pizza
Suresh Babu interview (Telugu) about Adhugo
సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల అభిరుచి మారుతుంది - డి.సురేశ్ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

6 November 2018
Hyderabad

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా `అదుగో`. ఈ సినిమాలో పంది పిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్‌, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై సినిమా రూపొందింది. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. న‌వంబ‌ర్ 7న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డి.సురేశ్‌బాబు ఇంట‌ర్వ్యూ....

`అదుగో` క‌థ విన‌గానే ఏమ‌నిపించింది?
- ర‌విబాబుతో నాకు అల్ల‌రి సినిమా నుండి మంచి ప‌రిచ‌య‌మే ఉంది. మా కాంబినేష‌న్‌లో చాలా సినిమాలు చేశాం. సోగ్గాడు అనే సినిమా మిన‌హా అన్ని సినిమాలు మాకు మంచి లాభాల‌నే తెచ్చిపెట్టాయి. అదుగో క‌థ చెప్ప‌గానే నాకు కొత్త‌గా అనిపించింది.

సినిమా విడుద‌లకు చాలా స‌మ‌యం ప‌ట్టింది క‌దా?
- పందిపిల్లతో సినిమా చేయాలనకున్నప్పుడు యానిమేట్రాన్‌ పిగ్‌తో సినిమా చేయాలనుకున్నాం. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అది వర్కవుట్‌ కాలేదు. తర్వాత త్రీడీలో చేయాలనుకుని చేశాం. సినిమా మేకింగ్‌ ప్రాసెస్‌లో తను ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. అందుకే సినిమాకు సంబంధించిన జయాపజయాల క్రెడిట్‌ అంతా తనకే దక్కుతుంది. కానీ ఏదీ చేసినా మనల్ని తను చేసింది కరెక్ట్‌ అని మనల్ని కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా విషయంలో తను చాలా నమ్మకంతో ట్రావెల్‌ చేశాడు. రెండున్నర సంవత్సరాలు ఎంతో ఓపికగా కష్టపడ్డాడు. ఓ దశలో 'ఎందుకు వదిలేద్దాం' అని చెప్పినా ర‌విబాబ ఒప్పుకోలేదు.

కొత్త సినిమాల‌కు ఎక్కువ‌గా స‌పోర్ట్ చేస్తున్నారు క‌దా?
- రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. డిఫరెంట్‌గా అనిపించిన 'పెళ్ళిచూపులు', 'కేరాఫ్‌ కంచరపాలెం' సహా కొన్ని సినిమాలకు నా వంతుగా సహకారం అందించాను. కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలకు సాయపడేంత స్థాయిలోనే ఉన్నాననే అనుకుంటున్నాను. రెగ్యులర్‌ చిత్రాలైనా, డిఫరెంట్‌ చిత్రాలైనా డబ్బులు రావచ్చు, పోవచ్చు. కానీ చెప్పుకోవడానికి డిఫరెంట్‌ సినిమాలైతే బావుంటాయి కదా!. చాలా మంది కొత్త టెక్నీషియన్స్‌ సపోర్ట్‌ లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి మన వంతుగా సపోర్ట్‌ అందించాలి. లేకుంటే సినిమా కొత్తదనాన్ని సంతరించుకోదు.

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ దొరుకుతుందిగా?
- ఇండస్ట్రీ అంతా కమర్షియాలిటీ, కన్వినెంట్‌కు అలవాటు పడిపోయింది. శంకర్‌, రాజమౌళి వంటి దర్శకులు మాత్రమే అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచిస్తున్నారు. మిగిలిన టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌ మూవీస్‌ను చేయడానికి దర్శకులు ఆలోచిస్తే కొత్త సాంకేతికత వస్తుంది. మన ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను చూడాలి. ఇప్పుడిప్పుడే మన ప్రేక్షకులు కూడా కొత్త సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం ఆడియెన్స్‌ అభిరుచి మారుతుంది. థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల శాతం తగ్గిపోయింది. అందువల్ల సింగిల్‌ థియేటర్స్‌ మనుగడ ఎంతో కష్టమైంది. మల్లీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ ప్రకారం చేస్తేనే మనుగడ సాధ్యమవుతుంది. అయితే ఈ విధానానికి పెద్ద నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే థియేటర్స్‌కు గడ్డు పరిస్థితి తప్పదు

తదుపరి చిత్రాలు... ?
- ప్రస్తుతం మా బ్యానర్‌లో మహేంద్ర అనే కొత్త దర్శకుడితో పూర్తి తెలంగాణ యాసతో 'దొరసాని' సినిమా చేస్తున్నాం. అలాగే రవికాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో కొరియన్‌ చిత్రం 'మిస్‌ గ్రాని'ని రీమేక్‌ చేస్తున్నాం. వెంకటేశ్‌, నాగచైతన్యతో 'వెంకీమామ', అలాగే వెంకటేశ్‌తో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా.. తరుణ్‌ భాస్కర్‌తో మూడు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాం. గుణశేఖర్‌ దర్శకత్వంలో హిరణ్య కశిప ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. రానా ఈ ప్రాజెక్ట్‌ను డీల్‌ చేస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో నిజ ఘటనల ఆధారంగా ఓ బయోపిక్‌ ప్లాన్‌ చేస్తున్నాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved