25 August 2016
Hyderabad
నారారోహిత్, నాగశౌర్య, రెజీనా హీరో హీరోయిన్లుగా వారాహిచలనచిత్రం బ్యానర్‌పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'జ్యోఅచ్యుతానంద'. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 9న విడుదలవుతుంది ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వ్యూ....
క్యారెక్టర్ గురించి.....
- ఇందులో రెగ్యులర్ అమ్మాయి జో పాత్రలో కనపడతాను. కాబట్టి సినిమా చూసేటప్పుడు అమ్మాయిలందరూ కనెక్ట్ అవుతారు.
మంచి ఎక్స్‌పీరియెన్స్.....
- జ్యో అచ్యుతానంద సినిమా నటిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇంతకు ముందు నటించిన సినిమాల కన్నా మంచి ఎక్స్‌పీరియన్స్ మూవీగా ఫీలవుతున్నాను.
దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్...
- శ్రీనివాస్ అవసరాల మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇప్పటి పరిశ్రమకు ఆయన లాంటి దర్శకులు చాలా అవసరం. ఆయనతో పనిచేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మన నుండి ఆయనకు ఏమి కావాలో చాలా ఈజీగా రాబట్టుకుంటారు.
నాగ శౌర్య, నారా రోహిత్ లతో బాండింగ్ ఎలా కుదిరింది?
- నారా రోహిత్, నాగశౌర్యలిద్దరూ మంచి యాక్టర్స్ ఇప్పుడు రిలీజ్ కానున్న 'శంకర'లో నారా రోహిత్ కలిసి వర్క్ చేశాను. మంచి కోస్టార్. నటన పరంగా కొన్ని సూచనలు కూడా చేశాడు. అలాగే నాగశౌర్యతో వర్క్ కూల్‌గా సాగిపోయింది.
తమిళంలా ఇక్కడ కూడా...
- శంకర సినిమాను తెలుగులో చేసి చాలా రోజులైంది. ఇప్పుడు రిలీజవుతుంది. ఈ సినిమా తమిళ సినిమా మౌనగురుకు రీమేక్‌గా రూపొందింది. తమిళంలో పెద్ద సక్సెస్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ సాధిస్తుంది.
అమితాబ్‌గారితో పనిచేయడం అదృష్టం...
- అమితాబ్ వంటి సూపర్‌స్టార్‌తో వర్క్ చేయడం నా లక్‌గా భావిస్తున్నాను. అలాంటి గొప్ప యాక్టర్‌తో ఎలా చేస్తామో ఏమో అనుకుని ముందు భయపడ్డాను. అయితే ఆయన గొప్ప నటుడే కాక మంచి మనిషి కూడా. ఆయన నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. హీరోయిన్ నేనేనని అందరికీ ఆయనే పరిచయం చేశారు.
శీనివాస్ అవసరాలతో చేయడం లేదు..
- లేదు ఆ సినిమా చెయ్యట్లేదు. ఫస్ట్ 'హంటర్' సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ అది వర్కవుట్ కాలేదు.