
19 December
Hyderabad
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'. హను రాఘవపూడి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. డిసెంబర్ 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ ..
- ఇటు తెలుగు, అటు తమిళ్‌లో రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. రెండు సినిమాలను ముందు నుండి సమాంతరంగా షూట్ చేస్తూ వస్తున్నాం. అలాగే రిలీజ్ కూడా ఒకేసారి అయ్యింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది.
- మనం ఏదీ చేసిన మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితాన్ని ఆ దేవుడికే ఇవ్వాలి. ఆయన ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించాలి కదా. నటిగా రెండు సినిమాల నుండి ఫీడ్ బ్యాక్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఏదీ జరిగినా మన మంచిదే అని ఫీలవుతాను.
- నటన నేర్చుకుని నేను సినిమాల్లోకి రాలేదు. వైశాలి అనే క్యారెక్టర్ ఎలా అబ్బాయిని ఇష్టపడుతుంది .. ఏమవుతుందనేదే కథ. నేను, శర్వా ఆ క్యారెక్టర్స్‌ను ఫీలై చేశాం. నటనలో ఇద్దరికీ ఫీలింగ్ ఉంటేనే అది తెరపై కనపడుతుంది. నేను ఎవరినీ డామినేట్ చేయను. డామినేట్ చేస్తానని ఎవరూ చెబుతున్నారో తెలియడం లేదు.
- శర్వానంద్ పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను సీనియర్, హీరోయిన్ జూనియర్.. మొన్ననే వచ్చింది కదా!, అనే ఫీలింగ్ తనకు ఉండదు. నాకు కంఫర్ట్ ఇచ్చారు శర్వా. నేను, తను మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరికీ ఈగోలు లేవు. మేం ఎక్కడా ఇబ్బంది పడలేదు.
- ఈ సినిమాలో మెడికోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పర్టికులర్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నాకు రెండేళ్ల ముందు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.
- నా అనుభవాలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. అలాంటి అనుభవాలను మరచిపోతే ఎలా? కాబట్టి అనుభవాలను మరచిపోకూడదనుకుంటాను. అలా మరచిపోతానేమో అనే భయం ఉంది.