20 September 2018
Hyderabad
ప్రేమ కథా చిత్రమ్', 'భలే మంచి రోజు' రీసెంట్‌గా 'సమ్మోహనం'తో సూపర్‌హిట్స్ సాధించి హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు. సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా తనకంటూ ప్రత్యేకతను సాధించుకుని.. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ విశేషమైన గుర్తింపుని సంపాదించుకున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తూ ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో శ్రీమతి రాణి పోసాని సమర్పణలో నిర్మించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. నభా నటేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న వరల్డ్‌వైడ్‌గా హయ్యస్ట్ స్క్రీన్‌లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్‌బాబుతో ఇంటర్వ్యూ.
అందుకే నిర్మాతగా మారాను...
8 ఏళ్ళుగా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నాను. ఫస్ట్‌టైమ్ ఒక డిఫరెంట్ డిజిగ్నేషన్‌తో (నిర్మాతగా) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇది నాకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో 'నన్ను దోచుకుందువటే' ప్రొడ్యూస్ చేశాను. ఈ బేనర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను ఇన్‌షియల్ స్టేజ్‌లో చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫీస్‌లకి తిరిగాను. కథలు వింటూ టెక్నీషియన్స్‌ని, నిర్మాతల్ని ఒక ఛాన్స్ కోసం కలవడం జరిగింది. 90 శాతం డిజప్పాయింట్‌మెంటే ఎదురయ్యేది. చాలామంది టాలెంట్ వున్నవారు ఇండస్ట్రీ వదిలి యు.ఎస్.కి వెళ్ళారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వెళ్ళారు. అప్పుడు నేను ఒకటి అనుకున్నా. హీరోగా మంచి పొజిషన్‌లో ఉండి నాకొక మార్కెట్ వుంటే చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అని అప్పుడే డిసైడ్ అయ్యాను. లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేసాం.
బేనర్ ఎప్పుడూ ఉంటుంది..
- బేసిగ్గా ఒక యాక్టర్ అనేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫేడ్‌ఔట్ అయిపోవచ్చు. కానీ ఒక బేనర్ అనేది తరతరాలుగా ఉండిపోతుంది. రేపు మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక సినిమాలు తీస్తారు. వాళ్ళ పిల్లలు తీయడానికి వీలుంటుంది. ఉదాహరణకి సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లాగ. అదీ నా ఫీలింగ్. అందుకే ఈ బేనర్ స్థాపించా.
కథ నచ్చడం వల్లనే...
- ఒక యాక్టర్‌గా నేను 9 సినిమాలు చేశాను. అవన్నీ కొత్త ప్రొడ్యూసర్స్. కొత్త డైరెక్టర్స్‌తోనే ఎక్కువ చేశాను. ఒక హీరో అన్నీ విషయాలు చూసుకోవాలి. ఏదైనా సినిమా రిజల్ట్ తేడా వస్తే ప్రేక్షకులు, అభిమానులు ఆ హీరోకే సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని అంటగడతారు. ఈ టైమ్‌లోనే అని కాదు.. ఏదో ఒక టైమ్‌లో రెస్పాన్స్‌బిలిటీగా ఫీలై ప్రొడ్యూస్ చెయ్యాలి. నా కెరీర్ మొత్తంలో 90 శాతం కొత్త వాళ్ళతోనే చేశాను. న్యూ కామర్స్ ద్వారా కొత్తగా చాలా విషయాలు నేర్చుకున్నాను. మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. కొత్త వాళ్ళ పొటెన్షియాలిటీని క్యాచ్ చెయ్యగలననే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి టేకోవర్ చేశాను.
స్క్రిప్ట్‌ని దృష్టిలో పెట్టుకుని...
- నేను ఎప్పుడూ స్క్రిప్ట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తాను. ఆ తర్వాత బిజినెస్ మార్కెట్ గురించి ఆలోచిస్తాను. ప్రొడక్షన్‌లోకి దిగాక ఏ సీన్‌కి ఎంత పెట్టాలి అనేది తెలుస్తుంది. నా బేనర్‌కి మంచి గుర్తింపు రావాలి. హీరోకి మంచి సక్సెస్ రావాలి అని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశాను. ఈ ప్రొడక్షన్‌లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరినీ కన్‌సిడర్ చేసి నేను డెసిషన్స్ తీసుకునేవాడ్ని.
పాత్ర గురించి...
- ఈ చిత్రంలో కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఇది ఒక కామన్ పీపుల్స్ కథ. వారంలో 6 రోజులు మేం కష్టపడి 7వ రోజున లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునేవిధంగా హీరో క్యారెక్టర్ వుంటుంది. మనందరికీ రిలేటెడ్‌గా, మన చుట్టూ ప్రక్కల జరుగుతున్న కథలా వుంటుంది. పద్దగా ఎమోషన్స్ లేని ఓ బాస్‌గా కనిపించబోతున్నాను. చాలా ఫోకస్డ్‌గా నా క్యారెక్టర్ ఉంటుంది. నా గోల్స్ తప్ప, వేరే ఎవర్నీ పట్టించుకోను. ప్రాక్టికల్ పర్సన్‌లా వుంటాడు. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాక తనకి తెలియకుండానే తాను ఎలా ఛేంజ్ అయ్యాడు?. ఆ క్రమంలో తను ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది చిత్రం మెయిన్ కథ. చాలా ఆసక్తికరంగా నా పాత్ర వుంటుంది.
హీరోయిన్ గురించి...
- నభా నటేశ్ క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. అన్నీ క్యారెక్టర్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా వుంటాయి. లీడ్ పెయిర్ చాలా రియలిస్టిక్‌గా వుంటుంది.
మహేశ్ తో సినిమా చేస్తా అయితే..
- నేను చాలా షార్ట్ టెంపర్‌ని. నాకు ఎమోషన్స్ ఎక్కువ. సినిమాలో గ్రాఫ్ ఛేంజ్ అవుతుంది. మంచి కథ వుంటే మహేష్‌గారితో తప్పకుండా మా బేనర్‌లో చేస్తాను. ఆ స్టేజ్‌కి రావాలి అంటే ఇంకా నేను మరిన్ని సినిమాలు తీసి నిర్మాతగా ప్రూవ్ చేసుకోవాలి.
ఇండిపెండెంట్‌గా ఎదగాలనుకున్నా...
- మామయ్య, మహేష్ రికమెండేషన్స్‌తో కాదు. పద్మాలయా, కృష్ణ ప్రొడక్షన్స్, ఇందిర ప్రొడక్షన్స్, మహేష్ బేనర్ వున్నా కూడా నన్ను రికమండ్ చేయండి అని ఎవరినీ అడగలేదు. నేను మొదటి నుండి ఇండిపెండెంట్‌గా ఎదగాలనుకున్నాను. నాకు అలాగే ఇష్టం. లేదంటే మా నాన్న పెట్టిన కంపెనీస్‌లో కూర్చుని సాయంత్రం 5 గంటలకి ఇంటికి వచ్చి పిల్లలతో సరదాగా గడపొచ్చు. కానీ నాకు లైఫ్‌లో ఇంకా ఏదో సాధించాలన్న పట్టుదల నాలో వుంది. అందుకే హీరోగా, నిర్మాతగా చేస్తున్నాను.
పెద్దగా ఏం సంపాదించింది లేదు...
- నా సినిమా కెరీర్ మొత్తంలో నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. అది అందరికీ తెల్సు. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే పని చేశాను. కొన్ని సినిమాలు ఫ్రీగా చేశాను. ఈ సినిమా విషయంలో ఆర్థికంగా నేను చాలా సేఫ్‌లోనే వున్నాను. ఈ సినిమా విజయం కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.
షార్ట్ ఫిలిం.. సినిమా కథ రెండూ నచ్చాయి...
- ఆర్.ఎస్. నాయుడు తీసిన 'స్పందన' అనే షార్ట్ ఫిలిం నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత అతను నాకు ఒక కథ చెప్పాడు. అది కూడా బాగా నచ్చింది. అదే 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమా విషయంలో అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒక డైరెక్టర్‌గా అతను సినిమాని బాగా డీల్ చేశాడు. ఔట్‌పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా వున్నా.
మల్టీస్టారర్ చేస్తా..
- ప్రస్తుతానికి సోలో హీరోగా చేస్తున్నాను. మంచి కథ వుంటే తప్పకుండా మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తాను.
కథ ఏంటంటే...
అర్బన్ సిటీ బేస్డ్‌లో జరిగే కథ ఇది. తెలుగు సెన్సిబులిటీస్ వుండే క్యారెక్టర్స్ ఈ చిత్రంలో వుంటాయి. ఈ కథకి అచ్చ తెలుగు టైటిల్ అయితే బాగుంటుంది అని డైరెక్టర్ ఆర్.ఎస్. నాయుడు సజెస్ట్ చేయడంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది.
కాన్ఫిడెంట్‌గా ఉన్నాం...
- సుధీర్ అంటే ఫైట్లు, డ్యాన్స్‌లు చేస్తాడు. సాఫ్ట్ రోల్స్ చేయడు అనే రూమర్ వుంది. కానీ ఈ చిత్రంలో సాఫ్ట్ రోల్‌ని అటెంప్ట్ చేశాను. ఔట్‌పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని హోప్‌తో వున్నాం. మ్యూజిక్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కొక్క సాంగ్ ఒక్కో జోనర్‌లో వుంటుంది. టీమ్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్.
తదుపరి చిత్రం..
- 'వీర భోగ వసంత రాయలుస విడుదలవుతుంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో హిందీ నిర్మాత అబుడెన్‌షి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం వుంటుంది.