్చాయి. కానీ నేను దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నా. ఇప్పుడు డెబ్యుటెంట్‌గా వెళ్లాలంటే అక్క‌డి ఎక్స్ పెక్టేష‌న్స్ ని రీచ్ కావాలి. దాని గురించే ఇంకా ఆలోచిస్తున్నా. నేను ఓ కేర‌క్ట‌ర్ ఒప్పుకొని చేస్తే.. దాన్ని చూసి అంద‌రూ హ్యాపీగా ఫీల‌వ్వాలి. క‌న్న‌డ‌లో ఓ సినిమా చేస్తున్నా. `య‌జ‌మాన‌` విడుద‌ల‌య్యాక నేను క‌న్న‌డ‌లోనూ, `డియ‌ర్ కామ్రేడ్‌` విడుద‌ల‌య్యాక తెలుగులోనూ సినిమాలు సంత‌కం చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved