pizza
Sharwanand interview (Telugu) about Padi Padi Leche Manasu
ఎవ‌రి స్పేస్ వారికుంది - శ‌ర్వానంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

19 December
Hyderabad

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'. చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. హను రాఘవపూడి దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌ మీడియాతో మాట్లాడుతూ...

- కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో చూడాలని ఉంది, ఖుషి, లక్ష్మి సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్‌ అయ్యాయి. ఈ మధ్య కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రాలేదు. సెంటిమెంట్‌గా చూస్తే కూడా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు హిట్‌ అయ్యాయి.

- సాధారణంగా లవ్‌స్టోరీ అంటే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఏమైంది? అనేదే కాన్సెప్ట్‌గా ఉంటుంది. సాధారణంగా కోల్‌కత్తా అంటే హౌరా బ్రిడ్జ్‌, కాళిమాత గుడి గుర్తుకు వస్తాయి. అయితే ఇంటీరియర్‌గా కోల్‌కత్తాను ప్రాపర్‌గా యూరోపియన్‌ స్టైల్లో చూపించాలనుకున్నాం. అలా చూపిస్తే ఆడియెన్స్‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ వస్తుందని భావించాం. అంతే తప్ప అక్కడే చేయాలనేం అనుకోలేదు.

- పడి పడి లేచె మనసు అనే టైటిల్‌ వినగానే పొయెటిక్‌గా ఉంటుందనేం అనుకోలేదు. ప్రేమకథ కాబట్టి అందరికీ కనెక్ట్‌ అవుతుందనుకునే ఈ టైటిల్‌ను పెట్టాం.

- మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు దీనికి చాలా తేడా ఉంది. ఆ సినిమాలో కంటెంట్‌ ఓల్డర్‌ కనెక్టింగ్‌ కాన్సెప్ట్‌ ఉంటుంది. ఈ సినిమాలో యూత్‌, ఫ్యామిలీకి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. స్క్రిప్ట్‌ వైజ్‌, ఎమోషన్స్‌ వైజ్‌ రెండు వేర్వేరు సినిమాలు. ప్రేమకథా చిత్రాల్లో ప్రేమ అనేది మెయిన్‌గా ఉన్నా.. దాన్ని పాత్రల ప్రకారం ఎలా డీల్‌ చేశామనేదే ముఖ్యం.

- నాకు తెలిసి ఓ అబ్బాయి, అమ్మాయి కోసం విచిత్రంగా ఈ సినిమాలో చేసినట్లు ప్రపోజ్‌ చేసి ఉండడు. ఎన్నిసార్లు ప్రపోజ్‌ చేశాడు, ఎన్నిసార్లు పడేశాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

- హను మంచి టెక్నీషియన్‌. తనను అందరూ జూనియర్‌ సుకుమార్‌ అని అంటుంటారు. టెక్నికల్‌గా తను చాలా స్ట్రాంగ్‌. ఓ మంచి టెక్నీషియన్‌గా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనేది నా ఫీలింగ్‌. పదిహేనేళ్లుగా నాకు తను మంచి ఫ్రెండ్‌. నాతో సినిమా చేయమని ఎప్పటి నుండో అడుగుతున్నాను. సుధాకర్‌గారితో సినిమా చేయాలనుకోగానే ఎవరైతే బావుంటుందని ఆలోచించాం. హను అయితే బావుంటుందని అనుకున్నాం. తను మూడు యాక్షన్‌ సినిమాల కథలు చెప్పాడు. అవేం వద్దని లవ్‌ సినిమా చేసి పెట్టమని అన్నాను.

- నేను సాయిపల్లవిని డామినేట్‌ చేసినా, సాయిపల్లవి నన్ను డామినేట్‌ చేసినా లవ్‌స్టోరీలో బ్యూటీ కనిపించదు. ఒకరినొకరు అప్రిషియేట్‌ చేసుకుంటూ పొతేనే బ్యూటీఫుల్‌ కెమిస్ట్రీ పండుతుంది. తను ఫెంటాస్టిక్‌ ఆర్టిస్ట్‌. తను గిఫ్టెడ్‌ అనుకోవాలేమో. తనతో చేసేటప్పుడు కంఫర్ట్‌గా ఫీలయ్యాను. మా మధ్య కెమిస్ట్రీయే సినిమాకు హైలైట్‌.

- సూర్య అనే పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్‌ చేసుకోలేదు. సూర్య అనే పాత్ర ఎనర్జిటిక్‌గా, స్పాంటేనియస్‌గా ఉంటాడని హను చెప్పాడు. ఓసారి స్క్రిప్ట్‌ రీడింగ్‌ అయిపోయిన తర్వాత మళ్లీ నేను పేపర్స్‌ చూడలేదు. హను ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోయాను.

- ఇప్పుడిప్పుడు తెలుగు సినిమాటోగ్రాఫర్స్‌ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. జె.కె పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. తనను ఎవరూ గుర్తించలేదు. ఇప్పటి జనరేషన్‌లో చాలా మంది మంచి టెక్నీషియన్స్‌ వస్తున్నారు. అలాంటి టెక్నీషియన్స్‌ ఇంకా రావాలి. మన సినిమాలను మనమే చేసుకోవాలి. జె.కెను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవాలనే నిర్ణయం హనుదే.

