pizza
Samantha interview (Telugu) about U Turn
ఒకేసారి ఇద్ద‌రం పోటీ ప‌డ‌తామ‌ని అనుకోలేదు - స‌మంత
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2018
Hyderabad

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ..
స్క్రిప్ట్ గురించి ముందే తెలుసు...
- `లూసియా` సినిమా నుండి డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ నాకు బాగా తెలుసు. మంచి స్క్రిప్ట్ ఉంటే నేను న‌టిస్తాన‌ని కూడా చెప్పాను. కానీ త‌ను మ‌ర‌చిపోయి యు ట‌ర్న్ సినిమాను క‌న్న‌డలో క‌మిట్ అయిపోయారు. ఆ విష‌యం నేను అడిగాను కూడా. `యు ట‌ర్న్‌` సినిమా స్క్రిప్ట్ ద‌శ నుండే నాకు బాగా తెలుసు. కాబ‌ట్టి.. క‌న్న‌డంలో సినిమా రిలీజై స‌క్సెస్ అయిన త‌ర్వాత తెలుగు, త‌మిళంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను.

అందుకే రీమేక్‌కి స‌మ‌యం ప‌ట్టింది..
- ఈ సినిమాలో నా హెయిర్ స్ట‌యిల్ ఎంతో మార్చాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దాంతో అంత‌కు ముందున్న క‌మిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసిన త‌ర్వాత యు ట‌ర్న్‌ను తెలుగు, త‌మిళంలో రీమేక్ చేయ‌డానికి రెడీ అయ్యాను. అందుకే రీమేక్‌కి స‌మ‌యం ప‌ట్టింది. సినిమా మాతృక‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మాత్ర‌మే చేశాం. చివ‌రి 20 నిమిషాలు సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది.

పోటీని ఊహించ‌లేదు...
- చైతు సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. దాంతో వాళ్లు రెండు వారాలు గ్యాప్ తీసుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అదే సెప్టెంబ‌ర్ 13.. మేం ముందు నుండే సెప్టెంబ‌ర్ 13న సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే నేను, చైత‌న్య పోటీ ప‌డ‌తామ‌ని అనుకోలేదు.

త‌న స‌క్సెస్ నాకు ముఖ్యం...
- మా రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల‌వుతుంటే చిన్న‌పాటి టెన్ష‌న్ ఉన్న‌మాట వాస్త‌వ‌మే. అయితే... ఎంతైనా నా భ‌ర్త‌గా చైత‌న్య స‌క్సెస్‌ను నేను కోరుకుంటాను. త‌న స‌క్సెస్ త‌ర్వాతే నాకు అన్నీ.

చైత‌న్య స‌పోర్ట్‌...
- ఒక‌ప్ప‌టితో పోల్చితే నాకు ఇప్పుడు బ‌లం ఇంకా పెరిగింది. పెద్దింటి స‌పోర్ట్ దొరికింది. చైత‌న్య నాకు అండ‌గా నిల‌బ‌డుతున్నాడు.

interview gallery



సినిమాల‌ను నిర్మిస్తా...
- నేను సినిమాల్లో న‌టిస్తూ సినిమాలను నిర్మించ‌లేను. అయితే నేను సినిమాల‌కు నిర్మాత‌గా మారుతాను. కానీ అందుకు ఇంకా స‌మ‌యం ఉంది. ఫ్యూచ‌ర్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను నిర్మిస్తాను.

మారుతిగారి స్ట‌యిల్లో...
- నేను చైత‌న్య నటించిన `శైల‌జారెడ్డి అల్లుడు` సినిమా చూశాను. మారుతిగారి స్ట‌యిల్లో ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. త‌ప్ప‌కుండా అందరికీ న‌చ్చేలా ఉంటుంది.

నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నా...
- ఈ సినిమాలో నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాను. చిన్మ‌యిని కాద‌ని డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమి లేదు కానీ.. త‌మిళంలో నా పాత్ర‌ల‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగులో కూడా డ‌బ్బింగ్ చెప్పుకుని ఓ కంప్లీట్ యాక్ట‌ర్ అనిపించుకోవాల‌ని ఉద్దేశ‌మే.

త‌దుప‌రి చిత్రాలు..
- చైత‌న్య‌తో క‌లిసి శివ నిర్వాణ సినిమాలో న‌టించ‌బోతున్నాను. అలాగే మ‌రో సినిమా కూడా ఓకే అయ్యింది. త్వ‌ర‌లోనే దాని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved