
26 December
Hyderabad
శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక క ష్ణప్రసాద్ సమర్పణలో, అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాతగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'చతురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని గోపీ గణేష్ పట్టాబి దర్శకత్వంలో.. తెలుగులో రూపొందిన చిత్రం 'బ్లఫ్ మాస్టర్'. 'జ్యోతిలక్ష్మీ', 'ఘాజి' చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌తో ఇంటర్వ్యూ.
ఈ సినిమాలోక్యారెక్టర్...
- ఈ సినిమాలో నాది టైటిల్‌కి తగ్గట్టే 'బ్లఫ్ మాస్టర్' క్యారెక్టర్ చేశాను. నా అసలు పేరు ఆకాష్ విహారి. కానీ వివిధ రకాల పేర్లతో వివిధ రకాల గెటప్స్‌లో కనిపిస్తూ మనుషుల్ని మోసం చేసే క్యారెక్టర్. ఈ కథ వినగానే నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. నటుడిగా నన్ను చేసే ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఈ సినిమా చేశాను. అలాగే ఈ సినిమాలో ఆదిత్య మీనన్‌గారు నెగిటివ్ రోల్‌లో చాలా అద్భుతంగా నటించారు. అలాగే పృధ్వీగారు ఒక కీలకమైన క్యారెక్టర్ పోషించారు. ఫస్టాఫ్‌లో వివిధ రకాల క్యారెక్టర్స్‌తో మోసం చేసే హీరో హీరోయిన్ పరిచయంతో గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకలా ఎలా మారాడనేది చిత్రం కాన్సెప్ట్. సెకండాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
దర్శకుడు గోపీగణేష్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్...
- దర్శకుడు గోపి నాకు చాలా కాలం నుండి మంచి స్నేహితుడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని మొదటి నుండి నన్ను నమ్మిన వ్యక్తి. అలాగే ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నేను 'గువ్వా గోరింక' సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నన్ను ఒప్పించి ట్రైలర్ వెర్షన్‌ను షూట్ చేసారు. ఆయనకు సినిమా తప్ప ఇంకో ప్రపంచం తెలీదు. ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే దానికి కారణం గోపిగారే.
నందితా శ్వేతతో గురించి...
- ఈ సినిమాలో నందిత అమాయకమైన పాజిటివ్ భావజాలాలు కలిగిన అమ్మాయి లా అద్భుతంగా నటించింది. నా పేరు ఆకాష్. తన పేరు అవని అంటే.. ఆకాశం, భూమి అని అర్ధం వచ్చేలా గోపిగారు ఆ పేర్లను పెట్టడం జరిగింది. ఈ సినిమాకు మా ఇద్దరి కెమిస్ట్రీ మంచి అసెట్‌గా నిలుస్తుంది.
ప్రొడ్యూసర్స్ గురించి...
- అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లైగారు ఈ సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సినిమా బాగా రావడానికి చాలా కేరింగ్ తీసుకున్నారు. ప్రొడక్షన్‌లో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీదేవి మూవీస్ అధినేత క ష్ణప్రసాద్‌గారు చాలా టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ అని అందరికి తెలిసిందే. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన క ష్ణప్రసాద్‌గారు మా సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన కారణంగానే చాలా మంది పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు. థియేటర్ల సంఖ్య కూడా పెరగడం చాలా హ్యాపీ.
తదుపరి చిత్రాలు...
- 'గువ్వా గోరింక', '47 డేస్', వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే హిందీలో టెర్రరిజం నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాను...
|