- బన్ని, నేను, చరణ్‌ అందరం చిన్నప్పట్నుంచి కలిసే పెరిగాం. ఒకరి కష్టాలు మరొకరికి బాగా తెలుసు. ఇప్పుడు బన్నిని పిలవగానే వచ్చి మా యూనిట్‌కు సపోర్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా తనకు థాంక్స్‌.

- ఆల్బమ్‌ బాగా రావడానికి క్రెడిట్‌ హను రాఘవపూడి, విశాల్‌ చంద్రశేఖర్‌కే దక్కుతుంది.

- డబ్బులే సంపాదించుకోవాలంటే వరుస సినిమాలు చేయవచ్చు. కానీ నేనలా కాదు. ఓ సినిమా అనుకుంటే హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టి పనిచేస్తాను. మిగతాది దేవుడి దయ. నేను సినిమాలను, దర్శకులను నమ్ముకున్నాను. వారు నాకెంతో మంచి సినిమాలనే ఇచ్చారు.

interview gallery



- సుధీర్‌ వర్మ సినిమా 50 శాతం పూర్తయ్యింది. మరో షెడ్యూల్‌ చేస్తే సినిమా పూర్తవుతుంది. 1980లో, ప్రెజెంట్‌లో జరిగే ఓ గ్యాంగ్‌స్టర్‌ స్టోరీ ఇది. చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను.

- 96 రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తాం. తమిళంలో సినిమా చూశాను. ఫెంటాస్టిక్‌ మూవీ.

- నా కెరీర్‌లో నేను ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. మంచి సినిమాలు చేయూలనే ఆలోచనతోనే సాగాను. ఓ జోనర్‌లో సినిమా చేసిన తర్వాత వెంటనే అదే జోనర్‌ సినిమాలో నటించకూడదని అనుకున్నాను. వేరియేషన్‌ ఉన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. నేను అన్ని రకాల జోనర్‌ మూవీస్‌ చేసుకుంటూ వస్తున్నాను.

- నా మార్కెట్‌ను నా సినిమాలే పెంచుతున్నాయి. ఈ సినిమాకు కూడా ఓవర్‌ బడ్జెట్‌ అయ్యిందని అన్నారు. కానీ కంటెంట్‌ నమ్ముకుని వెళుతున్నాం. క్రియేటివ్‌గా కథను నమ్ముకుని, నిర్మాత, ఇతర టీం సపోర్ట్‌ చేసినప్పుడు మంచి ఔట్‌పుట్‌ కోసం చూడాలంతే.

- తమిళంలో సినిమాలు చేయమని అడుగుతున్నారు. కానీ ప్రస్తుతం తెలుగులోనే కంఫర్ట్‌గా ఉన్నాను. టైం కూడా లేదు.

- శతమానం భవతి చేసేటప్పుడు నేషనల్‌ అవార్డు వస్తుందని చేయలేదు. మంచి సినిమా చేయాలనే చేశాం. అవార్డు కొట్టాలని చేస్తే ఏ సినిమా ఆడదు.

- నేను బౌండెడ్‌ స్క్రిప్ట్స్‌ రాకపోతే ఆన్‌ సెట్స్‌ వెళ్లాలనుకోను. కాబట్టి నా సినిమాలు లేట్‌ అవుతున్నాయనుకోవడంలో అదొక కారణం అని కూడా చెప్పొచ్చు.

- వరుణ్‌ నా తమ్ముడే కదా!.. రెండు సినిమాలు ఆడాలి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్‌ పండగలకు ఎక్కువ సినిమాలు వచ్చినా మంచి సినిమాలు సక్సెస్‌ను సాధించాయి. అంతరిక్షం వంటి సినిమాలు రేర్‌గా ఉంటాయి.

- ఇప్పుడున్న హీరోల్లో ఎవరి స్పేస్‌ వారికుంది. నేను కాంపీటీషన్‌గా ఎక్కడా ఫీల్‌ కాలేదు. ఎవరి ఫాలోయింగ్‌ వారికుంది. అందరం హ్యాపీగానే కలుస్తుంటాం. ఎవరూ కాంపీషన్‌గా ఫీల్‌ కావడం లేదు.

- నాకే.. నేను అన్ని జోనర్‌ సినిమాలు చేయలేను అని చెప్పేవారు. అయితే సుజిత్‌ 'రన్‌ రాజా రన్‌'తో నా బాడీ లాంగ్వేజ్‌ అంతా మార్చేశాడు. అక్కడి నుండి ప్రతి సినిమాకు స్టయిల్‌ మారుతూనే ఉంటుంది.

- సుధాకర్‌గారు టెస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అలాగని ఎక్కడా పరిధిని దాటి ఖర్చు పెట్టలేదు. నన్ను, హనుని నమ్మి సినిమాకు ఏదీ అవసరమో ఆ విషయంలో ఖర్చు పెడుతూ వచ్చారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved