pizza
Sankalp interview (Telugu) about Antariksham 9000 KMPH
ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్‌ అయితే లాజిక్స్‌ వెతకరు - సంకల్ప్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 December
Hyderabad

వరుణ్‌తేజ్‌, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్‌'. సంకల్ప్‌ దర్శకుడు. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వై.రాజీవ్‌ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్‌ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంకల్ప్‌తో ఇంటర్వ్యూ విశేషాలు...

- 'ఘాజి' సినిమా విడుదలైన మూడు నెలలు తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. వైజాగ్‌లో 'ఘాజి' సబ్‌మెరైన్‌ను చూసిన తర్వాత సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అలాగే పేపర్‌లో ఓ ఆర్టికల్‌ చదివిన తర్వాత స్పేస్‌లో మూవీ చేయాలనే ఆలోచన కలిగింది.

- హాలీవుడ్‌ మూవీ గ్రావిటీ.. తమిళంలో వచ్చిన టిక్‌ టిక్‌ టిక్‌..ఇలా ఏ సినిమాకు మా అంతరిక్షం సంబంధం ఉండదు. ఏవో సినిమాలను చూసి ఇన్‌స్పైర్‌ అయిపోయి సినిమాలు చేయాలనుకునే వ్యక్తిని కాను నేను.

- నా దగ్గర ఐడియాస్‌ లేనప్పుడు ఫార్ములా కమర్షియల్‌ సినిమాపైనే ఆధారపడుతానేమో.

- ఘాజి సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ మే 1కి వచ్చింది. మే 2, 3 తేదీల్లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఎనిమిది నెలల్లో సినిమా ఫస్ట్‌ కాపీని రెడీ చేసేశాం. సినిమాలో 1500 సీజీ షాట్స్‌ ఉన్నాయి. 70 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. అందులో 40 రోజుల పాటు జీరో గ్రావిటీ ఎన్‌ర్వాన్‌మెంట్‌లో షూట్‌ చేశాం.

- 'ఘాజి' సినిమాకు ఎలా రీసెర్చ్‌ చేశానో, ఈ సినిమాకు కూడా అలాగే రీసెర్స్‌ చేశాను. దాదాపు మెటీరియల్‌లో ఎక్కువ శాతం నెట్‌ నుండి తీసుకున్నదే. అలాగే బెంగళూరుకి చెందిన ఓ సైంటిస్ట్‌ను ఇస్రోలో కలుసుకున్నాం. లాజికల్‌గా 100 శాతం చేయకపోయినా వీలైనంత మేర లాజికల్‌గా సినిమా చేశాం. ఉదాహరణకు ఘాజి సినిమాలో సబ్‌మెరైన్‌ నీళ్లలో క్రిందకి, పైకి పోయేలా చూపెట్టాం. కానీ నిజానికి సబ్‌మెరైన్‌ అలా క్రిందకు, పైకి పోదు. కొన్ని చోట్ల సినిమాటిక్‌ లిబర్టి తీసుకున్నాం.

- ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్‌ అయితే లాజిక్స్‌ వెతకరు. అలా కాకుండా బోరింగ్‌ సినిమా అనుకోండి.. కచ్చితంగా లాజిక్స్‌ వెతుకుతారు.

- ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసే సమయంలో నేను ఎగ్జయిట్‌మెంట్‌ను ఫీల్‌ అవుతాను. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అప్పుడే ప్రిపేర్‌ చేసుకుంటూ ఉంటాను.

- సినిమాను వీలైనంత త్వరగానే పూర్తి చేశాను. దీన్ని ఎన్ని సంవత్సరాలైనా చేయాలంటే చేయవచ్చు. కాస్త సమయం తీసుకుని ఉండుంటే ఇంకా బెటర్‌గా చేసుండే వాడినేమో. కానీ సమయం ఎక్కువగా తీసుకోలేదు. నిర్మాతలకు కొన్ని లిమిటేషన్స్‌ ఉంటాయి. అందులో సినిమాను పూర్తి చేసివ్వాలి.

'ఘాజి' సినిమా విడుదలైన రెండు, మూడు నెలల వరకు ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఏం ఆలోచించలేదు. మైథాలజీ సినిమా చేద్దామా? అని ఆలోచించాను. ఆ సమయంలోనే పేపర్‌లో అంతరిక్షానికి సంబంధించిన ఆర్టికల్‌ చదివాను. దానిపై రీసెర్చ్‌ చేసి కథను తయారు చేసుకున్నాను.

- చిన్న సినిమాలకు ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తామో.. పెద్ద సినిమాలకు కూడా అంతే హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను పెద్ద సినిమాలు చేయాలనే ఆలోచిస్తాను.

interview gallery



- ఈ సినిమాలో దేవ్‌ అనే క్యారెక్టర్‌లో ఎవరైతే బావుంటుందని అనుకునేటప్పుడు వరుణ్‌తేజ్‌ అయితేనే కరెక్ట్‌ అనిపించింది. ముందుగా నేను వరుణ్‌కి ఓ ఫోటో చూపించాను. రెండు లైన్స్‌ కథ వినిపించాను. తర్వాత నాలుగు నెలలకు పూర్తి కథను వినిపించాను.

- 'ఘాజి'లో లవ్‌స్టోరి మాత్రం లేకుండా చేశాం. కానీ సినిమాలో లవ్‌స్టోరీ, దేశభక్తి అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి.

- షూటింగ్‌ సమయంలో నేను, జ్ఞానశేఖర్‌గారు మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. వీలైనంత కామ్‌గా సెట్‌ ఉండేలా చూసుకున్నాను. నటీనటులు 40 రోజుల పాటు రోప్స్‌తో అలా వ్రేలాడుతూ ఉన్నారు. షూటింగ్‌ డిలే కాకుండా స్టోరీ బోర్డ్‌ సహా అన్నింటి పరంగా క్లారిటీ ఇచ్చేశాను.

- స్క్రిప్ట్‌ లెవల్లో, ప్రీ ప్రొడక్షన్‌ సమయంలో నాకు క్రిష్‌గారు హెల్ప్‌ చేశారు.

- షూటింగ్‌ సమయంలో నేను ఎలాంటి చాలెంజెస్‌ ఫేస్‌ చేయలేదు. కానీ ఆర్టిస్టులు చాలెంజింగ్‌గా ఫీలయ్యారు.

- 'రంగస్థలం' సినిమా చూసిన తర్వాతే ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనికలను అప్రోచ్‌ అయ్యాను.

- బాలీవుడ్‌లో రెండు ఆఫర్స్‌ ఉన్నాయి. వాటిని చేయాలి. టెంపరరీగా తెలుగు సినిమాల నుండి బాలీవుడ్‌కి వెళుతున్నాను. నిర్మాతలకు కథ చెప్పాను. అక్కడ వెళితే రెండేళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుంది. మరి ఆలస్యం అయితే ఇక్కడే సినిమా చేసేయాలనుకుంటున్నాను. 'అంతరిక్షం 2' అని అనుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved